Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
కడుపునొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే బెస్ట్ హోం రెమెడీస్
సాధారణంగా కడుపు నొప్పి అనే సమస్య ను ప్రతీ ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే ఉంటారు. చాలా సార్లు అజీర్ణం, అతి సారం వంటి సమస్యలతో ఇది ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో కడుపు నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. ఇంట్లో వాడే చిట్కాలతో ఈ నొప్పి కి అడ్డుకట్ట వేయటానికి వీలవుతుంది. కానీ ఈ నొప్పి ని పూర్తిగా అశ్రద్ధ చేయటం మాత్రం కూడదు. కడుపు నొప్పి (Abdominal pain/stomach pain)కడుపునొప్పి అంటే పొట్ట భాగంలో ఏదో ఒక చోట నొప్పి రావటంగా చెబుతారు. కొన్ని సార్లు నొప్పి వచ్చిన చోటనే ఉండి పోవచ్చు. మరికొన్ని సార్లు ఈ నొప్పి మిగిలిన ప్రాంతాలకు వ్యాపించవచ్చు. నొప్పి ఎటువెైపు నుంచి ఎటు వెైపుకి వెళుతోంది అన్నది కూడా ముఖ్యమే. వాస్తవానికి మానవ జీర్ణ వ్యవస్థలో అనేక భాగాలు ఉన్నాయి. ప్రాథమిక ఆహార వాహికలో భాగంగా జీర్ణాశయం లేక కడుపు, ఆంత్రమూలం, చిన్న పేగు, పెద్ద పేగు అనే భాగాలతో పాటు కాలేయం, క్లోమం అనే అనుబంధ గ్రంథులు ఉంటాయి. వీటిలో వాపు వచ్చినా, ఇన్ ఫెక్షన్ సోకినా, రక్త ప్రసారానికి అంతరాయం ఏర్పడినా కడుపు నొప్పి అనిపిస్తుంది. సరిగ్గా జీర్ణాశయం లేక కడుపు దగ్గరే నొప్పి వస్తోందా లేక ఇతర ప్రాంతాల నుంచి అటూ ఇటూ వ్యాపిస్తోందా అన్నది కూడా ముఖ్యమే.
వివిధ రకాలుగా బాధించే కడుపునొప్పి నివారణ చిట్కాలు:క్లిక్ చేయండి
కొన్ని సార్లు కడుపు నొప్పిని క్లిష్టమైన సమస్యగానే గుర్తించాలి. ఈ నొప్పితో పాటు ఇతర లక్షణాలు కలిసి ఉన్పప్పుడు తీవ్రతను తెలుసుకోవాల్సి ఉంటుంది. జ్వరం, ఆహారం తీసుకోలేక పోవటం, విరోచనం కాకపోవటం, వాంతులు, రక్తపు వాంతులు, విరోచనంలో రక్తం పడటం, శ్వాస కష్టంగా ఉండటం, నొప్పి తీవ్రంగా విస్తరించటం, కడుపుని తాకితే నొప్పి ఎక్కువగా ఉండటం, గతంలో ఏదెైనా గాయం తగిలిన తర్వాత చోటు చేసుకొనే నొప్పి, ఎక్కువ కాలం నొప్పి ఉండటం వంటివి ముఖ్యమైన అంశాలుగా చె బుతారు. చాలా వరకూ కడుపు నొప్పి రావడానికి కారణం తెలుసుకొన్నట్లైతే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు . మీకు ఆబ్డోమినల్ పెయిన్ లేదా కడుపు నొప్పి లేదా ఇతర అసౌకర్యమైన కడుపు నొప్పిని చాలా సులభంగా నివారించుకోవచ్చు. సాధారణంగా ఎప్పుడోఒకప్పుడు వచ్చే కడుపు నొప్పిని కొన్ని వంటింటి వస్తువులను ఉపయోగించి తక్షణ ఉపశమనం పొందవచ్చు. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

పుదీనా:
పొట్టనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగించడంలో పుదీనా ఒక మంచి హోం రెమడీ. సాధారణంగా కొన్ని పుదీనా ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి, నోట్లో వేసుకొని నమిలి మ్రింగాలి . లేదా పుదీనా ఆకులను వేసి టీ తయారుచేసుకొని త్రాగితో కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

అలోవెరా జ్యూస్:
అలోవెరా ఆరోగ్యపరంగా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలోవెరాలో అనేక ఔషధగుణగణాలున్నాయి. ఇది క్రిములతో పోరాడుతుంది. కడుపు నొప్పికి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక కప్పు అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల అనేక రకాలైన పొట్ట, ప్రేగు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, కడుపులో తిమ్మెర్లను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

లెమన్ వాటర్:
లెమన్ జ్యూస్, గోరువెచ్చని నీటి కాంబినేషన్ తో తీసుకుంటే తప్పకుండా కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం పిండి, కొద్దిగా తేనె మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి తీసుకుంటే తప్పకుండా కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బేకింగ్ సోడా:
ఆల్కా సెట్జర్ వంటిదే బేకింగ్ సోడా, ఇది హార్ట్ బర్న్ ను మరియు అజీర్తిని నివారిస్తుంది. కడుపు నొప్పి నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసి త్రాగడం వల్ల వెంటనే మంచి ఫలితం ఉంటుంది.

అల్లం:
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. మరియు ఇతర కొన్ని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల వల్ల కూడా అజీర్తి వంటి లక్షణాలను తగ్గించి కడుపు నొప్పిని నివారిస్తుంది. అల్లం ఎండిన దానికంటే, తాజాగా ఉన్నది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసతి, కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగి స్తుంది. తాజాగా ఉండే అల్లంను టీ చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

హీట్ ప్యాడ్స్ లేదా గోరువెచ్చని బియ్యం:
కడుపు నొప్పిగా ఉన్న ప్రదేశంలో కొద్దిగా వేడి కలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చ. హీట్ ప్యాడ్ మీ వద్ద లేకపోయినట్లైతే కాటన్ వస్త్రం మరియు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యంను పాన్ లో వేసి బాగా వేడి చేసి ఆ బియ్యంను కాటన్ క్లాత్ లో వేసి, నోటితో గాలిని ఊపుతూ నొప్పి ఉన్న ప్రదేశంలో వెచ్చవెచ్చగా వేడి పట్టించాలి. ఇలా చేయడం వల్ల కూడా కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు



Click it and Unblock the Notifications
