Latest Updates
-
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.!
Seema vankaya: సీమ వంకాయ తింటే.. 100 మంది బలం మీ సొంతం! ఎక్కడ కొనుక్కోవాలంటే?
మన దేశంలో చాలా మంది భోజనంలో అన్నం, చికెన్, మటన్, కొన్ని కొన్నిసార్లు చేపలు, టిఫిన్స్ తింటుంటారు. అయితే కాలం మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతున్నా, ఆహారపు అలవాట్లు మారుతున్నా పాత పద్ధతులు, ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు మాత్రం అలానే ఉన్నాయి. ఇప్పటికీ మన పూర్వీకుల పద్దతులను కొందరు పాటిస్తుంటారు. అలాంటి వాటిలోనే ఒకటైన సీమ వంకాయ, అదే బెంగళూరు వంకాయ కూడా ఒకటి. ఇప్పటికీ కొందరు ఈ సీమ వంకాయను తింటూ ఉంటారు. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఆ ప్రయోజనాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎక్కడ దొరుకుతాయంటే
సీమ వంకాయలు కూడా సాధారణంగా మార్కెట్లోనే దొరుకుతుంటాయి. కాకపోతే వీటి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. దీని ధర కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే ఉంటుంది. ఇప్పటికే ఇది అందుబాటులో ఉన్నప్పటికీ దీనిని ఎవరూ తినడం లేదు. కానీ ఈ స్టోరీ తరువాత ఈ సీమ వంకాయను తినేవారి సంఖ్య కచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.

బరువు తగ్గేందుకు
ఈ సీమ వంకాయలో చాలా తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. దీని కారణంగా ఈ సీమ వంకాయను తినడం వల్ల బరువు సులభంగా పెరగడాన్ని నిరోధిస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఈ వంకాయను తినడం వల్ల కడుపులో సులభంగా తిరిగిపోతుంది. అలాగే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది. దీంతో ఎక్కువగా తినడం మానేస్తుంటాం. ఫలితంగా బరువు పెరగకుండా ఉంటాము.
రక్తపోటు నియంత్రణకు
ఈ వంకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు కారణంగా ఇబ్బంది పడే వ్యక్తులు ఈ వంకాయ తినడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాగే ఇందులో విటమిన్ సీ, విటమిన్ కే, ఫోలేట్, మ్యాంగనీస్, వంటి ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది.
యవ్వనంగా మారేందుకు
ఈ వంకాయలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. అలాగే చర్మాన్ని లోపలి నుంచి చికిత్స చేస్తుంది. దీని కారణంగా చర్మం యవ్వనంగా అందంగా మారుతుంది. అలాగే ప్రకాశవంతంగా మారుతుంది. దీనిని గర్భిణీ స్త్రీలు కూడా తినొచ్చు. దీనిని తినడం వల్ల గర్భంలోని శిశువు మెదడు చురుగ్గా తయారవుతుంది. అలాగే వారి నాడి వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే రక్తంలోని చెక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే ఇందులో ఎముకలు బలంగా తయారవడానికి కావాల్సిన క్యాల్షియం, విటమిన్ కే కూడా ఉంటాయి. దీని కారణంగా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు.
గమనిక: ఈ స్టోరీలో మేము చెప్పిన విషయాలు ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. ఇవి కచ్చితమైనవని మేము చెప్పడం లేదు. దీనికి Boldsky Teluguకు ఎటువంటి సంబంధం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications