Latest Updates
-
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.!
ఉప్పు ఉపయోగించి ఆరోగ్య సమస్యలు నయం చేయటానికి 13 మార్గాలు
ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తే రక్తపోటుకు కారణం అవుతుందని మీరు విని ఉండవచ్చు. కానీ, ఉప్పు మీ పళ్ళను ప్రకాశవంతం చేయటం మరియు జీర్ణక్రియ చికిత్సలో సహాయం చేస్తుందని మీకు తెలుసా? ఈ సారి మీకు సమస్య వచ్చినప్పుడు, ఔషధం కోసం ముందుగా వంటగదిలోకి వెళ్ళండి. మంచి ఆరోగ్యం, చర్మం మరియు జుట్టు కోసం ఉప్పును ఎలా ఉపయోగించాలి.
READ MORE: ఉప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని అనర్ధాలో...
ఉప్పును ఉపయోగించి నయం చేసే మార్గాలు

నోటి పూత
అర స్పూన్ ఉప్పును తీసుకోని పుండు మీద ఉంచాలి. జాగ్రత్త! ఇది తీవ్రమైన బాధను కలిగించవచ్చు. కొన్ని నిమిషాలు అయిన తర్వాత సాదా నీటితో పుక్కిలించి ఉమ్మివేయాలి. ప్రతి ఉదయం మీ పళ్లను తోముకోవటానికి ముందు ఈ విధంగా చేయండి.

గొంతు నొప్పి
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు వేసి పుక్కిలించాలి. ఈ విధంగా చేయుట వలన అడినాయిడ్స్ మరియు టాన్సిల్స్, పంటి నొప్పి వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది.

జీర్ణక్రియ
మీరు అజీర్ణంతో బాధ పడుతూఉన్నప్పుడు లస్సిలో రాతి ఉప్పు మరియు తాజా పుదీనా ఆకులు వేసుకొని త్రాగాలి.

బాడీ స్క్రబ్
ఐదు స్పూన్ల సముద్ర ఉప్పులో ఒక స్పూన్ ఆలివ్ నూనె కలపాలి. ఈ మిశ్రమంలో అర చెక్క నిమ్మరసం కలిపి శరీరానికి పట్టించాలి. కొన్ని నిమిషాలు రబ్ చేసి, పది నిముషాలు అయిన తర్వాత స్నానం చేయాలి.

చుండ్రు
రెండు స్పూన్ల సముద్ర ఉప్పును తల మీద వేసి శాంతముగా వేళ్ళతో మసాజ్ చేయాలి. ఇప్పుడు తేలికపాటి షాంపూ తో మీ జుట్టును శుభ్రం చేయాలి. ఈ విధంగా నెలకు ఒకసారి చేస్తే మీ జుట్టుకు బలం మరియు ఎక్స్ ఫ్లోట్ కూడా తగ్గుతుంది.

కాలిన గాయాలు
కాలిన గాయాల మీద ఉప్పు రాసి, 5 నిమిషాలు అయిన తర్వాత నీటితో కడగండి.

కండరాల తిమ్మిరి
ఒక లీటర్ నీటిలో 2-3 స్పూన్ల పంచదార,1/2 టీస్పూన్ ఉప్పు మరియు నిమ్మ రసం వేసి బాగా కలిపి, ఈ జ్యూస్ ని త్రాగితే కండరాల తిమ్మిరి తగ్గుతుంది.

పాదాల వాపు
ఒక పాన్ లో ఉప్పు వేసి వేడి చేసి,దానిని ఒక వస్త్రంలో వేసి ఉంచాలి. ఈ ప్యాక్ ను పాదాల అడుగున 20 నిమిషాల పాటు ఉంచాలి.(ఈ ఉప్పు ప్యాక్ ను మళ్లీ వేడి చేసి కూడా ఉపయోగించవచ్చు)

ఆర్థరైటిస్ నొప్పి
ఆర్థరైటిస్ నొప్పి తగ్గటానికి వెచ్చని ఉప్పు నీటిలో కాళ్ళను 15 నిముషాలు ఉంచాలి. ( ఒక లీటర్ నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయాలి)

ఇన్గ్రోన్ గోర్లు
గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి పాదాలను 15 నిముషాలు ఉంచి, ఆ తర్వాత పొడి గుడ్డతో తుడిచి గోరు క్లిప్పర్ తో గోరును కట్ చేయాలి.

కంటిరెప్ప అంచున సెగగడ్డ
ఒక పాన్ లో 2 టీస్పూన్ల ఉప్పును వేసి వేడి చేసి, ఒక మృదువైన గుడ్డలో ఉంచండి. ఇప్పుడు దీనిని కంటిరెప్ప అంచున సెగగడ్డ మిద ఉంచండి. అలాగే, మీ కళ్ళు లో ఉప్పు నీటి ఫ్లాషింగ్ ట్రిక్ ఉండవచ్చు.

జ్వరం
ఒక చల్లని నీరు మరియు ఉప్పు ద్రావణంలో ఒక మృదువైన వస్త్రంను ముంచి, నుదిటి మీద ఆ వస్త్రంను ఉంచితే జ్వరం తగ్గటానికి సహాయపడుతుంది. ఉపశమనం కోసం ప్రతి కొన్ని నిమిషాలకు ఈ విధంగా చేయాలి.

మృదువైన గోర్లు
సముద్ర ఉప్పు, బేకింగ్ సోడా మరియు నిమ్మరసం కలిపిన మిశ్రమంతో గోర్లను శాంతముగా మసాజ్ చేయాలి. మృదువైన మరియు తెలుపు గోర్ల కోసం వారంలో ఒకసారి చేయాలి.



Click it and Unblock the Notifications
