Latest Updates
-
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా..
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఫుల్ హోం రెమెడీ!
తెల్ల జుట్టు అంటే వయస్సు పెరిగి వృద్ధాప్య సమయంలో వచ్చేది అనుకుంటే పొరబడినట్లే. వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధించే సమస్య తెల్ల జుట్టు. ఈ సమస్యను దాచుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డైలపై ఆధారపడతాం. కానీ ఈ రంగులలో ఉండే కఠినమైన రసాయనాలు తాత్కాలికంగా జుట్టును నల్లగా మార్చినా, దీర్ఘకాలంలో ఎన్నో నష్టాలను కలిగిస్తాయి. జుట్టు నిర్జీవంగా మారడం, చర్మంపై నల్లటి మరకలు పడటం, అలర్జీలు రావడం వంటి దుష్ప్రభావాలు సర్వసాధారణం.
రసాయనాల బాధ లేకుండా, మన వంటింట్లో లభించే సహజసిద్ధమైన గోరింటాకుతోనే మీ కురులను నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. చాలామంది గోరింటాకు పెట్టుకుంటే జుట్టు నల్లగా కాకుండా ఎర్రగా లేదా నారింజ రంగులోకి మారుతుందని ఆందోళన చెందుతారు. కానీ సరైన పద్ధతిలో, కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను జోడించి వాడితే అద్భుతమైన నల్లని రంగును సొంతం చేసుకోవచ్చు. ఆ రహస్యమేంటో ఇక్క చూడండి.

గోరింటాకు మిశ్రమం తయారీ కావాల్సిన పదార్థాలు
మీ జుట్టు పొడవుకు సరిపడా స్వచ్ఛమైన గోరింటాకు పొడి (హెన్నా పౌడర్)
2 టేబుల్ స్పూన్ల టీ పొడి (బ్లాక్ టీ)
1 టీస్పూన్ కాఫీ పొడి
1 నిమ్మకాయ రసం.
2 టేబుల్ స్పూన్ల పెరుగు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి, అందులో టీ పొడి, కాఫీ పొడి వేసి బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గి, చిక్కటి డికాషన్ తయారైన తర్వాత దానిని వడగట్టి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఇనుప కడాయిలో తీసుకున్న గోరింటాకు పొడిలో ఈ డికాషన్‌ను కొద్దికొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా మెత్తని పేస్ట్‌లా కలపాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం, పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి.
-ఈ మిశ్రమాన్ని కనీసం 6 నుండి 8 గంటలు (లేదా రాత్రంతా) నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గోరింటాకులోని రంగు పూర్తిగా విడుదల అవుతుంది.
రెండవ దశ
గోరింటాకుతో జుట్టుకు ఎరుపు రంగు బేస్ కోటింగ్ ఇచ్చిన తర్వాత దానికి నల్లని రంగును అందించేది నీలిమందు పొడి (ఇండిగో పౌడర్). ఇది కూడా సహజసిద్ధమైనదే.
అప్లై చేసే విధానం
-రాత్రంతా నానబెట్టిన గోరింటాకు మిశ్రమాన్ని ఉదయాన్నే తలకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి.
-ఈ ప్యాక్ ను కనీసం రెండు గంటల పాటు ఉంచుకుని, ఆ తర్వాత షాంపూ ఉపయోగించకుండా కేవలం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి.
-జుట్టు ఆరిన తర్వాత, ఒక గిన్నెలో ఇండిగో పొడిని తీసుకుని, గోరువెచ్చని నీటితో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను వెంటనే జుట్టుకు పట్టించాలి.
-ఇండిగో ప్యాక్ ను తలపై గంటన్నర నుంచి రెండు గంటల పాటు ఉంచి మళ్లీ కేవలం నీటితోనే శుభ్రం చేసుకోవాలి.
తుది ఫలితం
ఇండిగో ప్యాక్ కడిగిన వెంటనే జుట్టు పూర్తిగా నల్లగా మారకపోవచ్చు. కానీ 24 నుండి 48 గంటల్లో గాలికి ఆక్సిడైజ్ అయ్యి, మీ కురులు సహజమైన, నిగనిగలాడే నల్లని రంగులోకి మారతాయి. ఈ రెండు రోజుల వరకు షాంపూ, కండీషనర్ వాడకపోవడం ఉత్తమం. నెలలో రెండుసార్లు ఈ పద్ధతిని పాటిస్తే, మీ తెల్ల జుట్టు సమస్య పూర్తిగా దూరమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
