Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో ఆరోగ్య చిట్కాలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను, నిజానిజాలను తెలుసుకోకుండా చాలామంది గుడ్డిగా వాటిని ఫాలో అయిపోతుంటారు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా జరగవచ్చు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే గుండెపోటు, పక్షవాతం ముప్పు తప్పుతుంది అనేది ఆ వాదన సారాంశం. మరి ఇందులో నిజమెంత? నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన తేమ అందుతుంది.. అంతవరకూ ఒకే.. కానీ కేవలం ఆ ఒక్క గ్లాసు నీరు గుండె జబ్బులను, పక్షవాతాన్ని అడ్డుకుంటుందని చెప్పడానికి వైద్యశాస్త్రంలో ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవు.

ఏ ఒక్క చిట్కా కూడా గుండె ఆరోగ్యంలో అద్భుతాలు చేయలేదు
అలాగని నీళ్లు తాగడం వల్ల గుండెకు లాభం లేదా? అంటే కచ్చితంగా ఉంది. కానీ దాన్ని ఒక చిట్కాలా కాకుండా మన దినచర్యలో, ఆరోగ్యకరమైన జీవనవిధానంలో భాగంగా చేసుకోవాలి. శరీరంలో తగినంత నీరు లేకపోతే డీహైడ్రేషన్ వస్తుంది. దీనివల్ల రక్త పరిమాణం తగ్గిపోయి, నీటి శాతం తగ్గడం వల్ల రక్తం చిక్కబడుతుంది. అప్పుడు రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. అందుకే రక్త ప్రసరణ సాఫీగా జరగాలంటే రోజంతా తగినన్ని నీళ్లు తాగాలి. రాత్రి పడుకునే ముందు మాత్రమే కాదు, పగలు కూడా క్రమం తప్పకుండా నీరు తీసుకోవాలి.

రాత్రి నిద్రలో మన శరీరం కొంత డీహైడ్రేషన్‌కు గురయ్యే మాట వాస్తవమే. అందుకే పడుకునే ముందు కొద్దిగా నీళ్లు తాగమని నిపుణులు చెబుతారు. కానీ రక్తం గడ్డకట్టకూడదనే ఉద్దేశంతో రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు ఎక్కువగా నీళ్లు తాగేస్తే, అది మీ నిద్రను తీవ్రంగా దెబ్బతీస్తుంది. పదే పదే మూత్రవిసర్జనకు లేవాల్సి వస్తుంది. ఇలా నిద్రకు భంగం కలగడం వల్ల, దీర్ఘకాలంలో ఆ నిద్రలేమి మీ గుండె ఆరోగ్యంపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
