Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
అసలైన ఆరోగ్యం అక్కడే..తొక్కతో తినాల్సిన 5 కూరగాయలు ఇవే
వేటినైనా తినడానికి కూడా ఓ పద్థతి ఉంటుంది. అవి పండ్లు అయినా,కూరగాయలు అయినా సరే పద్ధతి ప్రకారం తింటేనే వాటి పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. లేకుంటే ప్రయోజనాలు లభించకపోగా లేని అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. సాధారణం మనలో చాలామంది కూరగాయలను వండే ముందు వాటి తొక్క తీసి పడేస్తుంటారు. అయితే అసలు అరోగ్యం అక్కడే ఉందని మీకు తెలుసా?
కొన్ని కూరగాయల తొక్కలలోనే అసలైన పోషకాల గని దాగి ఉంటుంది.
పొట్టు తీసేయడం వల్ల మన శరీరానికి అందాల్సిన ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ కోల్పోతాం. ముఖ్యంగా క్యారెట్, టొమాటో, వంకాయ, సొరకాయ, కీర దోసకాయ వంటి కూరగాయలను తొక్కలతో పాటు తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు మేలు జరుగుతుంది. ఆ 5 కూరగాయలను పొట్టుతో తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇక్కడ చూడండి.

క్యారెట్
క్యారెట్ తొక్కలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని తొక్కతో సహా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరానికి బీటా కెరోటిన్ అధిక మోతాదులో అంది కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీ రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. పచ్చి క్యారెట్ ను శుభ్రంగా కడిగి తేలికపాటి బ్రష్ తో రుద్ది నేరుగా సలాడ్ లో తినడం ఉత్తమం.
టొమాటా
టమాటా తొక్కలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా ఇది సహాయపడుతుంది. టమాటాను ఉడికించినప్పుడు లేదా వండినప్పుడు దీని ప్రభావం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అందుకే సలాడ్ లేదా సూప్ లలో తొక్కతో పాటు తీసుకోవడం ఎక్కువ ప్రయోజనకరం.
వంకాయ
వంకాయ ఊదా రంగు తొక్కలో ఆంథోసైనిన్ అనే మూలకం సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో వాపును తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్, పొటాషియం కూడా లభిస్తాయి. వంకాయ కూర వండేటప్పుడు తొక్కను తీసేయకుండా శుభ్రంగా కడిగి వండటమే మంచిది.
సొరకాయ
సొరకాయ తొక్క కూడా ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. సొరకాయ తొక్క మరీ మందంగా లేకపోతే దానిని సన్నగా తరిగి కూరలో కలిపి వండండి. దీనివల్ల కూర రుచి పెరగడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి.
కీర దోస
కీర దోస తొక్కలో సిలికా, పొటాషియం,ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. తొక్కను తీసి తినడం వల్ల ఈ అమూల్యమైన పోషకాలను మనం కోల్పోతాం. అందుకే, కీర దోసను శుభ్రంగా కడిగి తొక్కతో పాటే తినాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
