Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
రోజూ 2 ఖర్జూరాలు..ఆ టైంలో తింటే మీ జీవితం మారిపోతుంది!
మనదేశంలో చక్కెర వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అధికంగా చక్కెర విని యోగం కన్నా అనేక ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే తీపి విషయంలో చక్కెరకు ప్రకృతి ప్రసాదించిన ప్రయత్యామ్నాయం ఖర్జూరం. చక్కెర కన్నా ఆరోగ్యకరమైన,పోషకాలతో ఖర్జూరం నిండి ఉంటుంది. తింటే తియ్యగా,ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేనే ఖర్జూరాన్ని ప్రకృతి ప్రసాదించిన శక్తి గుళిక అనవచ్చు. ఖర్జూరం మనకు ఎలా మేలు చేస్తుందో ఇక్కడ చూడండి.
తక్షణ శక్తి
రోజంతా పనిచేసి అలసిపోయారా? నీరసంగా అనిపిస్తోందా? అయితే వెంటనే రెండు ఖర్జూరాలు నోట్లో వేసుకోండి. ఇందులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందించి, నీరసాన్ని పారదోలుతాయి. అందుకే వ్యాయామం చేసేవారికి ఇది ఒక అద్భుతమైన ప్రీ వర్కౌట్ స్నాక్. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు మూడు ఖర్జూరాలు తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా శరీరంలో వేడి పుట్టి, అంతర్గత బలం పెరుగుతుంది.

రక్తహీనతకు సహజ పరిష్కారం
ఐరన్ లోపం, రక్తహీనత వంటి సమస్యలు ముఖ్యంగా మహిళలను ఎక్కువగా వేధిస్తుంటాయి. దీనికి ఖర్జూరం ఒక అద్భుతమైన సహజ పరిష్కారం. ఇందులో పుష్కలంగా ఉండే ఐరన్, శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచి, రక్త నాణ్యతను మెరుగుపరుస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఇది ఒక వరం లాంటిది. ఇది కడుపులో శిశువు ఎదుగుదలకు సహాయపడటమే కాకుండా ప్రసవాన్ని సులభతరం చేస్తుంది, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.
జీర్ణవ్యవస్థకు ఆప్తమిత్రుడు
ప్రస్తుతం ప్రజల ఆహార అలవాట్లు,జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఖర్జూరం ఒక మెడిసిన్ లా సహాయపడుతుంది. ఇందులో సమృద్ధిగా ఉండే ఫైబర్, జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని సులభంగా నివారిస్తుంది. రోజూ ఖర్జూరాలను తినడం వల్ల కడుపు శుభ్రపడి, గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయి.
శరీరానికి రక్షణ కవచం, ఎముకలకు బలం
ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరంలో తిష్ట వేసిన ఫ్రీ రాడికల్స్ అనే శత్రువులతో పోరాడతాయి. తద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి మినరల్స్ ఎముకలను ఉక్కులా దృఢంగా మారుస్తాయి. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది.
మానసిక ప్రశాంతతకు మార్గం
శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమైపోయాయి. ఖర్జూరంలో ఉండే విటమిన్ బి6, మెగ్నీషియం మెదడు పనితీరును మెరుగుపరిచి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, సుఖమైన నిద్రకు దోహదపడుతుంది. ప్రతిరోజూ కేవలం 3-4 ఖర్జూరాలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
