Latest Updates
-
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.!
ఫిష్ వెంకట్ మరణానికి కారణం ఇదే..మీకు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
తెలుగు ప్రజలకు సుపరిచితమైన నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధితో మరణించారు. ఆయన రెండు కిడ్నీలు పాడైపోవడంతో చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటూ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. చివరికి ఆరోగ్యం విషమించి శుక్రవారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఫిష్ వెంకట్ ఆకస్మిక మరణం అందరినీ కలిచివేసింది. అసలు ఆయనకు వచ్చిన ఆరోగ్య సమస్య నివారించలేనిదా? అనే ప్రశ్నలు చాలామంది మదిలో మెదులుతున్నాయి.
కిడ్నీ వ్యాధులు ఇటీవలి కాలంలో చాలా మందిని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. కిడ్నీ వ్యాధులు ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలను చూపవు. అందుకే వాటిని సైలెంట్ కిల్లర్స్ అని పిలుస్తుంటారు. ఫిష్ వెంకట్ మరణం తర్వాత కిడ్నీల వ్యాధి తమకు కూడా వచ్చే అవకాశముంటుందా అని చాలామందిలో టెన్షన్ మొదలైంది. ఫిష్ వెంకట్ మిత్రుడు ఒకరు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫిష్ వెంటకట్ ఎక్కువగా మద్యం సేవించడం వల్లనే ఆయనకు ఈ పరిప్థితి వచ్చిందని చెప్పారు. దీంతో ఇప్పుడు మద్యం సేవించే వారిలో కూడా ఫుల్ టెన్షన్ పట్టుకుంది. అయితే అసలు కిడ్నీ వ్యాధుల బారిన పడి మరణించే వరకు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఆహారం
అసలు మనం తీసుకునే ఆహారంలోనే మొత్తం ఆరోగ్యం దాగి ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం అనారోగ్యాల బారిన పడాలన్నా దాన్ని డిసైడ్ చేసేది మనం తీసుకునే ఆహారమే. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలను తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు కిడ్నీలను ప్రభావితం చేయవచ్చు కాబట్టి పరిశుభ్రత పాటించడం ముఖ్యం.
క్రమబద్ధమైన వ్యాయామం
రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఇది కిడ్నీలపై భారాన్ని తగ్గిస్తుంది.
మద్యపానం మానేయడం
ఆల్కహాల్ లేదా మందు కిడ్నీలకు హానికరమైనది కాబట్టి దీనికి దూరంగా ఉండాలి.
ధూమపానం మానేయడం
ధూమపానం కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు.
రక్తపోటు నియంత్రణ
అధిక రక్తపోటు లేదా హై బీపీ కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది..కాబట్టి రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. అనవసరమైన టెన్షన్ లేకుండా చూసుకోండి.
మధుమేహం నియంత్రణ
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.. లేకుంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. అది మరణానికి కూడా దీరితీయవచ్చు.

నీరు ఎక్కువగా త్రాగాలి
రోజుకు సరిపడా నీరు తాగడం వల్ల కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి..శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
అనవసరమైన మందులకు దూరంగా ఉండాలి
డాక్టర్ల సలహా లేకుండా నొప్పి నివారణ మందులు వంటి వాటిని ఎక్కువగా వాడకూడదు, ఇవి కిడ్నీలకు హాని కలిగించవచ్చు. చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ల సూచన లేకుండా నేరుగా మెడికల్ షాపుకి వెళ్లి మీ సొంత తెలివిటేటలు వాడి మెడిసన్స్ తెచ్చుకొని వేసుకుంటే మాత్రం కిడ్నీలు పాడై మరణానికి దారితీయవచ్చు
క్రమం తప్పకుండా పరీక్షలు
ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఎప్పటికప్పుడు కిడ్నీ పనితీరును తెలుసుకోవడానికి హాస్పిటల్ లేదా క్లినిక్ కు వెళ్లి టెస్ట్ లు చేయించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
