Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
తీవ్ర నొప్పి, మంటతో ఇబ్బందిపెట్టే మౌత్ అల్సర్లకు కారణాలు..!
మౌత్ అల్సర్స్ వచ్చాయంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వేడిగా ఉన్నవి, స్పైసీగా ఉన్న ఫుడ్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్పైసీ లేకపోయినా.. వీటి కారణంగా తినలేకపోతారు. ఇవి తెల్లటి ప్యాచ్ లుగా చుట్టూ ఎర్రగా మారిన పుండ్లు మాదిరిగా ఏర్పడతాయి. ఇవి నోట్లో ఎక్కడైనా ఏర్పడతాయి.
కొంతమందికి బుగ్గలకు లోపలి భాగంలో, కొంతమందికి నాలుక కిందివైపు, కొంతమందికి నాలుక చుట్టూ, చిగుళ్ల చుట్టూ ఏర్పడతాయి. ఇవి చాలా మంట, నొప్పి కలిగిస్తాయి. మౌత్ అల్సర్స్ కారణంగా.. రోజూ చేసే పనులకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఇవి మరీ పెద్దగా ఏర్పడినప్పుడు ఏమీ తినలేక, తాగలేక ఇబ్బందిపడాల్సిందే.
చిన్నచిన్నగా ఏర్పటిన మౌత్ అల్సర్స్ 5 నుంచి 10 రోజుల్లో నయం అవుతాయి. ఒకవేళ మరీ పెద్దగా ఉంటే.. కాస్త టైంపడుతుంది. కొన్నిరకాల మౌత్ అల్సర్స్ హెర్ప్స్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. ఇలా ఏర్పడినవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. 50 నుంచి 60 పుండ్లు ఉంటాయి. ఇవి చాలా పెయిన్ ఫుల్ గా ఉంటాయి. ఇలాంటివి ఎక్కువగా మహిళల్లో వస్తాయి.
చాలామంది మౌత్ అల్సర్లను చాలా నిర్లక్ష్యం చేస్తారు. కానీ.. ఇవి రావడానికి అసలు కారణాలు తెలుసుకుంటే.. మంచిది. ఎందుకంటే.. కొన్నిసార్లు త్వరలో రాబోయే అనారోగ్యానికి సంకేతంగా.. ఇవి ఏర్పడతాయి. కాబట్టి సాధారణ కారణాలు తెలుసుకుంటే.. ముందే జాగ్రత్త పడవచ్చు.

హార్మోనల్ ఇంబ్యాలెన్స్
మౌత్ అల్సర్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి. మహిళల్లో రుతుక్రమానికి ముందు, తర్వాత మౌత్ అల్సర్లు వచ్చే అవకాశాలుంటాయి.

ఒత్తిడి
చాలా సందర్భాల్లో ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నప్పుడు కూడా మౌత్ అల్సర్లు వస్తాయి. అంతేకాదు.. ఎప్పుడైతే ఒక వ్యక్తి.. అప్ సెట్ కి గురయి ఉంటారో అప్పుడు కూడా మౌత్ అల్సర్లు వస్తాయి.

హెర్ప్స్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్స్
హెర్ప్స్ సింప్లెక్స్ అనేది కంటాజియస్ వైరస్. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్ గా సోకుతుంది. ఒకే ప్లేట్ లో ఇద్దరు తినడం వల్ల ఈ వైరస్ సోకవచ్చు. అలాగే కిస్ ద్వారా, లిప్ బామ్ ఒకేదాన్ని ఉపయోగించడం వల్ల కూడా సోకుతుంది.

అలర్జీ
కొన్ని రకాల ఆహారాలు కొంతమందికి పడవు. అలర్జీలకు కారణమవుతాయి. అలాంటి ఆహారాలు తీసుకున్నప్పుడు వాళ్లకు మౌత్ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కొంతమంది మరీ ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకుంటారు. అలాంటి వాళ్లకు కూడా మౌత్ అల్సర్స్ వస్తాయి. కాబట్టి ఏం తింటున్నామనే విషయంలో జాగ్రత్త వహించాలి.

అనీమియా
ఐరన్ లెవెల్స్ తక్కువయినప్పుడు అనీమియాకి గురవుతారు. అనీమియా వల్ల నోట్లో అల్సర్లు, డ్రైనెస్ కి కారణమవుతుంది. నోట్లోనే కాకుండా, నోటి చుట్టూ, గొంతులో డ్రైగా మారుతుంది.

డెంటల్ హెల్త్ సరిగా లేనప్పుడు
చిగుళ్ల చుట్టూ వచ్చే అలర్స్ పంటి ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఏర్పడతాయి. అన్ని అల్సర్స్ కంటే.. పంటి చిగుళ్లకు వచ్చేవి చాలా నొప్పిగా ఉంటాయి.

పోషకాహార లోపం
ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ బి12, విటమిన్ సి, ఐరన్ లోపం ఉన్నవాళ్లలో మౌత్ అల్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

బోవెల్ మూమెంట్ సరిగా లేనప్పుడు
బోవెల్ మూమెంట్ సరిగా లేనివాళ్లలో మౌత్ అల్సర్లు వస్తుంటాయి. ఒకవేళ మౌత్ అల్సర్లు వారం రోజుల్లో తగ్గకపోతే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది.



Click it and Unblock the Notifications