Latest Updates
-
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.!
స్మోకింగ్ చేస్తున్నారా? మీ ఊపిరితిత్తులను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలా తెలుసా?
ఊపిరితిత్తుల్లో కాలుష్య కారకాలు చేరి అవి వ్యాధులను కలగజేస్తున్నాయి. కనుక ఎవరైనా ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఊపిరితిత్తులు, లంగ్స్, ఊపిరితిత్తుల ఆరోగ్యం.
నేటి తరుణంలో ఎక్కడ చూసినా వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగిపోతున్నది. వాహనాల నుంచి వెలువడే పొగ, పరిశ్రమలు, అడవులను ధ్వంసం చేయడం తదితర అనేక కారణాల వల్ల వాయు కాలుష్య తీవ్రత ఎక్కువవుతున్నది. దీంతో ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో సతమతం అవుతున్నారు.

శుభ్రంగా ఉంచుకోవాలి
ఊపిరితిత్తుల్లో కాలుష్య కారకాలు చేరి అవి వ్యాధులను కలగజేస్తున్నాయి. కనుక ఎవరైనా ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే కింద సూచించిన ఆహారాలను రోజూ తీసుకుంటే దాంతో ఊపిరితిత్తులను ఎఫెక్టివ్‌గా క్లీన్ చేసుకోవచ్చు. అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు.

ఆరోగ్యంగా ఉండాలంటే
ఊపిరితిత్తుల ఆరోగ్యంగా ఉండాలంటే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. ఫ్రూట్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. ఇంకా శ్వాస సమస్యల చికిత్సకు ఎంతగానో సహకరిస్తాయి.

ఆరెంజ్, దానిమ్మ
ముఖ్యంగా ఆరెంజ్ పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో సి విటమిన్ .. ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇక దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఊపిరితిత్తులలో కణితులను నివారించడంలో సహాయం చేస్తాయి. అంతేకాక అవి శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతమైన ఆహారంగా దానిమ్మ పనిచేస్తుంది.

ఉల్లిపాయలు
ఇక ఆహారంలో ప్రతిరోజూ ఉపయోగించే ఉల్లిపాయలు ఎటువంటి సందేహం లేకుండా ఘాటుగా ఉంటాయి. కానీ వాటిలో ఉండే ఆవిర్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. పొగ తాగేవారు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తప్పనిసరిగా ఉల్లిపాయలను తినాలి.

యాపిల్స్, ద్రాక్ష
అలాగే యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు E, B C ఉంటాయి. ఈ మూలకాలను అన్ని కలిసి అద్భుతమైన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పనిచేస్తాయి. ద్రాక్షపండులో ఊపిరితిత్తులలో కంతి పెరుగుదలను బంధించి వేసే నరింగిన్ అనే కీలకమైన ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ద్రాక్ష పండ్లు అనేవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

క్యారెట్ జ్యూస్
రోజూ ఉదయాన్నే పరగడుపునే 300 ఎంఎల్ మోతాదులో క్యారెట్ జ్యూస్ తాగితే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. వాటిల్లో ఉండే చెడు పదార్థాలు తొలగిపోతాయి.

అల్లం
అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపుతాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒకటి నుంచి రెండు టీస్పూన్ల అల్లం రసం సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పుదీనా టీ
రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ అనంతరం పుదీనా టీ తాగాలి. ఇది శరీరాన్ని ఉత్తేజం చేస్తుంది. ఊపిరితిత్తులను శుభ్రం చేసే గుణాలు పుదీనా టీలో ఉంటాయి.

పైనాపిల్ జ్యూస్
రోజూ 300 ఎంఎల్ మోతాదులో పైనాపిల్ జ్యూస్‌ను తాగినా చాలు. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

నిమ్మరసం
రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.

డెయిరీ ఉత్పత్తులు
పాలు, దాని సంబంధ ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ వంటి వాటిని తీసుకోకూడదు. వీటిల్లో ఉండే పలు రకాల పదార్థాల ఊపిరితిత్తులకు హాని చేస్తాయి. వీటిని ఆహారం నుంచి తొలగించడం మంచిది.

క్యారెట్ జ్యూస్
ఉదయాన్నే పరగడుపున, మధ్యాహ్నం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.

పొటాషియం
ఆరెంజ్, అరటిపండు, చిలగడదుంపలు, క్యారెట్లు తదితర పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి.

ఆముదం
కొంత ఆముదం తీసుకుని ఉదయం, సాయంత్రం చాతిపై మర్దనా చేస్తూ రాయాలి. దీంతో ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.
పైన చెప్పిన సూచనల్లో కనీసం 4 సూచనలను 3 రోజుల పాటు పాటిస్తే చాలు, తేడా మీకే తెలుస్తుంది. అయితే ఈ సూచనలను పాటించే సమయంలో మీరు పొగ తాగకూడదు. మద్యం సేవించకూడదు. చాలా రోజుల నుంచి మీరు స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో పొగ పేరుకుపోయి ఉంటుది. కాస్త సర్వీసింగ్ చేసుకోండి.



Click it and Unblock the Notifications