For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లింప్ నోడ్స్ వాపును తగ్గించే అత్యుత్తమ మార్గాలు

By Y BHARATH KUMAR REDDY
|

కొన్ని సందర్భాల్లో లింప్ నోడ్స్ (శోషరసనాళాలు) వాపులకు గురవుతుంటాయి. ఇవి 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవు వరకు పరిణామంలో ఉటాయి. మూత్రపిండాలు లేదా చిన్న గుడ్డు ఆకారంలో ఉంటాయి. లింఫ్ నోడ్ లు వాయడం లేదా ఉబ్బడం వల్ల ఎలాంటి నొప్పులు కలగవు. మొదట ఇవి ఆకలిని కోల్పోయేలా చేసి, బరువు తగ్గేలా చేస్తాయి. అలాగే చర్మం పై దురద ఎక్కువ అవుతుంది. అలాగే శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. దగ్గు కూడా ఉంటుది. ఇలాంటి లక్షణాలుగా ఎక్కువగా ఉంటాయి. శోషరసనాళ వ్యవస్థ వ్యాధి కారకాలతో పోరాడి శరీరానికి రోగనిరోధక వ్యవస్థని పెంచుతుంది. శరీరంలో చర్మం ఉపరితలానికి దగ్గరగా ఉండే లింఫ్ నోడ్స్ ఎక్కువగా వాపులకు గురవుతాయి. దీని వల్ల శరీర భాగాల్లో వాపులు వస్తాయి. ముఖ్యంగా మెడ చుట్టూ, గొంతు దగ్గర వాపులు ఏర్పడతాయి. దీంతో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లింప్ నోడ్స్ వాపు సమస్యను మనం ఇంట్లోనే ఉంటూ పరిష్కరించుకోవొచ్చు.

1. తేనె

1. తేనె

గ్రంథుల వాపును తగ్గిచడంలో తేనె బాగా పని చేస్తుంది. తేనే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. తేనెను నిత్యం ఉపయోగించడం వల్ల వాపును తగ్గిపోతుంది. తేనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గ్రంథుల వాపును తగ్గిస్తాయి. నిమ్మ రసం, తేనె ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఇలా చేయండి: ఒక నిమ్మకాయ నుంచి రసం తీయండి. దాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లలో కలపండి. ఒకటి లేదా రెండు టీస్పూన్ల తేనెను అందులో కలపండి. మీరు ఇలా రెండు నిమ్మకాయ రసాన్ని తయారు చేసుసుని ఉదయం, రాత్రి తాగితే మంచి ఫలితం ఉంటుంది.ఉదయం పరగడుపున ఇలా తయారు చేసుకున్న నిమ్మరసాన్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ శరీర వ్యవస్థను శుభ్రపరచడానికి, మీ శరీరం నుంచి మలినాలను తొలగించి రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే వాపు గ్రంథుల వద్ద కొంచెం తేనెతో మర్దన చేయండి. 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే వదిలివేయండి. తర్వాత దాన్ని కడిగివేయండి. మీరు రోజుకు రెండు లేదా మూడు సార్లు ఇలా తేనెతో సున్నితంగా మర్దన చేసుకోండి.

2. వెల్లుల్లి

2. వెల్లుల్లి

లింప్ నోడ్స్ వాపునుకు గురైనప్పుడు వెల్లుల్లి ద్వారా మంచి పరిష్కారం పొందొచ్చు. వెల్లుల్లిలో యాంటి వైరల్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, రోగనిరోధక వ్యవస్థను పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి లేదా రెండు వెల్లుల్లిలను తీసుకోండి. వాటిని బాగా మెత్తగా చేసి మింగడి. ఒకవేళ మీకు నేరుగా మింగడానికి ఇబ్బందిగా ఉంటే కాస్త తేనేలో వెల్లుల్లి పేస్ట్ ను కలుపుకుని తాగండి. రోజూ వెల్లుల్లి తినడం వల్ల మీలో రోగనిరోధకవ్యవస్థ బలపడుతుంది.

3. అల్లం

3. అల్లం

అల్లం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇది గ్రంథుల వాపును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అల్లంలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలుంటాయి. శరీరంలోని విష రసాయనాలు తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బాక్టీరియాపై వ్యతిరేకంగా పోరాడడానికి సహాయం చేస్తుంది. అందువల్ల రోజూ తినే ఆహారంలో అల్లాన్ని ఉండేటట్లు చూసుకోండి.

4. టీ బ్యాగ్స్

4. టీ బ్యాగ్స్

టీ బ్యాగులు కళ్లపై పెట్టి ఉంచితే కళ్ల చుట్టు ఉన్న వలయాలు తగ్గుతాయనే విషయం మనకు తెలిసిందే. వాపు తగ్గించడంలో టీ బ్యాగులు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇలా చేయండి : కొన్ని టీ బ్యాగ్లను తీసుకోండి. కొన్ని నిమిషాల పాటు వాటిని వేడి నీటిలో ఉడికించండి. వాటిని వాపు ఉన్న ప్రాంతాల్లో కొద్దిసేపు ఉంచండి. మంచి ఉపశమనం పొందడానికి ప్రతిరోజూ మూడుసార్లు ఇలా చేస్తూ ఉండండి.

5. చామంతి టీ

5. చామంతి టీ

చామంతి టీ లింప్ నోడ్స్ వాపు తగ్గడానికి బాగా పని చేస్తుంది. ఇది వ్యాధినిరోధకతశక్తిని పెంచుతుంది. యాంటీబ్యాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో అధికంగా ఉంటాయి. చమోమెలీ టీని వీలైనంత ఎక్కువగా తాగడానికి ప్రయత్నించండి. ఇలా చేయండి : ఒక కప్పు వేడి నీటిలో కొన్ని చేమంతి పువ్వులను వేయండి. 5 నుంచి 7 నిముషాలు పాటు ఉంచండి. దానికి కొద్దిగా తేనేను కలుపుకోండి. చమోమిలే పువ్వులు అందుబాటులో లేనట్లయితే, మీరు చమోమిలే టీ బ్యాగులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు

6. లికోరైస్ టీ

6. లికోరైస్ టీ

ఇందులో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ½ టీ స్పూన్ లికోరైస్ టీ పొడి, చేమంతి పువ్వుల టీ పొడిని మిక్స్ చేయండి. ఒక లవంగం, కొంచె దాల్చినచెక్కపొడి తీసుకోండి. వీటన్నింటిన ఒక కప్పు వేడి నీటిలో కలపండి. కొన్ని నిమిషాల తర్వాత దాన్ని తాగండి. రోజుకు కనీసం 2 కప్పుల లికోరైస్ టీ తాగండి.

7. ఉప్పు నీరు

7. ఉప్పు నీరు

మెడ లేదా గొంతులో లింప్ నోడ్స్ వాపును తగ్గించడానికి ఉప్పు నీరు బాగా ఉపయోగపడుతుంది. 1/2 టీ స్పూన్ ఉప్పు తీసుకోండి. దాన్ని ఒక కప్పు వేడి నీటిలో కలుపుకోండి. దాన్ని నోట్లో పోసుకుని పుక్కలించి ఉమ్మి వేయండి. రోజూ వీలైనన్నీ సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వారం రోజులు వరుసగా ఇలాగే చేయండి. దీంతో లింప్ నోడ్స్ వాపు తగ్గుతాయి.

8. ఆపిల్ సైడర్ వెనిగర్

8. ఆపిల్ సైడర్ వెనిగర్

లింప్ నోడ్స్ వాపు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పని చేస్తుంది. ఒక గ్లాస్ వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను (ఒక టేబుల్ స్పూన్) కలపండి. ఈ ద్రావణంలో ఒక తడిగుడ్డను ముంచి దాన్ని 5 నిముషాల పాటు వాపు ప్రాంతాల్లో ఉంచండి. ఆ తరువాత నీటితో శుభ్రం చేయండి. ఇలా రోజుకు ఒకటి లేదా రెండుసార్లు చేయండి. అలాగే ఒక గ్లాసు వెచ్చని నీటిలో ఆపిల్ వెనీగర్ ఒక టేబుల్ స్పూన్ కలపండి. అందులో కొద్దిగా తేనే కలపండి. దీన్ని ఉదయం రెండుసార్లు, నిద్రపోయే ముందు తాగండి. అదే విధంగా ఒక గ్లాసు ఫిల్టర్ నీటిలో ఆపిల్ సైడర్ వినెగార్ (ఒక టేబుల్ స్పూన్) కలపాలి. మీరు అల్పాహారం తీసుకునే ముందు దీన్ని తీసుకోండి.

9. మసాజ్

9. మసాజ్

మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది లింప్ నోడ్స్ వాపును కూడా తగ్గిస్తుంది. వాపు ఉన్న ప్రాంతంలో సున్నితంగా మసాజ్ చేస్తే, వాపు తగ్గుతుంది. మసాజ్ వల్ల నోడ్స్ నుంచి మలినాలను తొలగించవచ్చు. 5 నిముషాల పాటు మీ వేళ్లతో సున్నితంగా లింప్ నోడ్స్ వాపు ఉన్న ప్రదేశంలో మసాజ్ చెయ్యాలి. దీని వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఎలాపడితే అలా మసాజ్ చేసుకోకండి. ఇందులో నిపుణులను లేదా డాక్టర్ని సంప్రదించిన తర్వాత ఆ మేరకుమసాజ్ చేసుకోవాలి.

10. క్లీవర్స్

10. క్లీవర్స్

వీటిని స్టికీ కలుపు గూస్ గ్రాస్స్ అని కూడా పిలుస్తారు. ఒక కప్పు వేడి నీటిలో 2 టీస్పూన్ల క్వీవర్స్ ను కలపండి. 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత దాన్ని తాగండి. రోజుకు రెండు లేదా మూడు సార్లు ఈ టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో క్లీవర్స్ నుంచి తీసిన మిశ్రమాన్ని 20 నుంచి 30 చుక్కలు కలపండి. దీన్ని కూడా రోజూ తీసుకోవొచ్చు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు దీన్ని తీసుకోకపోవడం మంచిది. దీన్ని తీసకోవాలనుకుంటే మీరు కచ్చితంగా మొదట వైద్యుడిని సంప్రదించాలి.

11. కాస్టర్ ఆయిల్

11. కాస్టర్ ఆయిల్

లింప్ నోడ్స్ వాపు సమస్య పరిష్కారానికి కాస్టర్ ఆయిల్ బాగా పని చేస్తుంది. ఈ నూనె మలినాలను సులభంగా బయటకు పంపగలదు. వారానికోసారి కాస్టర్ నూనెను ఉపయోగించాలి. దీంతో క్రమంగా వాపు తగ్గిపోతుంది. ముందుగా కాస్టర్ ఆయిల్, ఒక గుడ్డ, వేడి నీరు సిద్ధం చేసుకోండి. 5 నిమిషాల పాటు వాపు ఉన్న ప్రాంతాల్లో ఆముదాన్ని రాయండి. తర్వాత వేడి నీటిలో ఒక గుగుడ్డను ముంచి దాన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు వాపు ప్రాంతాల్లో ఉంచండి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తూ ఉండండి.

12. లావెండర్, టీ ట్రీ ఆయిల్

12. లావెండర్, టీ ట్రీ ఆయిల్

ఆ రెండింటిలో యాంటీ బాక్టీరియల్, యాంటిస్పోస్మోడిక్, క్రిమినాశక, యాంటీమైక్రోబియాల్ లక్షణాలుంటాయి. లావెండర్, టీ ట్రీ నూనె, ఒక చిన్న గిన్నె నిండా వేడి నీరు, ఒక టవల్ తీసుకోండి. గిన్నెలో తీసుకున్న నీటిలో కొన్ని చుక్కల లావెండర్, టీ ట్రీ నూనెను కలపండి. ఆ ఆవిరిని పీల్చుకోండి. అయితే ఈ సమంయలో మీరు ఆవిరి బయటకు పోకుండా టవల్ ని ఉపయోగించండి. 15 నుంచి 20 నిమిషాలు ఈ ఆవిరిని పీల్చండి.

13. నిమ్మకాయ

13. నిమ్మకాయ

నిమ్మకాయలో అనేక ఆరోగ్య గుణాలున్నాయి. ఇందులో ఎన్నో ఔషధ ప్రయోజనాలున్నాయి. ఇది మీ లింప్ నోడ్స్ తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది.

ఒక గ్లాస్ వేడి నీటిలో కాస్త తేనె, కొద్దిగా నిమ్మ రసం (ఒక టీ స్పూన్ ) కలపండి. దాన్ని ఉదయం, నిద్రపోయే ముందు తాగండి. అలాగే ఒక గ్లాస్ వేడి నీటిలో కాసత్ నిమ్మరసం మిక్స్ చేయండి. దాన్ని పుక్కలించి ఉమ్మివేయండి.

14. క్యేనీ పెప్పర్

14. క్యేనీ పెప్పర్

క్యేనీ పెప్పర్ లింప్ నోడ్స్ వాపు సమస్య పరిష్కారినికి బాగా పని చేస్తుంది. ఒక గ్లాస్ వేడి నీటిలో 1/2 టేబుల్ స్పూన్ క్యేనీ పెప్పర్ పొడిని కలపండి. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ తేనే కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు కప్పుల చొప్పున తాగండి.

15. స్పిరిలినా

15. స్పిరిలినా

స్పిరిలినా కూడా ఈ సమస్య పరిష్కారానికి బాగా పని చేస్తుంది. ఇందులో అనామ్లజనకాలు, బి విటమిన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యానికి అవసరమైన ఇతర పోషకాలుంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు లింప్ నోడ్స్ వాపు తగ్గేందుకు బాగా పని చేస్తాయి. మీకు మార్కెట్ లో ఇది ఈజీగా లభిస్తుంది. తర్వాత దాన్ని స్మూతీగా తయారు చేసుకోవొచ్చు. దీన్ని రోజూ తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

16. గిన్సెంగ్

16. గిన్సెంగ్

చైనీస్ గిన్సెంగ్ లేదా పానాక్స్ గిన్సెంగ్ లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ-ఫెటీగ్, యాంటీ-డయాబెటిక్, యాంటి-స్ట్రెస్, నొప్పి నివారణకు బాగా పని చేస్తుంది. గిన్సెంగ్ పొడి రూపంలో లేదా ఒక సిరప్ రూపంలో ఉంటుది. డాక్టర్లని సంప్రదించి దీన్ని తీసుకోవాలి.

17. ముల్లీన్ ఆకులు

17. ముల్లీన్ ఆకులు

ముల్లీన్ ఆకులు వివిధ రోగాల నివారణకు బాగా పని చేస్తాయి. చాలా కోరింత దగ్గు, బ్రోన్కైటిస్, క్షయవ్యాధి, న్యుమోనియా, జలుబు, జ్వరం, ఫ్లూ, గొంతుకు సంబంధించిన వ్యాధుల నివారణకు బాగా పని చేస్తుంది. లింప్ నోడ్స్ వాపు సమస్య నుంచి కాపాడుతుంది. ముల్లిన్ ఆకులు కట్ చేయండి. వాటిని ఒక జార్ లో వేసుకోండి. జార్ లో బాగా మరిగిన ఒక కప్పు నీరు పోయండి. తర్వాత కొద్ది సేపు ఉంచండి. అది చల్లగా అయిన తర్వాత తాగండి. రోజుకు మూడు కప్పుల వరకు తాగొచ్చు.

18. పసుపు

18. పసుపు

పసుపు సర్వసాధారణంగా లభించే సుగుంధ ద్రవ్యం. పసుపులో ప్రోటీన్, ఆహార సంబంధిత పీచు, విటమన్ ఇ, నియాసిన్, విటమన్ సి, పొటాషియం, రాగి, ఇనుము, కాల్షియం, మాగ్నీషియం మరియు జింక్ వంటి పలు ఆరోగ్యవంతమైన పోషకాలను కూడా లభిస్తాయి. పసుపులోని లిపోపాలీసాచారైడ్స్ వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్ గుణాలుంటాయి. ఒక స్పూన్ పసుపు, తేనే రెండింటిని కలిసి మిశ్రమం తయారు చేసుకోండి. వాపు ప్రాంతాల్లో ఈ పేస్ట్ పూయండి. 10 నిమిషాల తర్వాత, గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

19. పిప్పరమెంట్ ఆయిల్

19. పిప్పరమెంట్ ఆయిల్

ఇది లింప్ నోడ్స్ వాపును తగ్గించేందుకు పని చేస్తుంది. పుదీనా ఆకుల నుంచి తీసిన రసంలో కాస్త పిప్పర్ మెంట్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని తాగండి . మంచి ఫలితాలుంటాయి.

20. బేకింగ్ సోడా

20. బేకింగ్ సోడా

తినే సోడా లేదా బేకింగ్ సోడా సహజసిద్దమైన ఇంట్లో ఉండే ఔషదం. దీని ద్వారా కూడా మీరు ఈజీగా వాపును తగ్గించుకోవొచ్చు. దీన్ని నీటిలో కలుపుకుని పుక్కలించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.

21. జాజికాయ

21. జాజికాయ

జాజికాయను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. ఇది ఎక్కువ సువాసన కలిగి ఉంటుంది. అలాగే జాజికాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. జాజికాయ రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆర్టిపిక్ట్రియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక స్పూన్ జాజికాయ పొడిని తీసుకోండి. ఒక కప్పు వేడి నీటి తీసుకోండి. అలాగే కొంచెం తేనెను తీసుకోండి. ఒక కప్పు వేడి నీటిలో జాజికాయ పొడిని కలుపుకోండి. రుచి కోసం కాస్త తేనేను కలుపుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తాగితే లింప్ నోడ్స్ వాపు సమస్య తగ్గుతుంది.

22. ఉల్లిపాయ

22. ఉల్లిపాయ

ఉల్లిపాయ వాపును తగ్గించేందుకు బాగా పని చేస్తుంది. ఒక ఉల్లిపాయ తీసుకుని బాగా తురిమి దాన్ని రసాన్ని సిద్ధం చేసుకోండి. ఇక మీరు దీన్ని నేరుగా తీసుకునే పరిస్థితి ఉండకపోవొచ్చు. అందువల్ల సల్లాడ్లకు కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

23. విటమిన్ - ఈ

23. విటమిన్ - ఈ

చర్మ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఇది బాగా పని చేస్తుంది. అలాగే లింప్ నోడ్స్ వాపును తగ్గించేందుకు కూడా విటమిన్ ఈ పని చేస్తుంది. అందువల్ల, మీరు రోజూ తీసుకునే ఆహారంలో గోధుమ, వేరుశెనగ, సోయాబీన్ నూనె, బాదం మొదలైనవి ఉండేటట్లు చూసుకోవాలి. వీటిలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. మీలో విటమిన్ ఈ తక్కువగా ఉన్నట్లయితే వెంటనే వీటిని తీసుకుంటూ ఉండండి. లింప్ నోడ్స్ వాపు సమస్యకు విటమిన్ ఈ కారణమో లేదో డాక్టర్ని అడిగి తెలుసుకోండి. తర్వాత వైద్యుడి సూచనలు మీరు విటమిన్ ఈ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోండి.

24. పుచ్చకాయ (వాటర్ మిలాన్)

24. పుచ్చకాయ (వాటర్ మిలాన్)

పుచ్చకాయను కూడా లింప్ నోడ్స్ వాపును తగ్గిస్తుంది. మీరు తరచూ దీన్ని తింటూ ఉండాలి. దీంతో మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ పుచ్చకాయ తినడం లేదా పుచ్చకాయ జ్యూస్ తాగడంలాంటివి చేయాలి. దీని ద్వారా మీరు వాపు బారి నుంచి ఉపశమనం పొందొచ్చు.

25. ఎచినాసియా

25. ఎచినాసియా

ఇది మెడ, గొంతులో లింప్ నోడ్స్ వాపు తగ్గేందుకు బాగా పని చేస్తుంది. యాంటిమైక్రోబయాల్ గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇది లింప్ నోడ్స్ లోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎక్కడైతే వాపు ఉంటుందో ఆ ప్రాంతంలో ఎచినాసియా క్రీమ్ ను అప్లై చేయండి. రోజుకు రెండు లేదా మూడు సార్లు ఇలా చేయాలి. అలాగే

ఎచినాసియా టీ ని రోజూ రెండు కప్పులు ప్రకారం తీసుకోవొచ్చు. ఎచినాసియా మందుల్ని (300 mg)ప్రకారం తీసుకోవాలి. అయితే ఈ విషయంలో మీరు డాక్టర్ని సంప్రదించి సూచనలు తీసుకోవాలి.

26. కొబ్బరి నూనె

26. కొబ్బరి నూనె

కొబ్బరి నూనె కూడా ఇందుకు అద్భుతంగా పని చేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటివైరల్ గుణాలుంటాయి. మీకు ఎక్కడైతే వాపు వచ్చిందో ఆ ప్రాంతాన్ని కొబ్బరినూనెతో సున్నితంంగా మసాజ్ చేయండి. రోజూ ఇలా వాపు ఉన్న ప్రాంతంలో మర్ధన చేయండం వల్ల మీరు వెంటనే ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది.

27. కలబంద

27. కలబంద

కలబందలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది వాపు, నొప్పిని తగ్గించగలదు. ముందుగా కలబంద నుంచి గుజ్జు తీసుకోండి. దాన్ని వాపు ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయండి. మీరు జెల్ పూసిన ప్రాంతంపై వీలైతే ఒక చిన్నగుడ్డ ముక్కను ఉంచండి. ఇలా 20 నుంచి 30 నిముషాలు వరకు ఉంచండి. తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేయండి. వాపు తగ్గుముఖం పడుతుంది.

28. పుదీనా

28. పుదీనా

కనుగొన్న మెంథోల్ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. మీరు వాపు శోషరస కణుపులకు నివారణలలో ఒకటిగా పుదీనాను ఉపయోగిస్తే, వాపు శోషరస కణుపు వల్ల కలిగే నొప్పి మరియు వాపు తగ్గడం మరియు మీకు ముఖ్యమైన ఉపశమనం ఇవ్వవచ్చు. ఒక కప్పు వేడి నీటిలో ఎండిన పుదీనా ఆకుల పొడిని (రెండు స్పూన్ల పొడి) కలపండి. కొన్ని నిమిషాలు దాన్ని అలాగే ఉంచండి. తర్వాత దాన్ని తాగండి. అాగే తాజా పుదీనా ఆకుల రసాన్ని రోజుకి రెండుసార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటంది.

29. దాల్చిన చెక్క, తుల‌సి

29. దాల్చిన చెక్క, తుల‌సి

దాల్చిన చెక్క, తులసి కూడా ఈ సమస్య పరిష్కారానికి బాగా పని చేస్తాయి. ఒకకప్పు టీలో కొన్ని తులసి ఆకులు వేసుకోండి. అలాగే తేనె కూడా కలుపుకోండి. ఇక దీన్ని తాగడం వల్ల మంచి ప్రయోజనాలుంటాయి. అలాగే దాల్చిన చెక్క కూడా లింప్ నోడ్స్ వాపును తగ్గించేందుకు బాగా పని చేస్తుంది. వేడినీటిలో దాల్చిన చెక్క పొడి కలుపుకోండి. దీన్ని పుక్కిలించి ఉమ్మివేయండి. అలాగే కాస్త వేడి ఉప్పునీటిలో కూడా దాల్చిన చెక్క పొడిని కలుపుకుని మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవొచ్చు. దీన్ని కూడా పుక్కిలించి ఉమ్మి వేయొచ్చు. ఊపిరితిత్తుల గ్రంధులను మెరుగుపర్చడానికి సహాయపడే ఒక మూలికా పరిష్కారం కోసం కల్లెండులా, ముల్లీన్ మరియు క్లేవర్స్లను కలపడానికి ఇది ఒక గొప్ప ఆలోచన. కలేన్ద్యులా యొక్క శోథ నిరోధక లక్షణాలు అది వాపు గ్రంథుల నివారణలలో ఒకటిగా మారుతుంది.

30. బంతిపువ్వు

30. బంతిపువ్వు

బంతిపువ్వు , ములెన్, క్లీవర్స్ ఈ మూడినింటిని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో కలపండి. తర్వాత ముప్పై నిమిషాల పాటు తక్కువ మంటపై కాస్త వేడిగా చేయండి. అది ఒక ద్రవంగా ఏర్పడుతుంది. అది చల్లగయ్యేంత వరకు ఉండండి. దీన్ని రోజూ మూడు కప్పుల వరకు తీసుకోవొచ్చు.

31. ఆవాలు

31. ఆవాలు

ఆవాలు వాపు తగ్గించడంలో బాగా పని చేస్తాయి. కొంత ఆవాల నూనె తీసుకోండి. దాన్ని వాపు ఉన్న చోట పూయండి. ఇలా రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితాలుంటాయి. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఆవాల గింజలను కలపండి. ఆ నీటితో స్నానం చేయండి. మంచి ఫలితాలు పొందుతారు.

32. క్యాబేజీ

32. క్యాబేజీ

ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఇది ఒకటి. ఇదులో మంచి పోషకాలు, విటమిన్లు, ఫైబర్ ఉంటాయి. అంతేకాకుండా ఇది వాపును తగ్గించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఒక గుడ్డలో కొన్ని క్యాబేజీ ఆకులు ఉంచండి. తర్వాత గుడ్డను చుట్టి ఒక ముద్దలాగా తయారు చేసి వాపు ఉన్న ప్రాంతంలో మసాజ్ లాగా చేసుకోండి. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

33. వేప ఆకులు

33. వేప ఆకులు

వేప ఆకులు వాపును తగ్గించడంలో బాగా తోడ్పడుతాయి. వేప ఆకుల నుంచి రసాన్ని తీసి దాన్ని వాపు ఉన్నప్రాంతంలో పూయండి. తర్వాత 30 నిమిషాలు పాటు అలాగే ఉంచండి. అనంతరం దాన్ని కడిగేయండి. ఈ విధానం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది.

34. బ్లాక్ పెప్పర్

34. బ్లాక్ పెప్పర్

బ్లాక్ పెప్పర్ లేదా నల్ల మిరియాలు వాపును తగ్గిచేందుకు బాగా ఉపయోగపడతాయి. ఒక ఐదు నల్లమిరియాలను బాగా నూరండి. ఆ పొడిని కొద్దిగా తేనె (ఒక టీస్పూన్)లో కలపండి. ఆ మిశ్రమాన్ని తాగండి. ఇలా రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

35. సేజ్

35. సేజ్

సేజ్ యాంటివైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రెండు కప్పుల నీరు తీసుకోండి. అందులో సేజ్ ఆకులు వేయండి. తర్వాత కొద్దిగా తేనె, వెనిగర్ కలుపుకోండి. ఆ మిశ్రమాన్ని తాగండి.

36. పుక్కలించడం

36. పుక్కలించడం

నీటిని బాగా పుక్కలించి ఉమ్మి వేయడం అనే ప్రక్రియ కూడా గొంతులోని లింప్ నోడ్స్ వాపును తగ్గిస్తుంది. మీరు గ్లాస్ వేడి నీటిలో కాస్త ఉప్పు నీటిని కలుపుకోండి. దీన్ని నోట్లో పోసుకుని మింగకుండా గొంతుకు తగిలేవిధంగా చేయండి. తర్వాత బాగా పుక్కిలించి ఉమ్మి వేయండి. ఇలా ఒకరోజు రెండు మూడుసార్లు చేయండి.

37. వెచ్చని మసాజ్

37. వెచ్చని మసాజ్

వాపు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వేడినీటిలో తడిపిన గుడ్డతో వాపు ఉన్న ప్రాంతంలో సున్నితంగా మర్ధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల రక్త ప్రసరణ బాగా ఉంటుంది. దీంతో లింప్ నోడ్స్ వాపు తగ్గుతుంది. కాస్త వేడి నీటిని తీసుకోండి. అందులో టవల్ లేదే ఒక గుడ్డను ముంచండి. తర్వాత దాన్ని ముద్దలాగే చేసి వాపు ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల వాపు తగ్గిపోతుంది.

38. బొగ్గు

38. బొగ్గు

వాపు గ్రంథులచే వాపు మరియు నొప్పిని తగ్గించడంలో కర్ర బొగ్గు ఒత్తిడి ప్రభావవంతంగా ఉంటుంది. చార్కోల్ కుదించు ఉపయోగించి ఉపశమన గడ్డలను తగ్గిస్తుంది. బొగ్గు పొడిని కాస్త నీటిలో మిక్స్ చేయండి. ఈ పేస్ట్ ను మీకు వాపు ఉన్న చోట పూయండి. తర్వాత దాన్ని టవల్ తో తుడిచివేయండి. ఇలా నిత్యం చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితం పొందుతారు.

English summary

38 Home Remedies For Swollen Lymph Nodes In Neck & Throat

Here are top 38 home remedies for swollen lymph nodes in neck. It includes process like warm compress, remedies like apple cider vinegar, honey to reduce swelling of lymph nodes in neck & throat. Massaging swollen lymph nodes helps. Ginger, garlic, salt water, tea bags etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more