Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ముగిసి శీతాకాలం రానుంది. సీజన్ మారుతున్న క్రమంలో పిల్లల్లో రోగనిరోధక శక్తి బలహీనమై సులభంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల కారణంగా పిల్లలు త్వరగా వైరల్ ఫీవర్ బారిన పడటం సాధారణం. ఇక, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న చిన్నారుల్లో సీజనల్ వ్యాధులు త్వరగా వస్తాయి. అందుకే కాలానుగుణంగా పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. ముఖ్యంగా వారు తినే ఆహారంలో పోషకాలు అధికంగా చేర్చడం తప్పనిసరి. ఈ క్రమంలో మీ పిల్లలకు రోజువారీ ఆహారంలో వీటిని తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

భోజనంలో పెరుగు తప్పనిసరి
మీ పిల్లలకు ప్రతిరోజూ ఆహారంలో పెరుగు చేర్చడం తప్పనిసరి. పెరుగులోని ప్రొబయాటిక్ అనే మంచి బ్యాక్టీరియా.. వారి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా విటమిన్ డి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. కాల్షియం ఎముకలు బలంగా ఉండటానికి దోహదపడుతుంది.

వెల్లుల్లి
కూరల్లో వెల్లుల్లి చేర్చడం వాటి సువాసన, రుచి పెంచడమే కాదు ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. అల్లిసిన్ లాంటి సమ్మేళనాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
సీజనల్ సిట్రస్ పండ్లు
మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి వారికి తప్పనిసరిగా తరచూ సిట్రస్ పండ్లను ఇవ్వాలి. నిమ్మజాతి రకానికి చెందిన పండ్లు, ఉసిరి వంటి వాటిలో విటమిన్ సి, సూక్ష్మపోషకాలు ఉంటాయి. బెర్రీలు, ప్లమ్స్, పీచెస్, పైనాపిల్ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఈ సీజన్‌లో పిల్లలకు తప్పనిసరిగా ఇవ్వండి.

పసుపు పాలు
మీ పిల్లలు పడుకునే ముందు గోరువెచ్చని పాలలో పసుపు కలిపి ఇవ్వండి. స్వచ్ఛమైన పసుపును పాలలో కలిపి ఇవ్వడం ద్వారా నిద్ర బాగా పడుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇంకా ఈ పసుపు పాలలో కొద్దిగా నల్ల మిరియాలను చేర్చుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

బాదం పప్పులు
మీ పిల్లలకు ప్రతిరోజూ ఉదయాన్నే టిఫిన్‌కి ముందు రెండు లేదా మూడు నానబెట్టిన బాదం పప్పులను ఇవ్వండి. వాటిపై తొక్క తీసేసే ఇవ్వడం ద్వారా పూర్తిగా పోషకాలు అందుతాయి. జలుబు రాకుండా కాపాడుతుంది. వీటిలోని విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్ మీ పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పైన చెప్పిన వాటిని మీ పిల్లలకు క్రమం తప్పకుండా ఇస్తే మాత్రమే సరిపోదు. ఈ కాలంలో వారిని కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్‌డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ప్యాక్‌డ్ ఫుడ్‌కు వీలైనంతగా దూరం ఉంచండి. ఇంట్లో చేసిన వంటకాలకే ప్రాధాన్యత ఇవ్వండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
