Latest Updates
-
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ!
డయాబెటిస్ కి చెక్ పెట్టే సత్తా చెక్కదే..
వంటకాల్లో సువాసన కోసం వాడే దాల్చిన చెక్క మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కొంచెం వగరుగా, ఘాటుగా, కొంచెం తియ్యగా ఉండే దాల్చిన చెక్కలో ఎన్నో రోగాలను నయం చేసే ఎన్నో సుగుణాలున్నాయి. జలుబు, దగ్గు నుంచి గుండె సమస్యలకు వరకు అన్నిటికీ చెక్ పెట్టే సత్తా చెక్కలో ఉంది.
దాల్చిన చెక్కలో కరిగిపోయే పీచుతో పాటు ఇనుము, క్యాల్షియం, మాంగనీస్, సి,కె, విటమిన్లు లభి స్తాయి. ఇందులో ఉండే యాంటీమై క్రోబయల్ సుగుణాలు ఆహారాన్ని ఎక్కువసేపు తాజాగా ఉంచుతాయి. దాల్చిన చెక్కలో దాగున్న సర్ ప్రైజింగ్ హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దాం..

కడుపునొప్పికి
కడుపునొప్పి సమస్య ఉన్నవాళ్లు పది గ్రాముల దాల్చిన చెక్కపొడి, పావు టీస్పూన్ దాల్చిన చెక్క నూనె కలిపి సేవిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

విరేచనాలకు
పావులీటర్ నీటిలో పది గ్రాముల దాల్చిన చెక్క పొడి కలిపి వడగట్టి తాగితే నీళ్ల విరేచనాల సమస్య నుంచి బయటపడవచ్చు.

మహిళలకు
మహిళల్లో రుతు సంబంధం సమస్యల నివారణకు దాల్చిన దివ్య ఔషధంలా పని చేస్తుంది. దీన్ని తీసుకోవటం వల్ల రుతుస్రావం సరైన సమయంలో వచ్చేలా చేస్తుంది. గర్భ దోషాలను కూడా మాయం చేస్తుంది.

జ్ఙాపకశక్తికి
చిటికెడు దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి రాత్రిపూట పడుకునే ముందు సేవిస్తే జ్ఞాపకశక్తి వృద్ధి పెరుగుతుంది.

జలుబు మరియు దగ్గు
దాల్చిన చెక్క టీ లేదా దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. దాల్చిన చెక్క ఎక్కువగా యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నందున, రక్తప్రసరణలో కలిగే ఆటంకాలు తొలగిస్తుంది.

కీళ్ల నొప్పులు
దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే.. కీళ్ల నొప్పులు కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కతో తయారు చేసిన మసాజ్ ఆయిల్ వాడినా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

చర్మ రక్షణ
మసాలా గుణాలు కలిగిన దాల్చిన చెక్క యాంటీ మైక్రోబియల్ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి చర్మ రక్షణకి ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క, తేనెతో కలిపిన మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలపై రాయడం వల్ల అవి తగ్గిపోతాయి.

జీర్ణ సమస్యలు
దాల్చిన చెక్కని, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు చికిత్సగా వాడవచ్చు. జీర్ణప్రక్రియ సజావుగా సాగడానికి, కడుపులో గ్యాస్ తగ్గించడానికి దాల్చిన చెక్క సహాయపడుతుంది.

బరువు తగ్గటం
ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క మిశ్రమాన్ని, గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో పెరిగే ఫ్యాట్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో, రాత్రి పడుకోవడానికి ముందు ఈ మిశ్రమాన్ని తాగాలి.

మధుమేహానికి
దాల్చిన చెక్క రక్తంలో చక్కర స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి డయాబెటిస్ (టైప్ 2 డయాబెటిస్) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండు సార్లైనా తీసుకుంటే మంచిది.

గుండెకి
దాల్చిన చెక్క గుండెకి సంబంధించిన వ్యాధులు, డయాబెటిస్ రావటాన్ని 23 శాతం తగ్గిస్తుందని తాజా అధ్యయనాల్లో తేలింది. దాల్చిన చెక్కకు నీటిని కలిపి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఆపుతుంది.

కొవ్వు పదార్థాలు
దాల్చిన చెక్క, తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిని టీలో కలుపుకుని తాగటం వల్ల శరీరంలోని చెడుకొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి.

క్యాన్సర్
దాల్చిన చెక్క కాన్సర్ కారకాలతో అద్భుతంగా పోరాడి, వాటి వ్యాప్తిని తగ్గిస్తుంది. రోజు సగం స్పూన్ దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల క్యాన్సర్
ప్రమాదం నుంచి బయటపడవచ్చు.

చిగుళ్లకు
హానికర బ్యాక్టీరియా వల్ల వచ్చే చిగుళ్లు సమస్యలతో దాల్చిన చెక్క పోరాడుతుంది.



Click it and Unblock the Notifications
