Latest Updates
-
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి!
మగవారు జాగ్రత్త!మీ పురుషాంగం వంకరగా ఉందా? క్యాన్సర్ వచ్చే అవకాశాలెక్కువ!
పురుషాంగం ఒక్కొక్కరికి ఒక్కోరకంగా.. పరిమాణం, ఆకారం, రంగులో తేడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే వంకరగా పురుషాంగం ఉండే మగవాళ్లు క్యాన్సర్ బారిన పడే అవకాశాలెక్కువని తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. ముఖ్యంగా వయసు మీదపైడిన వారిలో ఈ అవకాశాలెక్కువ అని తెలిసింది.
అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఉన్న బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పరిశోధకులు పైరోనిస్ అనే వ్యాధితో బాధపడే మగవాళ్లకు ముందస్తు క్యాన్సర్ పరీక్ష చేయించాలని సూచించారు. పురుషాంగం 15 డిగ్రీల కంటే ఎక్కువ వంకరగా ఉంటే దాన్ని పైరోసిస్ వ్యాధిగా గుర్తిస్తారు. దీంట్లో భాగంగా అంగంలోని మెత్తని భాగాల్లో వాపులాంటివి ఏర్పడతాయి. యూకేలో ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నట్టు వెల్లడయ్యింది.

ఇంకా ఈ పరిశోధనలో తేలిందేమిటంటే... పైరోనీస్ వ్యాధి ఉన్నవాళ్లల్లో 43శాతం మందికి ఉదర క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని, 39శాతం మందికి టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని, 19శాతం మందికి మాత్రం చర్మ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉందని తేల్చారు. పురుషాంగంతో ఎటువంటి సమస్యలు లేనివారికి ఇలా క్యాన్సర్ రావడం చాలా అరుదని పరిశోధనలో వెల్లడయ్యింది.

పైరోనిస్ వ్యాధి వల్ల పురుషాంగంలో బొడిపె మాదిరిగా ఏర్పడుతుందని లండన్ డాక్టర్ క్లిన్‌క్ వ్యవస్థాపకుడైన డాక్టర్ సేత్ రాంకిన్ అన్నారు.
డైలి స్టార్ ఆన్‌లైన్ నివేదిక ప్రకారం ఈ వ్యాధి ఉన్నవారికి అంగం స్తంభించడంలో తీవ్రమైన నొప్పి ఉంటుందని, వంకరగా పోతుంటుందని తెలిపింది.

పరిశోధకులు అంగం వంకరగా ఉండడానికి, వివిధ రకాల క్యాన్సర్ వచ్చేందుకు చాలా పోలికలున్నాయని తేల్చింది. పరిశోధకుల బృందం 9ఏళ్ల పాటు 17లక్షల మంది మగవాళ్లపై పరిశోధనలు చేశారు. వీళ్లల్లో కొందరు పైరోనిస్ వ్యాధితో, ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ తో బాధపడుతుండగా మరికొంత మంది ఆరోగ్యంగా ఉన్నారు.

ఫలితాల్లో తేలిన మరో విషయమేమిటంటే ఇది ఎక్కువగా 50ఏళ్ల వయసు దాటిన వారిని మరింత ప్రభావం చేస్తుందని. అంగంలో నొప్పి ఉంటుందని, వంకరతనం తర్వాతి దశల్లో రావొచ్చని డాక్టర్ సేత్ అన్నారు.
ఈ పరిశోధనలకు సంబంధించిన సారాన్ని అమెరికన్ సొసైటీ ఫర్ రిప్రోడక్టివ్ మెడిసిన్ అనే సంస్థ నిర్వహించిన సమావేశంలో ప్రస్తావించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
