Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
శరీరంలో హార్మోనులను బ్యాలెన్స్ చేసే 12 మార్గాలు
సహజంగా మనం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం, డైట్ ఫాలో అయితే చాలు అనుకుంటారు. ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి హార్మోనులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఒక్క సారి శరీరంలోని హార్మోన్లలో మార్పులు వచ్చాయంటే, మీరు శారీరకంగా వివిధ రకాలుగా బాధపడాల్సి వస్తుంది. అలాంటిప్పుడు హార్మోనులు బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా ?
హార్మోన్లను బ్యాలెన్స్ చేసుకోవడానికి 12 మార్గాలున్నాయి. హార్మోనుల ఇంజెక్షన్స్ లేదా మెడికేషన్ ఉపయోగించడానికి ముందు, నేచురల్ రెమెడీస్ ను ఎందుకు ఎంపిక చేసుకోకూడదు? శరీరంలో హార్మోన్ల లోపం లేకుండా ఉండటానికి వివిధ రకాల మార్గాలున్నాయి.
ఇంతకీ మన శరీరంలోని హార్మోనులు బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయడం ఎందుకు? శరీరంలో ఏ ఒక్క హార్మోన్ లోపించినా వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి డైట్ ను ఫాలో అవుతున్నారన్న విషయంతో పనిలేకుండా శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
అందువల్ల, హార్మోన్లు బ్యాలెన్స్ చేసుకోవడానికంటే ముందుగా అసలు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేంటి అని తెలుసుకోవాలి. హార్మోన్లు మనిషి జీవితానికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.
శారీరక ఆరోగ్యం నుంచి మూడ్ స్వింగ్స్ వరకూ శరీరం లోపల జరిగే ప్రతి ఒక్క పనికి హార్మోన్లు మీద ఆధారపడాలి. హార్మోనులు ప్రభావం టీనేజర్ లో మొటిమలు, అకస్మిక మార్పులు, శారీరక మార్పులు, మూడ్ స్వింగ్స్ మొదలగు మార్పులు జరుగుతాయి. కాబట్టి శరీరంలో హార్మోన్లను బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని సింపుల్ రెమిడీస్ ఉన్నాయి..

1. హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి:
శరీరంలో హార్మోన్లు అసమతుల్యతను మెయింటైన్ చేయడానికి, హెల్తీ ఫ్యాట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. హెల్తీ ఫ్యాట్స్ అంటే మీరు రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్, రియల్ బట్టర్, చేపలు, పీనట్ బట్టర్ వంటివి తీసుకోవడం మంచిది.

2. క్యారెట్స్:
క్యారెట్స్ హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ ను దూరం చేస్తాయి. క్యారెట్ లో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంను డిటాక్సిఫై చేస్తుంది.అదనపు ఆస్ట్రోజన్ స్రవిస్తుంది. స్త్రీ, పురుషులిద్దరికి క్యారెట్ గ్రేట్ గా సహాయపడుతుంది. పీరియడ్స్ సమస్యలతో బాధపడేవారికి క్యారెట్ గ్రేట్ హార్మోన్ బ్యాలెన్డ్ ఆహారం.

3. కాఫీ తగ్గించుకోవాలి:
ఎక్కువ కాఫీ తాగడం వల్ల అది ఎండోక్రైన్ మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గర్భిణీలో ఈ మార్పు జరుగుతుంది. అందుకోసం హెర్బల్ టీని తాగడం మంచిది. ఐతే మీరు కాఫీకి అలవాటు పడిపోయినట్లైతే, కాఫీ కప్పులో ఒక టీస్పూన్ కోకనట్ ఆయిల్ మిక్స్ చేసి తీసుకోవాలి. ఇది హెల్తీ ఫ్యాట్. కెఫిన్ మీద నెగటివ్ గా పనిచేస్తుంది.

4. బట్టర్ మింట్స్:
హార్మోనులు బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఈ పద్దతిని ఫాలో అవ్వడి. బట్టర్ మింట్స్ బ్లడ్ షుగర్ ను అండర్ కంట్రోల్లో ఉంచుతుంది. కార్బోహైడ్రేట్స్ మీద కోరికలను తక్కువ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల హార్మోను అసమతుల్యతమీద వివిధ రకరకాలుగా పనిచేస్తుంది.

5.సరిపడా నిద్ర:
రోజుకు సరిపడా నిద్రపొందడం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. నిద్రపొందడం వల్ల శరీరం చురుకుగా మారుతుంది. శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తుంది. హార్మోన్ల బ్యాలెన్స్, మూడ్ స్వింగ్స్ ను మార్చడానికి సహాయపడుతుంది.

6. అనిమల్ లివర్ తినాలి:
మీ రెగ్యులర్ డైట్ లో లివర్ చేర్చుకోవడం వల్ల హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి ఒక మంచి మార్గం. హార్మోన్ బ్యాలెన్స్ కు ఇది ఒక సూపర్ ఫుడ్ గా భావిస్తారు. అనిమల్ లివర్ లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది. శరీరంను డిటాక్సిఫై చేస్తుంది.

7. రెగ్యులర్ వ్యాయామం చేయాలి:
హార్మోనుల లోపంతో బాధపడే వారు రెగ్యులర్ వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా హార్మోనులు మెరుగుపడటానికి అవసరమయ్యే వ్యాయామాలు చేయడం వల్ల హార్మోనులను బ్యాలెన్స్ చేసుకోవచ్చు.

8. మెటబాలిక్ హైడ్రేషన్ :
ప్రతి రోజూ శరీరానికి అవసరమయ్యేంత నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎక్కువ గా కూడా తీసుకోకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు తగ్గిపోతాయి. కాబట్టి రోజకు తప్పనిసరిగా 8 గ్లాసుల నీరు తాగడం చాలా అవసరం.

9. హెర్బ్స్ :
మూలికల్లో రాస్బెర్రీ లీఫ్ లేదా చెస్ట్ ట్రీ బెర్రీలు మీ సమస్యను నివారిస్తాయి, హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి.

10 జెలటిన్ :
అమినో యాసిడ్ లో ఉండే జలటిన్ హార్మోనులను సమతుల్యం చేస్తాయి. ఇది థైరాయిడ్ ఫంక్షన్ ను ప్రాపర్ గా మార్చుతుంది. థైరాయిడ్ హార్మోన్ ఇతర హార్మోనులు బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది.

11. గుడ్డు:
అధికబరువు పెరుగుతామన్న భయం వద్దు, గుడ్డు , పచ్చసొన తినడం వల్ల హార్మోనులు బ్యాలెన్స్ అవుతాయి. గుడ్డులో విటమిన్ ఎ , డి మరియు ఇతర మినిరల్స్ అధికంగా ఉండి , శరీరంలోని జీవక్రియలకు సహాయపడుతాయి.

12. కౌగిలింత:
పార్ట్నర్ ను హగ్ చేసుకోవడం వల్ల శరీరంలో హార్మోనులు స్రవిస్తాయి. ఇది సింపుల్ చిట్కా, నిపుణుల అభిప్రాయం ప్రకారం పార్ట్నర్ ను హగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ‘ఆక్సిటోసిన్ అనే హ్యాపీ' హార్మోను ఉత్పత్తి అవుతుంది.



Click it and Unblock the Notifications











