Latest Updates
-
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.!
గబ్బర్ సింగ్ లా నిర్భయంగా..... నవ్వేయండి?

నవ్వు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
ఆరోగ్య వ్యవస్ధను మెరుగుపరుస్తుంది - వైద్యులు, ఆరోగ్య నిపుణులు నవ్వు మన ఆరోగ్య వ్యవస్ధను మెరుగుపరుస్తుందంటారు. శరీరంలో ఒత్తిడి కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. కొద్ది నిమిషాలు నవ్వితే చాలు శరీరం రిలాక్స్ అయి, పాజిటివ్ భావాలనిస్తుంది. ఇదంతా మన రోగ నిరోధక వ్యవస్ధనుండి వస్తుంది. పాజిటివ్ భావనలు ఒత్తిడిని తగ్గించి మైండ్ తాజాగా వుండేలా చేస్తాయి. రోజంతా చురుకుగా వుంటారు.
రక్తనాళాలు బాగా పనిచేస్తాయి.
మనలోని రక్తనాళాల లోపలి భాగాలు వ్యాకోచిస్తాయి. దానితో రక్తప్రసరణ మెరుగవుతుంది. మన గుండెకు రక్తనాళాలకు ఆరోగ్యం చేకూరుతుంది. రోజుకు 10 నుండి 15 నిమిషాలు నవ్వితేచాలు గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం తక్కువగా వుంటుంది.
శరీరానికి ఆక్సిజన్
మనం నవ్వినపుడు ఆక్సిజన్ అధికంగా తీసుకుంటాం. ఎక్కువసార్లు నవ్వితే ఎక్కువ ఆక్సిజన్ లోపలికిపోతుంది. నోరు, గొంతు,పొట్ట భాగాలలోని బాక్టీరియా, ఇతర క్రిములు నశిస్తాయి. ఆక్సిజన్ లో అవి బతకలేవు. కేన్సర్ వ్యాధి నక్రిములు ఆక్సిజన్ లో జీవించలేవు.
నవ్వు మంచి రసాయనాలు ఇస్తుంది
నవ్వితే, ఆరోగ్యకరమైన జీవ రసాయనాలు అంటే సెరోటోనిన్, ఇంటర్ లూకిన్ వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇవి వెలకడితే వేల రూపాయల ఖరీదు వుంటుంది. ఈ జీవ రసాయనాలు, అనేక మొండి వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు.
మానసిక ప్రభావం
మంచి సంబంధాలు కలిగివుండాలంటే, నవ్వు మంచిదని అందరి అభిప్రాయంగా వుంటుంది. అది ప్రేమ, బంధం, స్నేహం వంటివాటికి సంకేతం. అది జోక్ లు వేస్తూ నవ్వించేవారినందరిని ఒక మంచి పాజిటివ్ వాతావరణంలోకి చేరుస్తుంది.
మరి ఇటువంటి నవ్వు ఎలా పొందాలి?
నేడు ఆధునికంగా వచ్చే టీ.వీలలోని కామెడి షోలు,సినిమాలు చూసి నవ్వండి. ఒకరితో మరి ఒకరు ఆరోగ్యకరమైన జోకులు వేసుకుని నవ్వండి. నవ్వు అనేక రోగాలకు నివారణి. అది రోగాలు నయం చేస్తుంది మరోమారు మన శరీరం ఆరోగ్యం సంతరించుకునేలా చేస్తుంది. కనుక మీరు ఎపుడు నవ్వాలనుకున్నా, నిస్సంకోచంగా, తనివితీరా, గుండె అలిసేలా నవ్వండి, ఆరోగ్యంగా వుండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications