Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
సరిపడా నీళ్ళు తాగడం లేదా..? ఐతే శరీరానికి జరిగే నష్టాలు తెలుసుకోండి..!
ఈ ప్రపంచంలో మంచినీళ్లకు మించిన ఔషధం మరొకటి లేదు. అలసట అనిపించినా.. ఆయాస పడినా..నీరసంగా అనిపించినా...ఎనర్జీలేనట్లు అనిపించినా.. కాసిన్ని నీళ్లు తాగితే రిలాక్స్ గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కాఫీ, సోడాలకంటే మంచినీళ్లు సంతృప్తినిస్తాయి. శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగితే.. మీ ఆరోగ్యం పదికాలాలపాటు బాగుంటుంది. మన శరీరం జీవక్రియలు చురుకుగా పనిచేయాలంటే శరీరానికి సరిపడా ఇందనం అవసరం అవుతుంది. ఆ ఇందనమే నీరు. శరీరానికి సరిపడా నీరు అందలేదంటే శరీరం జరిగే జీవక్రియలన్ని పనిచేయడం మానేస్తాయి. శరీరంలో ప్రతి అవయవం, ప్రతి కణానికి నీరు అవసరం ఉంది.
ప్రపంచంలో సహజసిద్ధంగా దొరికే నీటిని శరీరానికి సరిపడా అందించకపోవడం వల్ల.. అనారోగ్యానికి గురవుతున్నారు. మంచినీళ్లు తాగాలంటే చాలా మంది కష్టంగా ఫీలవుతారు. మేం నీళ్లు బాగానే తాగుతున్నాం అని చాలా మంది చెబుతుంటారు.కానీ ఏదో గొంతు తడుపుకోవడం తప్ప, ఎక్కువగా నీళ్ళు తాగేవారు తక్కువే...
మరి మీరు మీ శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు అందిస్తున్నారా? లేదా? ఒకసారి చెక్ చేసుకోండి..? రోజూ నీళ్ళు ఎక్కువగా తాగే వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. సరిపడా నీళ్ళ తాగనవారు వేలమంది ఉంటారు. కాబట్టి.. మీ శరీరంలో కింద చెప్పబోయే మార్పులు కనిపించాయంటే.. మీరు సరైన మోతాదులో మంచినీళ్లు తాగడం లేదని అర్థం. రోజులో మీ శరీరానినికి సరిపడా నీళ్ళు తాగడం లేదంటే శరీరంలో జరిగే మార్పులు, ఎఫెక్ట్స్ తెలుసుకోండి...

ఎఫెక్ట్ #1 :
రోజూ శరీరానికి సరిపడా నీళ్ళు తాగడం వల్ల శరీరం హైడ్రేసన్ లో ఉంటుంది, బ్లడ్ లో 92శాతం నీరు ఉంటుంది. ఎప్పుడైతే నీరు సరిపడా తాగకపోతే రక్త చిక్కబడుతుంది. రక్తప్రసరణ సరిగా జరగదు, బ్లడ్ క్లాట్స్ కు కారణమవుతుంది. హైబిపి వస్తుంది.

ఎఫెక్ట్ #2 :
శరీరానికి తగిన విధంగా హైడ్రేషన్ అందివ్వకపోవడం వల్ల , కొలెస్ట్రాలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దాంతో శరీరం సెల్స్ నుండి వాటర్ ను తిరిగి గ్రహిస్తుంది.

ఎఫెక్ట్ #3 :
డీహైడ్రేషన్ చర్మ మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. ఎప్పుడైతే నీరు సరిగా తాగరో అప్పుడు శరీరంలో టాక్సిన్స్, వ్యర్థ్యాలు సరిగా బయటకు పోకపోవడం వల్ల వ్యాధులకు గురికావల్సి వస్తుంది. అలర్జీలు పెరుగుతాయి. చర్మంలో ముడుతలు, మచ్చలు ఏర్పడుతాయి.

ఎఫెక్ట్ #4 :
సరిపడా నీళ్ళు తాగలేదంటే మలబద్దక సమస్యలు ఏర్పడుతాయి. ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సమస్యగా మారుతుంది. కాబట్టి జీర్ణవ్యవస్థకు సమస్య రాకుండా ఉండాలంటే.. నీళ్లు సరైన మోతాదులో తాగాలి. దీనివల్ల కాన్స్టిపేషన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. ఇదే కొన్ని సందర్భాల్లో మొలల వ్యాధికి దారితీస్తుంది.

ఎఫెక్ట్ #5 :
నీళ్ళు సరిపడా తీసుకోలేదంటే శరీరంలో ఎంజైమ్స్ సరిగా, యాక్టివ్ గా పనిచేయవు. అప్పుడు శరీరంలో జీవక్రియలు, నార్మల్ కంటే మరింత ఆలస్యంగా పనిచేస్తాయి. ఈ కారణం వల్ల అలసటకు దారితీస్తుంది. ఎనర్జిటిక్ గా ఫీలవ్వాలంటే, శరీరానికి తగినంత హైడ్రేషన్ అవసరమవుతుంది.

ఎఫెక్ట్ #6 :
జీర్ణ సమస్యలు: సరిపడా నీళ్ళు తాగకపోవడం వల్ల శరీరంలో క్యాల్షియం, మెగ్నీషియం, వంటి మినిరల్స్ వంటివి అల్సర్, గ్యాస్ట్రిక్, హార్ట్ బర్న్ వంటి జీర్ణసమస్యలు పెరుగుతాయి.

ఎఫెక్ట్ #7:
కిడ్నీ సమస్యలు: తక్కువగా యూరినేషన్ కి వెళ్తున్నారంటే.. మీరు సరిగా నీళ్లు తాగడం లేదనడానికి సంకేతం. రోజుకి 4 నుంచి 7సార్లు రెస్ట్ రూమ్ కి వెళ్లాలి. యూరిన్ కలర్ క్లియర్ గా ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. అదే కాస్త ఎల్లో కలర్ లో ఉందంటే,.. మీరు నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కు గురైందని సంకేతం. కొన్ని సందర్భాల్లో ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. టాక్సిన్స్ సరిగా విసర్జింపక బ్యాక్టీరియా చేరుతుంది. దాంతో కిడ్నీ ఇన్ఫెక్షన్స్, నొప్పి. కిడ్నీసమస్యలు వస్తాయి

ఎఫెక్ట్ #8:
సరిపడా నీరు తాగకపోవడం వల్ల శ్వాస నాళాలు సరిగా పనిచేయవచ్చు .బ్రీతింగ్ సమస్యలు , అలర్జీలు పెరుగుతాయి.



Click it and Unblock the Notifications
