Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
నేరేడు గింజలు పడేస్తున్నారా?..ఇలా చేస్తే షుగర్ కి చెక్,బరువు తగ్గడంతో పాటు బోలెడు ప్రయోజనాలు
ఎండాకాలం అనగానే మామిడికాయలతో పాటు నేరేడు పండు కూడా గుర్తుకొస్తుంది. తీపి, పులుపు, వగరు కలగలిసిన నేరేడుపండు అద్భుతమైన రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నేరేడు పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం నేరుడు పండులోని గుజ్జును ఆస్వాదించి గింజలను మాత్రం పనికిరానివిగా భావించి పారేస్తుంటాం. అయితే మనం పడేసే ఆ గింజల్లోనే ఆరోగ్య రహస్యాల గని దాగి ఉందని మీకు తెలుసా?నేరేడు గింజల పొడి మన శరీరానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇకపై ఆ గింజలను పారేయకుండా వాటితో అద్భుతాలు సృష్టించే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రయోజనాలేంటో ఇక్కడ చూడండి.
నేరేడు పండ్ల పొడితో ఆరోగ్య ప్రయోజనాలివే
మధుమేహానికి దివ్యౌషధం
షుగర్ వ్యాధితో బాధపడేవాళ్లకి నేరేడు గింజల పొడి ఒక వరం. ఇందులోని జంబోలిన్, జంబోసిన్ వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెరల విడుదలను నియంత్రించి, ఇన్సులిన్ లెవల్స్ ను మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ పొడిని కలుపుకుని తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

బరువు తగ్గడానికి సహకారి
అధిక బరువుతో ఇబ్బంది పడుతూ బరువు తగ్గాలనుకునేవాళ్లకి కూడా ఈ పొడి బెస్ట్ ఆప్షన్. నేరుడు గింజల పొడిలోని అధిక ఫైబర్ కంటెంట్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించి అనవసరమైన తిండిపైకి మనసు మళ్లకుండా చేస్తుంది.
రోగనిరోధక శక్తికి రక్షణ కవచం
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండే నేరుడు పండ్ల పొడి శరీర రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, మన బాడీని ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
నిగారించే చర్మ సౌందర్యం
మొటిమలు, మచ్చలతో మీ చర్మం నిర్జీవంగా కనిపిస్తోందా? ఈ నేరుడు పండు గింజలు పొడి.. రక్తాన్ని శుద్ధి చేసి చర్మాన్ని లోపలి నుంచి కాంతివంతంగా మారుస్తుంది.
ఇంట్లోనే సులభంగా నేరేడు గింజల పొడి తయారీ
-ముందుగా నేరేడు పండ్ల నుంచి గింజలను వేరుచేసి వాటిని శుభ్రంగా కడగాలి.
-ఆ గింజలను ఎండలో 5 నుంచి 7 రోజుల పాటు అవి పూర్తిగా గట్టిపడే వరకు బాగా ఆరబెట్టాలి.
-ఇప్పుడు వాటిని ఒక బాండీలో వేసి తక్కువ మంటపై దోరగా వేయించాలి.
-చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.
-ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే దాని గుణాలు చెక్కుచెదరకుండా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
