Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
డైలీ డైట్ లో అల్లం..! సర్వరోగాలు నయం..!
అల్లం..!! మనం నిత్యం ఉపయోగించే ఒక రకం స్పైస్. దీన్ని రకరకాల వంటకాల్లో, జ్యూస్ లలో, టీలలో వాడుతాం. అల్లంను మెడిసిన్ గా ఉపయోగిస్తారు. అలాగే ఇందులో చాలా రకాల వ్యాధులను నయం చేసే మెడిసినల్ వ్యాల్యూస్ దాగున్నాయి. అల్లం ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాలు మానవ శరీరంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. అల్లంను రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు చూద్దాం. అల్లంని రోజు వారీ డైట్ లో చేర్చుకుంటే.. మీ శరీరానికి ఎలా మేలు చేకూరుతుందో తెలుసుకుందాం..
READ MORE: అల్లం టీ యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు

క్యాన్సర్ సెల్స్
అల్లం ఒవేరియన్ క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఒవేరియన్ క్యాన్సర్ రోగులకు ఇచ్చే మందులకంటే కూడా అల్లం చాలా వేగంగా.. క్యాన్సర్ సెల్స్ ని నివారిస్తుందని ఈ స్టడీస్ చెబుతున్నాయి. అలాగే అల్లంను డైలీ డైట్ లో చేర్చుకుంటే.. ఇన్ల్ఫమేషన్, కోలన్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది.

దగ్గు, గొంతు నొప్పి
దగ్గు, గొంతునొప్పికి అల్లంను కొన్ని సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. వేడినీటిలో అల్లం తురుము, నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం వల్ల.. దగ్గు, గొంతునొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే.. ముక్కు దిబ్బడ నుంచి రిలీఫ్ వస్తుంది.
READ MORE: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోండి.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి..
రక్తప్రసరణ
భూమిలోనుంచి పుట్టే అల్లం చాలా సహజసిద్ధంగా పనిచేస్తుంది. అల్లంను ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటూ ఉంటే.. రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే.. ఇది రక్తప్రసరణ మెరుగవడానికి సహాయపడుతుంది.

ఎసిడిటీ
ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడానికి మందుల కంటే.. ఆరు రెట్లు వేగంగా.. అద్భుతంగా అల్లం పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది. ఎసిడిటీకి ఉపయోగించే మందులు అల్సర్, స్టమక్ క్యాన్సర్ రిస్క్ తీసుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి... ఎసిడిటీ సమస్యతో బాధపడేవాళ్లు మందులకు బదులు అల్లంను డైట్ లో చేర్చుకుంటే.. న్యాచురల్ గా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
