Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
50 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా.. హృతిక్ 'వార్ 2' ఫిట్‌నెస్ సీక్రెట్
హృతిక్ రోషన్..ఈ పేరు తెలియని సినీ అభిమానులు చాలా తక్కువ మంది ఉంటారు. సినిమాలు చూసే ఎవ్వరికైనా ఈ పేరు వింటే నటన, డ్యాన్స్, కండలు తిరిగిన శరీరం గుర్తుకొస్తాయి. గ్రీక్ గాడ్ గా బాలీవుడ్ లో గుర్తింపు పొందిన హృతిక్ రోషన్..2000వ సంవత్సరంలో కహో నా ప్యార్ హై సినిమాతో వెండితెరకు పరిచయ్యాడు. ఫస్ట్ మూవీతోనే దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. రెండు దశాబ్దాలు దాటినా, 51 ఏళ్ల వయసులో కూడా ఆయన ఫిట్ నెస్ విషయంలో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా విడుదలైన వార్ 2 సినిమాలో హృతిక్ సరికొత్త లుక్‌తో అభిమానులను మరోసారి మంత్రముగ్ధుల్ని చేశాడు.
హృతిక్ చేయి కండరాల పరిమాణం (బైసెప్స్) చూసి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. వార్ మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్ లో ఆయన కండరాలు మరింత బలిష్టంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇంతటి అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశారనే రహస్యాన్ని ఆయన వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్ స్వాప్నిల్ హజారే ఇటీవల బయటపెట్టారు.

వార్ 2 కోసం ప్రత్యేక శిక్షణ
వార్ 2 ఒక భారీ యాక్షన్ చిత్రం కావడంతో, ఇందులో హృతిక్ పోషించిన గూఢచారి పాత్రకు ప్రత్యేకమైన శరీరాకృతి అవసరమని స్వాప్నిల్ తెలిపారు. ముఖ్యంగా ఆయన చేయి కండరాల పరిమాణం భారీగా కనిపించేలా, వీపు భాగం నడుము నుండి V ఆకారంలో పర్ఫెక్ట్‌గా ఉండేలా తీర్చిదిద్దడంపై దృష్టి సారించారు.
గాయాలు కాకుండా స్మార్ట్ వర్కౌట్
హృతిక్‌కు ఇప్పుడు 50 ఏళ్లు దాటడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవడం తన ప్రథమ కర్తవ్యమని స్వాప్నిల్ అన్నారు. గతంలో హృతిక్ వెన్నెముక, మోకాళ్ల నొప్పులతో బాధపడ్డారు. అందుకే భారీ బరువులు ఎత్తే వ్యాయామాలకు బదులుగా, కండరాలను ఉత్తేజపరిచేందుకు సూపర్ సెట్స్, డ్రాప్ సెట్స్ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించారు. ఈ టెక్నిక్స్ ద్వారా తక్కువ బరువులతోనే కండరాలకు ఎక్కువ శ్రమ కలిగించి, వాటి పరిమాణాన్ని పెంచవచ్చని ఆయన వివరించారు.

హృతిక్ వర్కౌట్ ప్రణాళిక
స్వాప్నిల్ సలహా మేరకు హృతిక్ వారానికి నాలుగు రోజులు కఠినమైన వ్యాయామ ప్రణాళికను అనుసరించారు.
మొదటి రోజు: ఛాతీ (Chest) కండరాలకు సంబంధించిన వ్యాయామాలు.
రెండో రోజు: వీపు (Back) కండరాలను బలోపేతం చేసే వర్కౌట్లు.
మూడో రోజు: కాళ్ల (Legs) వ్యాయామాలకు కేటాయించారు.
నాలుగో రోజు: చేతుల కండరాల (Arms) కోసం ప్రత్యేక శిక్షణ.
దీంతో పాటు శరీరంలో కొవ్వు శాతాన్ని నియంత్రణలో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా కార్డియో వ్యాయామాలు చేసేవారు. వ్యాయామం తర్వాత శరీరం తేలికపడటానికి కూల్ డౌన్ సెషన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేవారు.
స్వాప్నిల్ మాటల్లో చెప్పాలంటే, "హృతిక్ తన శరీరాన్ని అర్థం చేసుకుని వర్కౌట్ చేస్తారు. శరీరం సహకరించిన రోజు ఎక్కువ సేపు, అలసటగా ఉన్నప్పుడు తక్కువ సేపు వ్యాయామం చేస్తారు. 50 ఏళ్ల వయసులో హృతిక్‌లా ఫిట్‌గా ఉండాలంటే కఠోర శ్రమ, క్రమశిక్షణకు మించిన ప్రత్యామ్నాయం లేదు అని స్పష్టం చేశారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని హృతిక్ మరోసారి నిరూపించాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
