బత్తాయి జ్యూస్ లోని టాప్ 12 గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

సాధారణంగా అన్ని రకాల పండ్లను మీరు మార్కెట్లో చూసి ఉంటారు. అయితే వాటిలో అన్ని ఆరోగ్యకరమైనే అయినా, మరొకిన్ని అత్యంత ఆరోగ్యకరంగా సహాపడే కూరగాయలు కూడా ఉన్నాయి. అత్యంత ఆరోగ్యప్రయోజనాలను అంధించే పండ్లలో బత్తాయి కూడా ఒటి. దీన్ని(మోసంబీ) స్వీటీ లైమ్ అంటారు. మోసంబీ లేదా స్వీట్ లైమ్ జ్యూస్ ఇండియాలో హాట్ ఫేవరెట్, ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో వీటికి డిమాండ్ ఎక్కువ. ఇవి చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్‌ లైమ్‌ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్‌ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. అందుకే పండ్లరసం అనగానే అందరికీ ఈ పండ్లే గుర్తుకొస్తాయి.

బత్తాయి రసంలో విటమిన్ సి మరియు పొటాషియం పుష్లకంగా ఉంటుంది. అంతే కాదు, రుచికరమైనది మరియు తాజాగా ఉండి మనల్ని రిఫ్రెష్ చేస్తాయి. ఈ బత్తాయి జ్యూస్ శరీరాన్ని చల్లబర్చడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తుంది. మోసంబీ జ్యూస్ ఒక సాధారణ ఇండింయన్ డ్రింక్. ఈ జ్యూస్ ను జ్యూస్ షాపులో కాదు, రోడ్ సైడ్ కూడా వీటిని అమ్మతుంటారు. ఇది నమ్మరసంలా, బత్తాయి అసిడ్ కు గురిచేయదు. మరియు నిమ్మలాగా పుల్లగా ఉండక, తియ్యని రుచి కలిగి ఉంటుంది.

వివిధ రకాల పండ్ల రసాలు... వాటి ఆరోగ్య ప్రయోజనాలు:క్లిక్ చేయండి

బత్తాయి రసంలో పోషక విలువలతోపాటు ఔషధపరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. బత్తాయి, ఇందులో విటమిన్ -సి పుష్కలంగా లభిస్తుంది. పీచు పదార్థాలు, జింక్, కాపర్, ఐరన్ శక్తి, క్యాల్షియం వంటివి దాగివున్నాయి. క్యాలరీలు మరియు ఫ్యాట్ కూడా తక్కువ. ఉదర సంబంధింత రోగాలకు బత్తాయి పండ్లు చెక్ పెడతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఈ పండ్ల రసాన్ని రోజూ ఓ గ్లాసు తీసుకోవడం ద్వారా శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. శరీరానికి కావలసిన ధాతువులు, పీచుపదార్థాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇవే కాదు బత్తాయి జ్యూలో మరిన్ని గొప్ప ఆరోగ్యప్రయోజనాలున్నాయి. అవేంటో ఒక సారి క్రింది విధంగా చూద్దాం.

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి:క్లిక్ చేయండి

డయాబెటిక్ పేషంట్స్ కు ప్రయోజనకరం:

డయాబెటిక్ పేషంట్స్ కు ప్రయోజనకరం:

బత్తాయి రసంలో డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ప్రయోజనకారి. రెండు చెంచాలా బత్తాయి రసంలో, 4చెంచాలా ఉసిరి రసాన్ని, ఒక చెంచా తేనె మిక్స్ చేసి, ప్రతి రోజూ కాలీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గర్భిణీకి మంచి ప్రయోజకారిని:

గర్భిణీకి మంచి ప్రయోజకారిని:

గర్భిణీ స్త్రీలు తరచూ బత్తాయి రసాన్ని త్రాగమని సలహాలిస్లుంటారు. ఇందులో ఉండే క్యాల్షియం, కడుపులో పెరిగే బిడ్డకు మరియు తల్లికి ఇద్దరికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది.

వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది:

వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది:

బత్తాయి జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో గుండె ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. యాధి నిరోధక శక్తిని పెంపొందించటమే గాకుండా.. ఒంట్లోని వేడిని బత్తాయి రసం తగ్గిస్తుంది. మూత్రనాళంలో మంటతో బాధపడేవారు బత్తాయి రసంలో గ్లూకోజ్ లేదా పంచదార కలుపుకుని తీసుకున్నట్లయితే మంట తగ్గటమేగాకుండా, మూత్రం సాఫీగా వస్తుంది.

అల్సర్ కు ఒక మంచి చికిత్స వంటింది:

అల్సర్ కు ఒక మంచి చికిత్స వంటింది:

పెప్టిక్ అల్సర్ అన్నవాహిక, ఉదరం లేదా ఎగువ పేగులోపలి పొర ఇన్ఫెక్షన్ సంభవిస్తే కడుపు నొప్పికు దారితీస్తుంది. కాబట్టి, ఈ స్వీట్ లైమ్ జ్యూస్ లో యాసిడ్ గ్యాస్ట్రిక్ ఎసిడిటిని తగ్గిస్తుంది. మంచి ఫలితం కోసం బత్తాయి రసాన్ని త్రాగాలి. మోసంబీ జ్యూస్ ను గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి త్రాగడం వల్ల మౌత్ అల్సర్ మరియు చెడు శ్వాస నివారించబడుతుంది.

విటమిన్ సి లోపం వల్ల ఏర్పడే వ్యాధి నివారిస్తుంది:

విటమిన్ సి లోపం వల్ల ఏర్పడే వ్యాధి నివారిస్తుంది:

విటమిన్ సి లోపం వల్ల ఏర్పడే వ్యాధులను నివారిస్తుంది మరియు ఇది దంతచిగుళ్ళ వాపుల తగ్గిస్తుంది. ఆంకా దగ్గు, జలుబు మరియు పెదాల పగుళ్ళను నివారిస్తుంది. కాబట్టి, మోసంబీరసంలో ఉండే విటమిన్ సి ఇన్ని రకాలుగా సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

బత్తాయి జ్యూస్ లోని సలవరీ గ్రంథుల నుండి సలైవా విడుదల చేస్తుంది. ఇది తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే ఈ జ్యూస్ లోని ఫ్లెవనాయిడ్స్ పిత్తం, జీర్ణరసాలను మరియు యాసిడ్స్ ను విడగొడుతుంది. కాబట్టి, బత్తాయి రసం త్రాగడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు, పొట్ట సమస్యలు, అజీర్ణం, వికారం మరియు కళ్ళు తిరగడం వంటి సమస్యలను నివారిస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

బత్తాయి రసంను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మరియు బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది.

మలబ్దకాన్ని నివారిస్తుంది:

మలబ్దకాన్ని నివారిస్తుంది:

బత్తాయి రసంలో ఉండే యాసిడ్స్ బౌల్ ట్రాక్ లోని టాక్సిన్స్ ను తొలగించడం వల్ల జీర్ణక్రియ మరింత తేలికవుతుంది . స్వీట్ మోసంబీ జ్యూస్ మరియు చిటికెడు ఉప్పు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అలాగే బత్తాయి రసంలో ఉండే పొటాషియం ఇది స్టొమక్ అప్ సెట్, డిసెంటరీ, డయోరియా మరియు విరేచనాలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే టేస్టీ ఫ్లేవర్ వాంతులను మరియు వికారాన్ని కూడా తగ్గిస్తుంది.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

బత్తాయి జ్యూస్ లో తక్కువ ఫ్యాట్ మరియు తక్కువ క్యాలరీలు, బరువు తగ్గించడంలో అద్భుతంగా సమాయపడుతుంది. బత్తాయి రసంలో తేనె మిక్స్ చేసి త్రాగడం వల్ల బరువును చాలా తేలికగా తగ్గిస్తుంది.

కళ్ళ ఆరోగ్యానికి మంచిది:

కళ్ళ ఆరోగ్యానికి మంచిది:

బత్తాయి రసంలోని యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీబ్యాక్టీరియల్ ప్రొపర్టీస్ వల్ల కంటి వచ్చే ఇతర ఇన్ఫెక్షన్స్ నుండి మరియు మాస్కులర్ డీజనరేషన్ నుండి రక్షిస్తుంది. కంటి పొరకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి మోసంబీ జ్యూస్ ను నేరుగా లేదా చిటికెడు ఉప్పు మిక్స్ చేసి కళ్ళు ను శుభ్ర పరుచుకోవడం ద్వారా కళ్ళను కాపాడుకోవచ్చు.

యూరినరీ డిజార్డర్:

యూరినరీ డిజార్డర్:

బత్తాయిలో అధికంగా పొటాషియం వల్ల యూరినరీ డిజార్డర్ ను తగ్గిస్తుంది. యురినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఇటువంటి ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి, మోసంబీ జ్యూస్ ను వాటర్ తో మిక్స్ చేసి, వేడి చేసిన చల్లారి వెంటనే తీసుకొంటే తక్షణం ఉపశమనం కలిగిస్తుంది.

దగ్గు, జలుబు తగ్గిస్తుంది:

దగ్గు, జలుబు తగ్గిస్తుంది:

బత్తాయిలోని విటమిన్ సి వల్ల సాధారణ జలుబును తగ్గిస్తుంది. మరియు బాడీ రెసిస్టెన్స్ ను పెంచుతుంది.

Desktop Bottom Promotion