Latest Updates
-
మిథున, కర్కాటక, కన్యా రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 17 జూన్ 2026 -
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.!
ప్రాణాంతక హెపటైటిస్ ఎ, బి, సి, డి మరియు ఇ నివారించడం ఎలా
హెపటైటిస్ అనగానే అందరికీ హెపటైటిస్- బి గుర్తుకు వస్తుంది. కానీ ఇది ఒక్కటే కాదు, అందులో కూడా చాలా రకాలున్నాయి.కాలేయ సంబంధితవ్యాధికి చెందిన వైరస్ ఎ,బి,సి,డి, ఇ,ఎఫ్ ఇలా ఆరురకాలుగా విభజించారు. వీటిలో హెపటైటిస్-ఏ, హెపటైటిిస్-బి, హెపటైటిస్-సిలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుం డా ప్రాణాంతకాలుగా పరిణమిస్తాయి.! హెపటైటిస్ అంటే కాలేయంలో కణాలు వాచిపోయి ఫైబ్రోసిస్, సిరోసిస్‌కు దారితీస్తుంది. దీంతో కాలేయ పనితీరు మెల్లగా తగ్గి ప్రాణాంతకంగా మారుతుంది. ఇది కాలేయ కేన్సర్‌కు కూడా దారితీయవచ్చు.
హెపటైటిస్-ఏ : ఇది సాధారణంగా కనిపించే పచ్చకామెర్ల వ్యాధి. 'ఫిలో ఓరల్ రూట్' అంటే మనం తాగే నీరుగానీ, ఆహారం గానీ కలుషితమై నా అది నోటి ద్వారా తీసుకున్నపðడే కాదు. మలరంధ్రాల ద్వారా కూడా శరీరంలోకి వైరస్‌లు చేరి హెపటైటిస్-ఏ సంభవించేందుకు ఆస్కారం ఉంది.
హెపటైటిస్-బి: ఇదిహెపటైటిస్-ఏకన్నా అత్యంత ప్రమాదకర వ్యాధి. ముఖ్యంగా ఇది రక్త మార్పిడి వల్ల ఎక్కువగా వచ్చే వ్యాధి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడే వారి రక్తాన్ని వైరొకరికి ఎక్కించినపðడు ఈ వ్యాధి కారక వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. అలాగే ఈ వ్యాధితో బాధపడేవారికి సిరంజ్‌ని వేరొకరికి వాడినా... ఆ క్రిములు సంక్రమిస్తాయి.
ఈ వ్యాధి సోకిన గర్బి ణీ ద్వారా తన బిడ్డకు కూడా ఈవ్యాధి వస్తుంది. ఇక వ్యాధితో బాధ పడుతున్న వారితో లైంగిక సంపర్కాలు జరిపినా..ఈ వ్యాధి లక్షణాలు ప్రారంభమై... హెప టైటిస్‌గా, లివర్‌క్యాన్సర్‌గా, సిరోసిస్‌గా మారి ప్రాణాంతకమువుతుంది.
హెపటైటిస్-సి : ఇది హెపటైటిస్-బితో కూడిన అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. హెప టైటిస్-బి కనీసం వ్యాక్సిన్ వేసి నిలువరించ వచ్చు కానీ దీనిని మాత్రం ఏలాంటి పద్దతులలోనూ నిలువరించలేం అంటే ఇది ఎంత ప్రమాదకర మైనదో అర్ధం చేసుకోవచ్చు. కలుషిత సూదుల ద్వారా, అవసరార్ధం ఇతరుల నుండి రక్తం స్వీకరించే సమయంలో..తగుపరీక్షలని, జాగ్రత్త లని తీసుకోకుండా ఆదరాబాదరా పడితే.. ఆ వ్యక్తికి హెపటైటిస్-సి ఉంటే ఈవ్యాధి క్షణాలలో సంక్రమిస్తుంది. కాలక్రమంలో ఇది లివర్ సిరోసిస్‌గా, లివర్ క్యాన్సర్‌గా మారి.. ప్రాణాంతకం కూడా కావచ్చు.
లక్షణాలు : ఈ వైరస్ సోకిన క్రమంలో ఈ వ్యాధి లక్షణాలు బైట పడేందుకు 15 నుంచి 50 రోజుల సమయం పట్టేందుకు ఛాన్సుంది. చలి జ్వరం, తల నొప్పి, తీవ్రమైన ఒళ్లు నొపðలు, వికారంగా ఉండటం, విరేచనాలు కావ టం, ఆకలి లేకపోవటంతో పాటు మూత్రం పసుపు వర్ణంలో పోయటం, కళ్లు, నాలుక పచ్చగా మారిపోతుంది. చేతులు, కాళ్ల గోర్లు కూడా పచ్చగా మారుతుంటాయి. కాలేయ భాగం విపరీతమైన నొప్పిగా మారుతుంది. కాలయం కొద్దిగా కొద్దిగా పెరుగుతుంటుంది. దీని తో పాటు ప్లీహం కూడా పెరిగే ఆస్కారం కూడా ఉంది. ఒళ్లంతా దద్దుర్లు, దురదలు వస్తాయి. నడి చేందుకు కూడా వెసులు బాటు ఇవ్వని కీళ్ల నొపð లు, మలం ద్వారా తెల్లని పదార్ధం శరీరం నుండి బైటకు రావటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.

హైపటైటిస్ ఎ నివారించడానికి మార్గాలు:
1. టాయిలెట్ వెళ్ళి వచ్చిన వెంటనే సోపుతో రెండు చేతులు శుభ్రం చేసుకోవాలి.
2. తాజాగా వండిన పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
3. బాగా కాచి వడగట్టిన నీటిని తీసుకోవాలి.
4. ఫ్రెష్ గా ఉన్న పండ్లను బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి.
5. పచ్చికూరలు బాగా శుభ్రంగా కడిగినవి తీసుకోవాలి

హైపటైటిస్ బి నివారణ మార్గాలు
1. సేఫ్ సెక్స్ ను ప్రాక్టీస్ చేయాలి.
2. మీరు గర్భం ధరించి ఉన్నట్లైతే పార్ట్నర్ కు తెలిపాలి.
3. క్లీన్ గా ఉన్నసిరెంజెస్ ఇతరులు ఉపయోగించన వాటిని ఉపయోగించకూడదు
4. టూత్ బ్రెష్, రేజర్స్, రేజర్స్, లేదా మానిక్యూర్ పరికరాలను ఇతరులు ఉపయోగించిన వాటిని ఉపయోగించకూడదు.

హైపటైటిస్ సి నివారణ మార్గాలు
1. టూత్ బ్రష్, రేజర్స్ మరియు మానిక్యూర్ పరికరాలు ఇతరులు ఉపయోగించినవి ఉపయోగించకూడదు.
2. గాయాలు అయినప్పుడు, అవి ఇన్ఫెక్షన్ అవ్వకుండా కవర్ చేయాలి.
3. మద్యం తీసుకోకూడదు
4. డ్రగ్స్ పరికరాలను షేర్ చేసుకోకూడదు

హైపటైటిస్ డి నివారణ మార్గాలు
హైపటైటిస్ బి నివారణ మార్గాలనే ఇక్కడ కూడా ఉపయోగించవచ్చు . ఎవరైతే హైపటైటిస్ బి ఇన్ఫెక్ట్ అయినవారికి అటోమ్యాటిక్ గా హైపటైటిస్ డి కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది.

హైపటైటిస్ ఇ నివారణ:
హైపటైటిస్ ఎ ఇన్ఫెక్షన్ నివారణకు ఏ మార్గాలను అనుసరిస్తామో అదే మార్గాలను హైపటైటిస్ ఇకి కూడా ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications