Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.!
వంటగది అంటే కేవలం వంట చేసే ప్రదేశంగానే భావిస్తారు. కానీ ఆరోగ్యానికి పునాది ఇక్కడే ఉంటుందని మీకు తెలుసా. మీ ప్రతి అనారోగ్య సమస్యకి వంటగదిలో మీరు చేసే చిన్న చిన్న తప్పులే కారణమవుతాయని ఎప్పుడైనా అనుకున్నారా.? ఆహార భద్రత, కిచెన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ హెల్త్ సురక్షితంగా ఉంటుందో నిపుణులు చెబుతున్నారు.

ఉదయం టీ, కాఫీ మొదలుకొని.. టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇలా ఎక్కువ సమయం వంటగదిలోనే గడపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన భోజనం కోసం తాజా, శుభ్రమైన కూరగాయలు, కారం, మసాలాల నాణ్యత, తాజా భోజనం ఉండేలా చూసుకుంటూ వాటిపైనే దృష్టి సారిస్తారు. కానీ వంట పాత్రల గురించి, ఆహార పదార్థాలను నిల్వ చేసే డబ్బాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా.? మీ ఆరోగ్యంపై వాటి శుభ్రతే ప్రభావం చూపిస్తుందని తెలుసా.?
వంట పాత్రలు, డబ్బాల పరిశుభ్రత ఆరోగ్యంపైనే కాదు ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు ఉంటున్నారు. వైద్య ఖర్చుల కారణంగా ఇంటి ఆర్థిక భద్రతపైనా ప్రభావం పడుతుంది. అందుకే వంటగది పరిశుభ్రతపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా హోటళ్లు, రెస్టారెంట్లలోనూ వంటగదులు చాలా విశాలంగా ఉంటున్నాయి. ఇక కొన్ని చోట్ల వాటి దయనీయ పరిస్థితి ఎలా ఉందో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వస్తున్నాయి. అందుకే ఆహార భద్రతా నియమాలు పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వంటగదిలో మీరు రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆహారాన్ని కలుషితం చేసి అనారోగ్యానికి దారి తీసే ప్రమాదం ఉంది. కూరగాయలు, మాంసం కట్ చేసే చాపింగ్ బోర్డు వంటి వాటిని సరిగ్గా శుభ్రం చేయకుండా మరుసటి రోజు ఉపయోగించకూడదు. లేదంటే వాటిపై చేరిన బ్యాక్టీరియా భోజనంలోకి వ్యాపించే ప్రమాదం ఉంది.
పాత కాలంలో కొబ్బరి పీచులతో గిన్నెలను శుభ్రం చేసేవారు. పాత్రలు తోమడానికి బూడిద లేదా మట్టి ఉపయోగించేవారు. దీని ద్వారా వాటిలో ఎలాంటి రసాయనాలు లేని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేవి కాదు. వాటిని తరచూ మారుస్తుండేవారు. కానీ ఇప్పుడు స్పాంజ్‌లు, బ్రష్‌లు కిచెన్‌లో తిష్ట వేసుకున్నాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు మార్చడం మంచిది. పాత్రలు కడిగిన ప్రతిసారీ స్పాంజ్, సబ్బును శుభ్రం చేయాలి. లేదంటే అందులోని తేమ కారణంగా క్రిములు చేరే ప్రమాదం ఉంది.
చాలా మంది డీప్ ఫ్రైలకి వాడిన నూనెను పదే పదే మళ్లీ వేడి చేసి వాడుతుంటారు. కానీ ఇది చాలా తప్పు. ఒకసారి డీప్ ఫ్రైకి ఉపయోగించిన నూనెను ఎక్కువ సార్లు వేడి చేయకుండా వెంటనే వేరే కూరల్లోకి వాడేయడం లేదా పారబోయడం మంచిది. ఎక్కువ కాలం పాటు ఉంచితే అందులో బ్యాక్టీరియా మన కడుపులోకి చేరి అనారోగ్యానికి దారి తీస్తుంది. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే వినియోగించాలి.

వంటలకు ఎక్కువగా అల్యూమినియం పాత్రలను వాడటం తెలిసిందే. అయితే వీటిని నిరంతరం వేడి చేయడం, కూరలు చేసేటప్పుడు అందులో వేసే నూనె, ఉప్పు, చింతపండు, టమాటా, పెరుగు, నిమ్మకాయ వంటి ఆమ్ల పదార్థాల కారణంగా పాత్రల లోపలి భాగం పెళుసుగా మారిపోతుంది. ఆ పాత్రలను శుభ్రం చేసినా కూడా బ్యాక్టీరియా నిల్వ ఉండే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఎక్కువ కాలం వాడకూడదు. పాత్రల స్వభావం మారిపోయాక వెంటనే వాటిని మార్చేయడం ఉత్తమం.
అయితే ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో పాత్రల నాణ్యతపై దృష్టి సారిస్తున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి దృఢంగా ఉండటంతో పాటు తుప్పు పట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా శుభ్రం చేయడానికీ సులువుగా ఉంటుంది. స్నాక్స్, ఇతర ఆహార పదార్థాలు నిల్వ ఉంచే డబ్బాలను ఖాళీ అయిన వెంటనే శుభ్రం చేసి మళ్లీ వాడుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాల కంటే పింగాణి, గాజు, స్టీల్ పాత్రలను ఉపయోగించడం ఉత్తమం.
ఆహారాన్ని కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా.. ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ వంట గదిలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించాలి. కిచెన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
