Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ డ్రై ఫ్రూట్స్‌ను నేరుగా కంటే నానబెట్టి తింటేనే ఎక్కువ ప్రయోజనం, కావాలంటే ట్రై చేయండి
ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ప్రస్తావన వచ్చినప్పుడు అందులో కచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. దాంతో పాటు వివిధ వంటకాల్లో వీటిని భాగం చేసుకుని తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఇందులో వివిధ రకాల పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డ్రై ఫ్రూట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ నేరుగా తినడం కంటే కూడా రాత్రంతా నానబెట్టి ఉదయమే తింటే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

బాదం:
బాదంలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు, అలాగే ఎసెన్షియల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. అత్యుత్తమ ఆహారాల్లో బాదం ముందు వరుసలో ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి బాదంలోని పోషకాలు సహాయపడతాయి. బాదంపప్పు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అయితే బాదం నుంచి ఎక్కువ ప్రయోజనాలు అందుకోవాలంటే వాటిని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిపై పొట్టు తీసేసి తింటే మరింత ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.
వాల్‌నట్స్:
దగ్గు, మలబద్ధకం వంటి సమస్యల నుంచి వాల్‌నట్స్ ఉపశమనం కలిగిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్స్ లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాల పరిమాణం కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాల్‌నట్స్ సమర్థవంతంగా పని చేస్తాయి. అయితే ఈ వాల్‌నట్స్‌ను నానబెట్టుకుని తింటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు పాలు లేదా నీటిలో వాల్‌నట్స్ నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం వీటిని తినాలి.
ఎండుద్రాక్ష:
నానబెట్టి తినే ఎండుద్రాక్ష వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండుద్రాక్ష తింటే వేడి చేస్తుందని చాలా మంది అంటారు. ఎండుద్రాక్షలోని ఈ వేడిని తగ్గించడానికి ఏకైక మార్గం వాటిని నీటిలో నానబెట్టడం. రాత్రి పడుకునే ముందు నీటిలో నానబెట్టి మరుసటి రోజు వీటిని తినడం వల్ల అందులోని పోషకాలు లభిస్తాయి. అలాగే వేడి చేయకుండా కూడా ఉంంది.
అంజీర్:
అంజీర్ పండ్లు చాలా రుచికరంగా ఉండాయి. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, పిండి పదార్థాలు, ఫైబర్, చక్కెర అన్ని సమృద్ధిగా లభిస్తాయి. అంజీర్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంజీర్ తింటే పునరుత్పత్తి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతారు. పీసీవోఎస్ సమస్యతో బాధపడే వారు అంజీర్లను నీటిలో నానబెట్టి తింటే మంచి ఫలితం ఉంటుంది. ప్రేగు కదలికలు, ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నానబెట్టిన అంజీర్లను తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
ఖర్జూరా:
ఖర్జూరాలను పవర్ హౌజ్ లకు వ్యవహరిస్తారు. ఖర్జూరాలు ఖనిజాలు, విటమిన్లతో నిండి ఉంటాయి. ఖర్జూరాల్లో పుష్కలంగా లభించే పొటాషియం నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఖర్జూరాల్లో ఉండే ఆర్గానికి సల్ఫర్ సీజనల్ అలర్జీలను నివారించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన ఖర్జూరాలు గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. నానబెట్టిన ఖర్జూరాలు తింటే హ్యాంగోవర్ కూడా తగ్గుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications