Latest Updates
-
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే!
క్రమేణా....దీర్ఘకాలంలో బరువు తగ్గితే?

ఈ రకంగా వేగంగా బరువుతగ్గి సన్నపడి అందరి ప్రశంసలు పొందాలనుకుంటారు. ఇవన్ని నిజాలే అయితే, మనం ఖచ్చితంగా ఒక మంచి డైట్ ప్రణాళికను ఆచరించవచ్చు. నేటి బరువు తగ్గే ప్రపంచంలో ఏ పద్ధతి లేదా ఉత్పత్తి లేదా ఏ డైట్ ప్రణాళిక వేగంగా పనిచేస్తుందో కనిపెట్టటం కష్టం.
అన్నింటిలోకి సాధారణంగా అందరూ ఆచరించేది మితిమీరిన డైటింగ్.
ఈ మితిమీరిన డైటింగ్ ప్రణాళికలో గ్రేప్ ఫ్రూట్ డైట్ లేదా కేబేజి సూప్ వంటి ఆహారాలు మాత్రమే తీసుకోవాలని వుంటుంది. బరువు వేగంగా తక్కువసమయంలో తగ్గాలంటే, ఈ ప్లానులు పనిచేస్తాయి. కాని అవి దీర్ఘకాలంలో మీ శరీరానికి మంచివి కావు. అధిక బరువు, అతి త్వరగా తగ్గితే అది శరీర ఆరోగ్యానికి హాని కలిగించి మీ అంతర్గత అవయవాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ఆ తర్వాత అంతే త్వరగా కూడా మీరు బరువు మరోసారి పెరిగిపోతారు. దీనికి కారణం, మీరు మీ మితిమీరిన డైటింగ్ చేసిన తర్వాత మీ పాత తిండి అలవాట్లకు మారిపోతారు. అవి మరోసారి మీకు బరువు తెప్పిస్తాయి.
కనుక బరువు దీర్ఘకాలంలో మెల్లగా తగ్గటం ఆరోగ్యానికి మంచిది. మీ బరువు తగ్గే ప్రణాళిక ఆ దిశగా కొనసాగాలి. మితిమీరిన ఆహారాలతో కొన్ని నష్టాలు కూడా వున్నాయి. అవి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తెస్తాయి. తలనొప్పి, డయోరియా, కళ్ళు తిరగటం వంటివి ఏర్పడతాయి. కేలరీలు అకస్మాత్తుగా తగ్గటం వలన ఈ పరిస్ధితి ఏర్పడుతుంది. మీ శరీరం దీనిని ఆమోదించలేదు. అందుకనే వేగంగా బరువు తగ్గే ఆహార ప్రణాళికలకంటే రోజుకు కొద్దిగా చొప్పున క్రమేణా మీ కేలరీలు తగ్గించండి. ఏ ఆహార ప్రణాళిక చేపట్టినా సరైన వైద్య నిపుణులను ముందుగా సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
