Latest Updates
-
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే!
పచ్చి బఠానీలోని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు
చాలా మంది ప్రజలు పచ్చిబఠానీలను చాలా తేలికగా తీసుకుంటారు. వీటిని ఒక సైడ్ డిష్ లా తయారుచేస్తారు లేదా ఇతర డిష్ లతో కలిపి తయారుచేస్తుంటారు . అయితే ఈ గ్రీన్ వింటర్ వెజిటేబుల్లో అనేక ఆరోగ్యగుణగణాలున్నాయి, అవి ఎంతో ప్రయోజనం కలిగిస్తాయిని గుర్తించాలి.
మార్కెట్లో పచ్చిబఠానీ కాయలు దొరకుతాయి, అలాగే కాయల నుండి విత్తనాలను వేరు చేసి కూడా అమ్ముతంటారు. ఈ చిన్నచిన్న పచ్చిబఠానీల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అంతే కాదు ఈ గ్రీన్ వెజిటేబుల్ సీడ్స్ వింటర్ డైట్ కు చాలా ఫర్ ఫెక్ట్ వెజిటేబుల్.
పచ్చిబఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఎ, సి మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు మరికొన్ని ఇతర పోషకాంశాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేసే వరకూ అన్ని చర్యలను సహాయపడే గుణగణాలు పచ్చిబఠానీల్లో ఉన్నాయి . అందుకే ఈ వింటర్ సీజన్ లో వీటిని మంచి డైట్ గా తీసుకుంటారు . అలాగే ఈ పచ్చిబఠానీలు చర్మం కూడా చాలా మేలు చేస్తుంది . పచ్చిబఠానీల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి వ్రుద్యాపంను నివారిస్తుంది మరియు ఫైన్ లైన్స్ ను నిరోధిస్తుంది. ఈ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రక్షణ కల్పిస్తుంది.
పచ్చిబఠానీలు ఈ సీజన్ లో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి . వీటిని మన వంటల్లో విరివిగా ఉపయోగించుకోవచ్చు . మరి వీటి ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం...

1. బరువు తగ్గిస్తుంది:
పచ్చిబఠానీల్లో క్యాలరీలు మరియు ఫ్యాట్ తక్కువ కాబట్టి బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతాయి.

2. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:
ఆర్థరైటిస్, గుండె వ్యాధులు, మరియు ఓస్టిపోరియోసిన్ వంటి వ్యాధులను సోకకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

3. మలబద్దకం:
పచ్చిబఠానీల్లో అధిక శాతం ఫైబర్ కలిగి ఉండి మలబద్దకంతో పోరాడుతుంది మరియు జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది.

4. బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేస్తుంది:
పచ్చిబఠానీల్లోనీ యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను నిరోధిస్తుంది. ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ముఖ్యం ఇందులో కార్బోహైడ్రేట్స్ మరియు నేచురల్ షుగర్ లెవల్స్ మరియు స్ట్రార్చ్ పుష్కలంగా ఉంటుంది.

5. స్టొమక్ క్యాన్సర్ నివారిస్తుంది:
పచ్చిబఠానీల్లోని కామోస్ట్రాలో(హెల్త్ ప్రొటెక్టివ్ పాలీఫినాల్)కలిగి ఉంటుంది. ఈ ఫైటోన్యూట్రియంట్స్ స్టొమక్ అల్సర్ నివారిస్తుంది.

6. వ్యాధినిరోధకతను పెంచుతుంది:
వీటిలోని యాంటీయాక్సిడెంట్స్, ఫ్లెవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫోలీఫినాయిల్స్ వ్యాధినిరోధకతను పెంచడానికి సహాయపడుతుంది.

7. గుండె ఆరోగ్యానికి:
గ్రీన్ పీస్ ఆరోగ్యానికి అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి మరియు విటమిన్ బి కాంప్లెక్స్ హెల్తీ బ్లడ్ వెసెల్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

8. ఎముకల ఆరోగ్యానికి :
పచ్చిబటానీల్లో విటమిన్ కె మరయిు బి పుష్కలంగా ఉండి ఇది స్ట్రాంగ్ హెల్తీ బోన్స్ ను ప్రమోట్ చేస్తుంది. మరియు ఇది ఇన్ఫ్లమేషన్ మరియు ఓస్టియోపోరోసిస్ ను నివారిస్తుంది.

9. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
మీ డైట్ లో గ్రీన్ పీస్ చేర్చుకోవడం వల్ల ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించి, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ నుతగ్గిస్తుంది. ఇది హెల్తీ హార్ట్ కు ప్రోత్సహిస్తుంది.

10. యాంటీ ఏజింగ్:
ఇందులో విటమిన్ సి మరియు యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది.



Click it and Unblock the Notifications