ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం?

ప్రపంచంలో ఏ మనిషైనా ఎక్కడైనా ఓడిపోతాడేమో కానీ తన కూతురి చిరునవ్వు ముందు మాత్రం గెలవలేడు. ఇంటికి రాగానే నాన్నా.. అంటూ ఉరుక్కుంటూ వచ్చే ఆ చిన్నారిని అక్కున చేర్చుకోగానే ఆ తండ్రి పడే సంతోషం వర్ణనాతీతం. నాన్నకు కూతురంటే ఎందుకంత ప్రాణం? భార్య మీద, కొడుకు మీద ఉండే ప్రేమకు, కూతురిపై చూపించే ప్రేమకు ఎందుకంత వ్యత్యాసం ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం ఎమోషన్స్ మాత్రమే కాదు, దీని వెనుక ఒక అందమైన సైన్స్ కూడా దాగి ఉంది.

Why Fathers Are Soft on Daughters but Strict with Sons

ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒక తండ్రి తన కూతురితో సమయం గడుపుతున్నప్పుడు, అతని మెదడులో ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయట. ఈ హార్మోన్ వల్లే నాన్నకు తన కూతురు అంటే అంత ప్రత్యేకమైన ప్రేమ, చెప్పలేనంత సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. అంతేకాదు కూతురు ఇచ్చే ఒక చిన్న స్మైల్ నాన్న మెదడులోని రివార్డ్ సిస్టమ్ ను వెంటనే యాక్టివేట్ చేస్తుంది. ఆ ఒక్క నవ్వు ముందు ప్రపంచంలోని ఎలాంటి సంతోషమైనా, సిరిసంపదలైనా చిన్నవిగానే అనిపిస్తాయి.

కొడుకుతో స్ట్రిక్ట్..కూతురుపై ప్రేమ

చాలా ఇళ్లలో గమనిస్తే, నాన్న కొడుకుతో చాలా కఠినంగా ఉంటాడు, అదే కూతురి దగ్గరికి వచ్చేసరికి వెన్నలా కరిగిపోతూ చాలా సాఫ్ట్ గా ఉంటాడు. తండ్రి మనస్తత్వంలో ఉండే ఒక సహజమైన ఆలోచనా విధానమే దీనికి కారణం. కొడుకుని ఈ కఠినమైన లోకం కోసం ఒక యోధుడిలా సిద్ధం చేయాలని నాన్న ఆరాటపడతాడు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకుని నిలబడేలా అతనికి ధైర్యాన్ని నూరిపోస్తాడు. కానీ కొడుకుని లోకం కోసం సిద్ధం చేస్తే... కూతురిని మాత్రం ఈ కఠినమైన లోకం నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవాలని తపిస్తాడు. కొడుక్కి ఆయుధం ఇచ్చే నాన్న, కూతురికి మాత్రం తానే ఒక రక్షణ కవచంలా మారిపోతాడు.

రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు..రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు..

నాన్న కళ్లలో కూతురు ఎప్పుడూ ఒక దేవతే. ఆకాశం నుంచి తనకోసం దిగివచ్చిన ఒక అద్భుతమైన కానుకలా భావిస్తాడు. అదే సమయంలో ఒక కూతురి కళ్లలో ఆమె జీవితంలో చూసే మొట్టమొదటి హీరో నాన్నే. తనకి ఏ ఆపదా రాకుండా నాన్నే చూసుకుంటాడని ఆ చిన్నారి బలంగా నమ్ముతుంది. తనపై కూతురు పెట్టుకున్న ఆ అపారమైన నమ్మకమే..నాన్నలో ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యతే నాన్నను మరింత గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.

అమ్మ ప్రేమ మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ నాన్న ప్రేమ అలా కాదు, అది చాలా సైలెంట్ గా ఉంటుంది. ఆ సైలెంట్ గా ఉండే మౌనం వెనుక, అంతుచిక్కని ఒక సముద్రమంత లోతైన రక్షణ, కొండంత అండ దాగి ఉంటాయి.

Story first published: Friday, July 31, 2026, 22:00 [IST]
Desktop Bottom Promotion