Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 8 సులభ చిట్కాలు
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో కొన్ని విషయాలు, పనులు సర్వసాధారణంగా మారిపోయాయి. అందులో ఆఫీసులో పని ఒత్తిడి.. కళ్ళకు కంప్యూటర్‌ల వల్ల శ్రమ తప్పదు. ఆఫీసు ముగిసిన తర్వాత ఇంటీకి వచ్చిరాగానే ఇక ఫ్రెండ్స్‌తో చాటింగ్. అప్పుడు కూడా కళ్ళకు రెస్ట్ వుండదు. ఇవి పూర్తి కాగానే నిద్రపోదాం అని అనుకుంటూనే సమయమే తెలియకుండా టి.విని చూడటం మొదలు పెడతాం. ఇలా చేస్తే కళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? ఆలోచించరు.
కంటికి సంబంధించి ఏమైనా సమస్య వస్తే అప్పుడు ఇబ్బంది పడతారు. టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడీ గడపటం వల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యల బారిన పడతారు. సరైన నిద్రలేకపోవడంతో కళ్ళ కింద నల్లటి చారలు, కంటి చూపు తేడాగా వుండటం మరియు మందగించడం వంటివి సమస్యలు ఎదుర్కోవాలి. అంతే కాకుండా కళ్ళ మంటలు, కళ్ళ నుండి నీరు కారటం వంటివి జరుగుతుంటాయి. కళ్ళ బాధలు వేధిస్తుంటాయి. ఆరోగ్యకరమైన కళ్ళ ఆరోగ్యానికి సరైన మాయిశ్చరైజర్, పోషణ మరియు కళ్ళకు సరైన వ్యాయామం వల్ల కళ్ళు ఆరోగ్యంగా మరియు ఫర్ఫెక్ట్ కనుచూపు ఉంటుంది. ఇలాంటి సమస్యల ఏర్పడకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్ల ఆరోగ్యాన్నికాపాడుకోవటమే కాకుండా, అందమైనకళ్లను, మెరుగైన చూపును జీవిత కాలం పొందవచ్చు. మరి రెగ్యులర్ గా చేయాల్సిన కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా...

ఆహారం :
విటమిన్ ఎ మరియు కె అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి . ఈ రెండు విటమిన్లు ఉన్న ఆహారానలు తీసుకుంటే కను చూపు ఫర్ఫెక్ట్ గా ఉంటుంది. విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను రెగ్యులర్ గా తీసుకుంటే, కంటి చూపుతో పాటు కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

పనిచేసే సమయంలో చిన్న బ్రేక్:
పుస్తకాలు చదివే సమయంలో మరియు కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు మద్యమద్యలో చిన్న బ్రేక్ తీసుకోవాలి. 5నిముషాల బ్రేక్ తీసుకోవడం వల్ల కళ్ళ కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే కళ్ళ మీద కొన్ని నీళ్లను చిలకరించుకోవాలి. తర్వాత పని ప్రారంభించాలి.

ఐ ఎక్సర్సైజ్:
అలాగే కళ్ళకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేయాలి. కొన్ని సార్లు కనురెప్పలు బ్లిక్ చేస్తుండాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు చేతులను 2నిముషాలు బాగా రబ్ చేసి తర్వత ఈ వెచ్చని చేతులను కళ్ళమీద ఉంచాలి. ఈ ఐ వ్యాయామం కళ్ళను తేమగా మరియు హెల్తీగా ఉంచుతుంది.

నిద్ర:
మంచి నిద్ర 8 గంటల నిద్ర తప్పని సరి. ప్రతి రోజూ 8గంటలు తప్పనిసరిగా నిద్రపోతే కళ్ళక్రింద నల్లని వలయలు మరియు ఉబ్బు ఉండదు. నిద్రలేమి మీ కళ్ళను ఎర్రగా మారడం మాత్రమే కాదు మీ ముఖం కళను తప్పిస్తుంది. కాబట్టి, తగినంత నిద్ర వల్ల మీ కళ్లు ముఖం ఫ్రెష్ గా కనబడుతుంది.

కీరదోసకాయ:
కీరదోసకాయలను కళ్ళ మీద ఉంచడం వల్ల కళ్ళకు తగినంత తేమను అందిస్తుంది. కీరదోసకాయ డార్క్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ ను కూడా తొలగిస్తుంది. కళ్ళను చల్లగా ఉంచి, ఫ్రెష్ గా కనబడేలా చేస్తుంది.

మాయిశ్చరైజర్:
కళ్ళు ఫర్ ఫెక్ట్ లుక్ అందివ్వాలంటే తగినంత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. కీరదోసకాయ లేనప్పుడు కొన్ని మాయిశ్చరైజింగ్ చుక్కలను చేతిలో వేసుకొని కళ్ళకు అప్లై చేయాలి.

ఐ ఇన్ఫెక్షన్ కాకుండా నీళ్ళు చిలకరించాలి:
ఉదయం సమయంలో కళ్ళను రుద్దకుండా నివారించాలి. కళ్ళలో ఏదైనా పడినప్పుడు అది ఇరిటేషన్ కు గురిచేస్తుంది. కళ్ళలో ఏదైనా పడినప్పుడు కళ్ళను నలపకుండా కొన్ని నీళ్ళు చిలకరించాలి . రుద్దడం వల్ల ఏదైనా హాని జరగవచ్చు.

సన్ గ్లాస్ ను వేసుకోవచ్చు:
మీరు బటయ తిరగాల్సి వస్తే, వెళ్ళటప్పుడు సన్ గ్లాస్ ధరిస్తే కళ్ళకు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది మరియు డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications
