చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!

చాలామంది ప్రస్తుతం చుండ్రు(డాండ్రుఫ్) సమస్యతో బాధపడుతున్నారు. అందుకే మార్కెట్లో రకరకాల పేర్లతో యాంటీ డాండ్రుఫ్ షాంపులూ, జెల్స్ వంటివి విపరీంతగా వచ్చేస్తున్నాయి. చుండ్రు సమస్య కారణంగా చాలామంది నలుగురిలో నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.

చుండ్రు అంటే.. తలపై ఉండే చర్మం పోరలు పొరలుగా ఉడిపోయే పరిస్థితి. దీంతో జుట్టులో తెల్లటి పొట్టులాంటి ముక్కలు కనబడతాయి. తలలో నుంచి చిన్న చిన్న తెల్లటి పొలుసులుగా ఊడిపోతుండం వల్ల చాలామందికి నలుగురిలో నిలబడటం అకౌకర్యంగా ఉంటుంది. చుండ్రు వల్ల తలలో దురద పెట్టడం, జుట్టు రాలిపోవడం కూడా జరుగుతుంది.

Tired of Dandruff Flakes Try Grandma s Secret Curd Hack

అయితే చుండ్రు సమస్యను తగ్గించడానికి లేదా పొగొట్టడానికి అనేక రకమైన షాంపూలు, జెల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ మన అమ్మమ్మల కాలం నాటి ఒక చిన్న చిట్కా ఈ సమస్యకు అద్బుతంగా పనిచేస్తుంది. పెరుగులో కొన్ని పదార్ధాలను ఉపయోగించి చుండ్రు సమస్యను ఈజీగా వదిలించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ముందుగా.. పెరుగు, చక్కెరను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. అరగంట నుంచి 45 నిమిషాల దాకా అలాగే ఉంచి ఆ తర్వాత తల స్నానం చేయండి. దీనివల్ల క్రమంగా చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్‌ ను ఊపేస్తున్న కొత్త ఫిట్‌ నెస్ ట్రెండ్!నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్‌ ను ఊపేస్తున్న కొత్త ఫిట్‌ నెస్ ట్రెండ్!

మరోక చిట్కా ఏంటంటే..పెరుగులో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు మర్దనా చేయండి. పెరుగు, నిమ్మరసం రెండు తల చర్మం ph లెవల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, చుండ్రు తగ్గించడానికి సాయపడతాయి.

మరో చిట్కా..రెండు టీస్పూన్ల పెరుగులో, 1 టీస్పూన్ మెంతులు వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఆ మెంతులను మెత్తని పొడిలా చేసి తలకు పట్టించండి. ఇది జుట్టు రాలకుండా ఆపడానికి, చుండ్రు సమస్యను తగ్గించడానికి సాయపడుతుంది.

మరొకట ప్రయోజనకరమైన చిట్కా కూడా ఉంది. అదేంటంటే..పెరుగు, వెనిగర్ మిశ్రమాన్ని తల చర్మానికి రాయడం. ఇలా వారానికి రెండుసార్లు అయినా కొన్ని వారాల పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, September 19, 2026, 17:11 [IST]
Desktop Bottom Promotion