Latest Updates
-
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.!
ఉదయం పూట అమృతమే.. కానీ రాత్రి వీటిని తింటే ఎంత డేంజర్ తెలుసా.?
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రస్తుతం చాలా మంది సమతుల్య ఆహారంపై దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే తాజా పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్, సరైన మోతాదులో నాన్‌వెజ్ ఇలా అన్నిటినీ సమపాళ్లలో తీసుకుంటున్నారు. అయితే వాటిని ఏ టైంలో తీసుకుంటున్నారనే దానిపై ఎక్కువగా శ్రద్ధ వహించరు. కొన్ని ఆహార పదార్థాలను పగలు మాత్రమే తీసుకోవాలి. రాత్రి సమయంలో తీసుకుంటే మంచిది కాదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ పదార్థాలేంటి.. రాత్రిళ్లు ఎందుకు తీసుకోకూడదు. ఇక్కడ చూద్దాం.

కొన్ని ఆహార పదార్థాలను సరైన భోజన సమయంలో మాత్రమే తీసుకోవాలి. ఆ సమయం దాటితే గ్యాస్, ఉబ్బరం, జీర్ణక్రియపై ప్రభావం వంటి సమస్యలతో పాటు షుగర్ సమస్యలు పెరగడం, నిద్ర లేమి వంటివి తలెత్తుతాయి. అందుకే కేవలం మీ డైట్‌లో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మాత్రమే ఉండటమే కాకుండా వాటిని సరైన సమయంలో తినడం చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అరటిపండ్లు
మన శరీరానికి తక్షణ శక్తి కోసం అరటిపండ్లు మేలు చేస్తాయి. అరటిపండ్లలోని పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి దోహదపడతాయి. అయితే ఈ పండ్లను పగటి సమయంలో మాత్రమే తీసుకోవాలి. డిన్నర్ సమయంలో తీసుకుంటే గ్యాస్ సమస్య ఏర్పడవచ్చు. బరువు పెరిగే అవకాశం ఉంది. శ్లేష్మం పెరిగే ప్రమాదం ఉంది. జీర్ణక్రియ శక్తి బలహీనంగా ఉన్నవారు రాత్రి సమయంలో అరటిపండ్లు తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.
పెరుగు
ప్రతిరోజూ భోజనంలో పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మజ్జిగ రూపంలో తీసుకుంటే వేడి తగ్గించి చలవ చేస్తుంది. పెరుగులోని ప్రొబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా జీర్ణక్రియకు దోహదపడుతుంది. అయితే పెరుగు రాత్రిపూట తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు ఏర్పడవచ్చు. అంతేకాకుండా జీర్ణ సమస్యలు సైతం ఏర్పడతాయి.

కొబ్బరి నీరు
శరీరం ఎప్పుడూ హైడ్రేడెట్‌గా ఉండటం కోసం కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయి. ఒక్క కొబ్బరి బోండాం నీళ్లు తాగడం ద్వారా మూత్రపిండాల ఆరోగ్యానికి దోహదపడుతుంది. వ్యర్థాలను సులభంగా ఫిల్టర్ చేసి బయటకు తొలగిస్తుంది. ఎలక్ట్రోలైట్‌లు తిరిగి లభించడంతో పాటు జీర్ణవ్యవస్థను సులభతరం చేస్తుంది. అయితే రాత్రి సమయంలో తీసుకోవడం ద్వారా తరచూ మూత్ర విసర్జనతో నిద్రకి భంగం కలగవచ్చు. దీంతో అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంది.
మొలకలు
పెసలు, రాగులు, శనగలు వంటి వాటితో చేసుకునే మొలకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండటం ద్వారా రోజూ సరైన మోతాదులో తీసుకుంటే రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు. అయితే రాత్రిపూట తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరంగా, భారంగా అనిపిస్తుంది. దీంతో తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది.

డ్రైఫ్రూట్స్
బాదం, వాల్‌నట్స్, ఎండు ద్రాక్ష వంటి వాటిని రాత్రి నానబెట్టి ఉదయం మాత్రమే తీసుకోవాలి. తద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శరీరానికి శక్తి అందుతుంది. అయితే రాత్రిపూట తీసుకోవం ద్వారా కేలరీలు పెరిగే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.
ప్రతి వ్యక్తి శరీర పనితీరు, ఆరోగ్యం భిన్నంగా ఉంటుంది. జీర్ణశక్తి కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే మధుమేహం, ఎసిడిటీ, కిడ్నీ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైట్ పాటించే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు భోజనంలో మార్పులు చేసుకోవాలి. భోజనాన్ని తప్పనసరిగా సరైన మోతాదులో, సమతుల్య ఆహారం, సరైన సమయంలో తీసుకోవడం ద్వారా ప్రయోజనాలు ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
