అరచేతులు, పాదాలకు చెమట పట్టకూడదంటే ఇలా చెయ్యాలి

Subscribe to Boldsky

మనకు వేసవికాలం ప్రారంభమయ్యింది, ఈ సమయంలోనే మన పాదాలు, అరచేతులలో పట్టే చెమట కూడా విపరీతంగా ఉంటుంది. చాలా ఎక్కువ స్థాయిలో చెమట పట్టడం వల్ల చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది, వేసవికాలంలో చాలామంది అనుభవించేందుకు ఘోరమైన పరిస్థితి ఇది.

మీరున్న ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వాతావరణ ఉష్ణోగ్రత వల్ల గానీ (లేదా) ఒత్తిడి వల్ల గానీ (లేదా) మీరు అధికంగా పనిచేసే స్థాయిల వల్ల గానీ మీ అరచేతులు, పాదాలలో ఎక్కువ చెమటను కలిగి ఉంటారు. ఇది అందరికీ వర్తించే ఒక పెద్ద సమస్య.

అధికంగా చెమట పట్టడాన్ని వైద్యపరిభాషలో "హైపర్-హైడ్రోసిస్" అని పిలుస్తారు. ఈ పరిస్థితి వల్ల మీ శరీరంలో ఏ భాగమైనా ప్రభావితం కావచ్చు, కానీ ఈ చెమట అనేది అరచేతులు, పాదాలు, చంకలు, ముఖము వంటి ప్రాంతాలలో సాధారణంగా సంభవిస్తుంది.

ఈ సమస్యను సహజసిద్ధమైన ఇంటి చిట్కాల ద్వారా నివారించవచ్చు, అవేమిటో మీరు కూడ తెలుసుకోండి.

1. ఆపిల్ సైడర్ వినెగర్ :

1. ఆపిల్ సైడర్ వినెగర్ :

మీ అరచేతులు, పాదాలను పట్టిపీడించే చెమట సమస్యలకు అద్బుతమైన - ప్రభావవంతమైన గృహ చికిత్స "ఆపిల్ సైడర్ వినెగార్". ఇందులో 'రక్తస్రావ నివారిణి' లక్షణాలను కలిగి ఉండటం వల్ల మీ చర్మరంధ్రాలను బిగుతుగా చేయడం ద్వారా అధిక చెమటను నియంత్రించడానికి సహాయపడుతుంది.

1 టీస్పూన్ - ఆపిల్ సైడర్ వినెగార్ను,

1 టీస్పూన్ రోజ్ వాటర్తో బాగా కలపడం ద్వారా, ఒక మంచి పరిష్కారాన్ని సిద్ధం చేయండి. అలా తయారైన పదార్థమును మీ అరచేతులకు, పాదాలకు అప్లై చేయండి.

2. నిమ్మరసం :

2. నిమ్మరసం :

నిమ్మ అనేది, చెమటకు గురైన మీ అరచేతులకు, పాదాలకు చికిత్స చేయటానికి మరొక సులభమైన, సౌకర్యవంతమైన గృహ చికిత్సగా చెప్పవచ్చు. నిమ్మకాయ మీ అరచేతులు - పాదాలలో దాగి ఉన్న బ్యాక్టీరియాని తొలగించి, మంచి తాజా సువాసనను కలిగిస్తుంది.

ఒక కప్పు నీటిలో 1 నిమ్మకాయ రసాన్ని జోడించండి.

అందులో ఒక మంచి బట్టను ముంచి, మీ అరచేతులు - పాదాలపైన బాగా రుద్దాలి.

అలా రుద్దిన తర్వాత ఒక 20 నిముషాల పాటు అలానే వదిలివేయండి.

3. టమోటాలు :

3. టమోటాలు :

వీటిలో "రక్తస్రావ నివారిణి" లక్షణాలనే కాక,

స్వస్థత చేకూర్చే లక్షణాలను కూడా కలిగి వుండటం చేత - మీ అరచేతులు, పాదాలలో పట్టే చెమటను నియంత్రించవచ్చు. ఈ టమోటాలు మీ చర్మరంధ్రాలను ముడుచుకునేలా చేసి, చెమటను బయటకు స్రవించే నాళాలను నిరోధించడానికి బాగా సహాయం చేస్తుంది.

ఒక టమోటాను పెద్ద ముక్కగా కట్ చేసి, మీ అరచేతులు పాదాలలో బాగా రుద్దండి.

4. కార్న్-స్టార్క్ (మొక్కజొన్న పొడి) :

4. కార్న్-స్టార్క్ (మొక్కజొన్న పొడి) :

మీ చెమట సమస్యను ప్రభావవంతంగా నివారించడంలో అద్భుతంగా పనిచేసే మరొక ఇంటి చిట్కా ఈ కార్న్-స్టార్క్. ఇది ఒక సహజసిద్ధమైన "యాంటీ-పెర్స్పిరంట్" గా పనిచేస్తుంది, ఇది మీ అరచేతులు పాదాలలో దాగి ఉన్న తేమను గ్రహించడానికి సహాయపడుతుంది.

ఈ కార్న్-స్టార్క్ను మరియు బేకింగ్ సోడాలను రెండింటినీ సమానమైన మొత్తాలలో కలపండి. అలా తయారైన మిశ్రమాన్ని మీ అరచేతులు, పాదాలలో బాగా రుద్దండి.

5. బ్లాక్ టీ

5. బ్లాక్ టీ

మీరు బ్లాక్-టీ తాగటం వల్ల, మీ అరచేతులు పాదాలలో ఉత్పత్తి కాబడే చెమటను నయం చేస్తుంది. బ్లాక్-టీలో ఉండే టానిన్లు, రక్తస్రావ-నివారిణి వంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటాయి.

మీ అరచేతిలో 5 నిమిషాల పాటు, ఈ బ్లాక్-టీ బ్యాగ్లను పట్టుకోండి.

ఇలా రోజులో 3 సార్లు చేయండి.

6. టీ ట్రీ-ఆయిల్ :

6. టీ ట్రీ-ఆయిల్ :

టీ ట్రీ-ఆయిల్ అనేది మీ అరచేతులు, పాదాలలో కనపడుతున్న సమస్యకు మరొక సమర్థవంతమైన పరిష్కారం. దీనిలో ఉండే రక్తస్రావ-నివారిణి లక్షణాల కారణంగా అధికంగా చెమట పట్టడాన్ని నియంత్రిస్తుంది.

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 5 చుక్కల టీ ట్రీ-ఆయిల్ను కలపండి.

ఆ మిశ్రమంలో దూదిని ముంచి, మీ సమస్యాత్మకమైన ప్రాంతాలలో బాగా రుద్దండి.

7. సేజ్ :

7. సేజ్ :

సేజ్ అనేది మరొక సహజమైన ఇంటి నివారణ చికిత్స. ఇది చెమటను కలిగి ఉన్న అరచేతులకు, పాదాలకు చికిత్స చేయటానికి ఉపయోగిస్తారు.

ఒక కప్పు నీటిలో 3 సేజ్-టీ బ్యాగ్స్ను ఉంచండి.

వాటిని కొన్ని నిమిషాల పాటు అలానే నీటిలో నానేలా ఉంచండి.

నీరు ఎక్కువగా చెమట సమస్యలను కలిగి ఉన్న శరీర ప్రాంతాల్లో ఈ నీటిని ఉపయోగించి 20 నిమిషాల వరకూ అలాగే ఉంచండి.

ఈ పద్ధతినే రోజులో ఒక్కసారైనా ఆచరించండి.

8. మెగ్నీషియం ఉన్న ఆహారాలను తీసుకోండి :

8. మెగ్నీషియం ఉన్న ఆహారాలను తీసుకోండి :

మెగ్నీషియం లోపం వల్ల కూడా మీ అరచేతులు, పాదాలలో ఎక్కువగా చెమట పట్టడానికి దారితీస్తుంది. మెగ్నీషియంను అధికంగా కలిగి ఉండే ఆహారాలను తినడం ద్వారా, మీ శరీరంలో మెగ్నీషియంలా స్థాయిలను బాగా పెంచుకోవచ్చు.

బాదం, అవకాడొలు, అరటి, బీన్స్, జీడి, వాల్నట్ వంటి మొదలైన వాటిని తినండం వల్ల మీకు మెగ్నీషియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది.

9. రోజ్-వాటర్ :

9. రోజ్-వాటర్ :

వేసవి కాలంలో మీరు అనుభవించే చెమట సమస్యలను అధిగమించడానికి అద్భుతంగా ఉపయోగపడే సహజమైన నివారణులలో రోజ్-వాటర్ ఒకటి.

తాజా నీటిలో గులాబీ రేకులను ఉంచి 15 నిముషాల పాటు బాగా మరిగించండి.

అలా తయారైన మిశ్రమాన్ని బాగా వడకట్టి, మీ అరచేతులకు, పాదాలకు అప్లై చెయ్యండి.

10. కొబ్బరినూనె :

10. కొబ్బరినూనె :

కొబ్బరినూనె అనేది చెమటతో ఉన్న అరచేతులకు, పాదాలకు చికిత్సను అందచేసే ఒక మంచి "యాంటీ-పెర్స్పిరంట్" గుణాలను కలిగి ఉంది. ఇవి మీ అరచేతులకు, పాదాలకు స్వస్థతను చేకూర్చి తాజా పరిమళాన్ని వెదజల్లేలా చేస్తుంది.

ఈ ఆయిల్ను చిన్న మొత్తంలో తీసుకొని, మీ చేతులపై అప్లై చేయండి. ఇలా చేయడం వలన చెమటను నిలిపివేస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10-natural-home-remedies-to-treat-sweaty-palms-and-feet

    Excessive sweating in medical terms is known as hyperhidrosis. This condition can affect any part of the body, but the most common areas are the palms of the hands, soles of the feet, underarms and face. There are several natural home remedies to treat sweaty palms and feet.
    Story first published: Wednesday, March 21, 2018, 18:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more