Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు..
షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్ తో బాధపడేవారు తరచుగా ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య, వారిని గందరగోళానికి గురిచేసే ప్రశ్న ఒకటుంది. రాత్రిపూట నేను చాలా తేలికపాటి ఆహారం తీసుకున్నాను, లేదా అసలు ఏమీ తినకుండానే పడుకున్నాను. అయినా సరే ఉదయం నిద్రలేచి చూసేసరికి నా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎందుకు అంత ఎక్కువగా ఉంటున్నాయి? అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారా? అయితే కంగారు పడవద్దు, దీని వెనుక మీ తప్పు ఏమీ లేదు.

ఈ వింతైన ఆరోగ్య పరిస్థితికి కారణం డాన్ ఫినామినన్ అని పిలువబడే ఒక సహజమైన హార్మోన్ల ప్రక్రియ. ప్రముఖ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ శ్వేతా పంచల్.. ఉదయం పూట మన శరీరంలో ఏం జరుగుతుంది? ఖాళీ కడుపుతో ఉన్నా షుగర్ ఎందుకు పెరుగుతుంది? అన్న విషయాలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో చాలా ఆసక్తికరంగా వివరించారు.
ఉదయం పూట బ్లడ్ షుగర్ అమాంతం ఎందుకు పెరుగుతుంది?
ఉదయం ఏమీ తినకపోయినా రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటానికి కారణం మీ దినచర్య లేదా ఆహార నియమాల్లో లోపం కాదు. ఇది డాన్ ఫినామినన్ వల్ల జరుగుతుంది. మనమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ముఖ్యంగా తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 8 గంటల మధ్య, మన శరీరంలో హార్మోన్లు అకస్మాత్తుగా వేగంగా మారుతుంటాయి.
మనం ఉదయం నిద్రలేచి చురుకుగా పనిచేయడానికి వీలుగా, శరీరం కార్టిసాల్, గ్రోత్ హార్మోన్ లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు లివర్ కి ఒక సిగ్నల్ ని పంపుతాయి. ఆ సంకేతం అందగానే లివర్ తనలో స్టోర్ చేసుకున్న గ్లూకోజ్ ను రక్తంలోకి విడుదల చేస్తుంది. సాధారణ వ్యక్తులలో విడుదలైన ఈ గ్లూకోజ్ ను ఇన్సులిన్ నియంత్రిస్తుంది. కానీ మధుమేహ రోగుల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం లేదా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోయి, ఉదయం షుగర్ లెవెల్స్ పెరిగేలా చేస్తుంది.
ఉదయం పూట షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవడం ఎలా?
రాత్రి భోజనం త్వరగా ముగించండి: రాత్రి 7 గంటల లోపే మీ భోజనం పూర్తి చేయడానికి ప్రయత్నించండి. రాత్రి వేళ చాలా ఆలస్యంగా, కడుపు నిండా భారీగా తినడం వల్ల రాత్రంతా గ్లూకోజ్ విడుదల ప్రక్రియ దెబ్బతింటుంది.
నిద్రలేవగానే ముందుగా నీళ్లు తాగండి: చాలామందికి బెడ్ కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ అలవాటును వెంటనే మానుకోవాలి. ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మీ రోజు ఎంతో ఆరోగ్యంగా ప్రారంభమవుతుంది.
ప్రోటీన్లతో కూడిన బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి: మీరు నిద్రలేచిన 30 నిమిషాలలోపు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే అల్పాహారాన్ని తీసుకోవాలి. ఉదయాన్నే ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా స్థిరపడి, ఎనర్జీ ఇస్తాయి.
ఉదయం కనీసం 10 నిమిషాల నడక: నిద్రలేచి నీళ్లు తాగిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు ఇంట్లోనే లేదా ఆరుబయట నడవండి. మీరు నడిచినప్పుడు మీ కండరాలు సంకోచిస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ అవసరం లేకుండానే కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను గ్రహించి, షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి.
బ్రేక్ ఫాస్ట్ ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు: బరువు తగ్గాలనో లేదా షుగర్ కంట్రోల్ అవుతుందనో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం అల్పాహారం మానకూడదు. ఇలా చేస్తే శరీరంలో స్ట్రెస్ హార్మోన్ (కార్టిసాల్) స్థాయిలు మరింత పెరిగి, పరిస్థితి తీవ్రమవుతుంది
.
మీ శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోండి
ఉదయం పూట షుగర్ ఎక్కువగా ఉందని చూడగానే కంగారు పడిపోయి వెంటనే మందుల డోస్ పెంచేయాల్సిన అవసరం లేదని శ్వేత స్పష్టం చేస్తున్నారు. మీ శరీరం మీకు ఏం చెప్పాలనుకుంటుందో ముందు అర్థం చేసుకోండి. మందులు వేసుకోవడం ఒక్కటే పరిష్కారం కాదు. పైన చెప్పిన విధంగా మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ డాన్ ఫినామినన్ ను సమర్థవంతంగా ఎదుర్కొని, ఉదయం పూట పెరిగే బ్లడ్ షుగర్ కు సులభంగా చెక్ పెట్టవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications