Latest Updates
-
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.! -
శుక్ర-శని సమసప్తక యోగం.. ఆగస్టు 1 నుండి ఈ రాశులకు ఊహించని కష్టాలు! -
90స్ కిడ్స్ ఫేవరెట్ పల్లి ఉండలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
అమృతం లాంటి సాంబార్ కేవలం 15 నిమిషాల్లోనే.. ఎలాగో చూసేయండి! -
సిగరెట్ ముట్టకపోయినా యువకులకు లంగ్ క్యాన్సర్..మీలో ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా? -
మిక్సీ, స్టవ్ తో పనేలేదు.. 5 నిమిషాల్లో అద్భుతమైన రాజస్థానీ స్పెషల్ డుంగ్రీ చట్నీ ఎలా చేసుకోవాలంటే.. -
ఆగష్టులో ప్రధాన గ్రహాల రాశి మార్పులు.. ఈ నాలుగు రాశుల వారికి లక్కే లక్కు.! -
శుక్ర గ్రహ గోచారం.. ఈ మూడు రాశుల వారికి కెరీర్లో కొత్త అవకాశాలు.! -
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.! -
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.!
దండాసన (నిలబడిన భంగిమ) సయాటికా నొప్పి తగ్గడానికి
చాలా మంది వెన్ను నొప్పి, తుంటి నొప్పి, కూర్చున్నప్పుడు లేదా కాళ్ళలో జలదరింపు సంచలనం కలిగి నట్లు ఫిర్యాదు చేయడం వినే ఉంటారు. ఇవి సయాటికా కు సంబంధించిన ప్రధాన లక్షణాలు.
నరం నొప్పి వెన్ను కింద నుండి కాలి వరకు విస్తరించినట్లైతే సయాటికా నరాన్ని ప్రభావితం చేస్తుంది, దానివల్ల మీకు విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ రకమైన నొప్పిని సయాటికా అంటారు.
కొంతమంది ఇవి బాడీ పెయిన్స్ అని పెద్దగా పట్టించుకోరు, వెంటనే ఉపశమనం పొందడానికి మాత్రలు వాడతారు. ఖర్చును తగ్గించుకోవడానికి ఇది అవసరమని పేర్కొంటారు.
సయాటికా నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి, యోగా చేయడం మంచిది. సాయాటికా నొప్పిని తగ్గించడానికి అన్నిటికన్నా సరళంగా దండాసనంగా భావిస్తారు.
“దండాసన” అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది, “దండ” అంటే కర్ర అని, “ఆసన” అంటే భంగిమ అని అర్ధం.
వేకువ ఝామునే ఈ ఆసనాన్ని చేయడం చాలా మంచిది, కానీ ఉదయం పూట చేయలేనివారు, భోజనం చేసిన ఆరు గంటల తరువాత సాయంత్రం సమయంలో ఈ ఆసనాన్ని చేయవచ్చు.
అతి తేలికైన యోగాసనాలలో ఇది ఒకటి; అయితే, అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలను పొందాలి అంటే, ఈ ఆసనాన్ని సరైన పద్ధతిలో చేయడం చాలా అవసరం. కూర్చుని చేసే ఇతర అన్ని యోగాసనాలకు ఇది ఆధారం కుడా.

దండాసనం వల్ల ప్రయోజనాలను పొందడానికి ఈ కింద ఇచ్చిన దశలవారీ విధానాన్ని గమనించండి.
దండాసన వేయడానికి ఒకదాని తరువాత ఒకటి చేయవలసిన పద్ధతి:
1. మీ వెన్నుని నిఠారుగా ఉంచి, నేలమీద కూర్చోండి.
2. మీ కాళ్ళను ముందుకు తీసుకువచ్చి పాదాలు పైకి ఉండేట్లు పెట్టండి.
3. మీ పిర్రలను నేలపై ఆన్చి, మీ బరువుని పిర్రలపై ఉంచండి.
4. ముందుకు చూస్తూ తలను నిఠారుగా ఉంచండి.
5. మడాలు నేలకు వత్తుకుని ఉంటాయి.
6. మీ అరచేతులను నడుము భాగం పక్కగా నేలకు ఆన్చి ఉంచండి.

7. కాళ్ళు వదులుగా ఉంచాలి. ఉచ్వాస నిస్వాసాలు మామూలుగా కొనసాగిస్తూ శ్వాస తీసుకోవడంపై ధ్యాస ఉంచండి.
8. ఈ భంగిమలో కనీసం 20 సెకండ్లు ఉండి, తరువాత విశ్రాంతి తీసుకోండి.
దండాసన వల్ల ఇతర ప్రయోజనాలు:
వెనుక భాగంలోని కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది
పొట్టను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది
ఛాతీ, భుజాలను వంచడానికి సహాయపడుతుంది
ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంపొందించడానికి సహాయపడుతుంది
ఆస్తమా కు చికిత్సగా సహాయపడుతుంది
శరీర భంగిమను మెరుగుపరచడానికి సహాయపడుతుంది
జాగ్రత్తలు:
వెన్నునొప్పి, మణికట్టు గాయం ఉన్నవారు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి. అయితే, యోగా గురువుల మార్గదర్శకంలో ఈ ఆసనం వేయడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications