Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
జీడిపప్పు లైంగిక బలహీనతను పోగొట్టి వీర్యాన్ని బాగా చిక్కగా మారుస్తుంది
జీడిపప్పులో కడుపు ఉబ్బరం కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. కాకపోతే, పరిమితంగా తీసుకుంటే ఆ సమస్య లేకపోగా, ఆకలి పెరిగి, జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. లైంగిక బలహీనత ఉన్న వారికి ఇది గొప్ప టానిక్.
వ్యాధి విముక్తికే కాదు...శరీర పోషకాల కోసం కూడా మాత్రల మీదే అధారపడటం ఈ రోజుల్లో చాలా మందికి బాగా అలవాటయ్యింది. నిజానికి సాధారణ గింజధాన్యాల్లోనే శరీరానికి కావలసిన బోల్డు పోషకాలతో పాటు, పలురకాల వ్యాధుల్ని నయం చేసే శక్తి కూడా ఉంది. అందుకొక ఉదాహరణగా జీడిపప్పును చెప్పుకోవచ్చు. జీడిపప్పులో ప్రొటీన్లు సమృద్ధి ఉంటాయి. ఈ ప్రొటీన్ చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా.

మాంసంలో కన్నా ఎక్కువ ప్రొటీన్
నిజానికి మాంసంలో కన్నా ఎక్కువ ప్రొటీన్ జీడిపప్పులో ఉంటుంది. కిడ్నీ ఆకృతిలో కనపడటమే కాదు దీనివల్ల కి డ్నీలకు కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. వీటిని ఒక పరిమితిలో తీసుకోవడమే మేలు! ఎందుకంటే, ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ముక్కునుంచి రక్తస్రావం కావడం గానీ, విరేచనాలు కావడం గానీ జరగవచ్చు. తరచూ విరేచనాల సమస్యకు గురయ్యేవారు వీటిని అసలు తినకపోవడమే శ్రేయస్కరం.

ఇలా తీసుకుంటే
జీడిపప్పును ఎండుద్రాక్షతో కలిపి తీసుకుంటే రుచికరంగా ఉండడమే కాకుండా, రక్తహీనత హరిస్తుంది. జీడిపప్పు నరాలకు పటుత్వాన్ని కలిగించడంతో పాటు, జీవశక్తిని బలోపేతం చేస్తుంది. శారీరక బలహీనతను పోగొట్టడంతో పాటు, తరచూ వాంతులు కావడాన్ని కూడా నివారిస్తుంది. గుండెకూ, కిడ్నీలకూ ఇది చక్కని టానిక్‌లా పనిచేస్తుంది.

జీడినూనెలో
జీడి నూనెలో శరీరానికి మేలు చేసే కార్డోల్, అనాకార్డిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను క్రమం తప్పకుండా లేపనంగా రాస్తే అన్ని రకాల పులిపిర్లు రాలిపోతాయి. ఇనుము సమృద్ధిగా ఉండే జీడిపప్పు రక్తంలోని హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. రక్తహీనత సమస్య ఉన్న వాళ్లు రోజూ తగినంత జీడిపప్పు తింటూ ఉండాలి.

లైంగిక బలహీనత ఉన్న వారికి
జీడిపప్పులో కడుపు ఉబ్బరం కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. కాకపోతే, పరిమితంగా తీసుకుంటే ఆ సమస్య లేకపోగా, ఆకలి పెరిగి, జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. లైంగిక బలహీనత ఉన్న వారికి ఇది గొప్ప టానిక్‌గా పనిచేస్తుంది. ఇది వీర్య కణాలను పెంచడంతో పాటు చిక్కబరుస్తుంది. జీడిపప్పును రోజూ తింటే నపుంసకత్వం కూడా తొలగిపోతుంది.

జ్ఞాపక శక్తి పెరుగుతుంది
ప్రతిరోజూ పరగడుపున కొద్దిగా జీడిపప్పు, తేనెతో తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యార్థులకూ, బుద్ధి జీవులకూ వారి మేధాఇశక్తిని పెంచే గొప్ప టానిక్‌గా పనిచేస్తుంది. మాంసంలో జీవక్రియలను దెబ్బ తీసే యూరిక్ యాసిడ్ ఉంటుంది. అయితే దానికి విరుగుడుగా జీడిపప్పు తింటే యూరిక్ యాసిడ్ తయారవడం ఆగిపోతుంది. అప్పటికే శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు ఉంటే అవి తగ్గిపోతాయి.

పునరుజ్జీవం కలిగించే శక్తి
వయసు పైబడుతున్న కొద్దీ వివిధ పరిణామాలు శరీరం మీద కనిపిస్తుంటాయి. ఆ పరిణామాల వేగాన్ని నియంత్రించడంలో రెబోఫ్లేబిన్ సమర్థంగా పనిచేస్తుంది. అయితే, జీడిపప్పులో ఉండే రెబోఫ్లేవిన్‌కి వార్ధక్య లక్షణాలను అడ్డుకొనే శక్తితో పాటు శరీరానికి పునరుజ్జీవం కలిగించే శక్తి అపారంగా ఉంది.

బొల్లివ్యాధిని తగ్గించడంలో...
బొల్లివ్యాధిని తగ్గించడంలో కూడా జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది. ఈ వ్యాధి ఉన్నవారు రోజూ తగినంత జీడిపప్పు తింటూ, జీడినూనెను ఆ మచ్చల మీద రాస్తే మచ్చలు పోయి చర్మం సహజ వర్ణాన్ని సంతరించుకుంటుంది. బొల్లితో పాటు, కార్న్స్, రింగ్‌వామ్, షింగిల్స్, ఎగ్జిమా, పులిపిర్ల వంటి అనేక చర్మ సమస్యలను ఇది త గ్గిస్తుంది.

మలబద్దకం ఉండదు
రోజూ తగినంత జీడిపప్పును ఎండుద్రాక్షతో తీసుకుంటే మలబద్ధకం సమస్య ఉండదు. రోజూ తగినంత జీడిపప్పు తింటే, అధిక రక్తపోటు సమస్య అదుపులోకి రావడంతో పాటు రక్తపోటు సాధారణ స్థాయికి వచ్చేస్తుంది.

కొవ్వు పదార్థం
జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది. మానవ శరీరానికి రోజుకు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నిషియం అవసరం అవుతుంది. జీడిపప్పులో 29 శాతం మెగ్నిషియం ఉంటుంది. ఇది ఎముకలకు, కండరాలకు పటుత్వం కలిగించడంతో పాటు కీళ్ల నొప్పులను అరికడుతుంది.

సోడియం తక్కువగా ఉంటుంది
జీడిపప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాజు ద్వారా ఒంట్లోకి చేరిన పొటాషియం రక్తప్రసరణపై అనుకూలమైన ప్రభావం చూపుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

క్యాన్సర్‌ను ఎదిరించే స్వభావం
క్యాన్సర్‌ను ఎదిరించే స్వభావం కూడా జీడిపప్పులో ఉంది. వీటిలో ఉండే సిలీనియమ్, విటమిన్-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్ ఆక్సిడేషన్‌కు విరుగుడుగా పనిచేస్తాయి. క్యాన్సర్ రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీడిపప్పులో లభించే జింక్.. ఇన్‌ఫెక్షన్లపై పోరాడుతుంది.

మెదడు చురుకుగా ఉండటంలో
జీడిపప్పులో కాపర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఎంజైమ్‌ల పనితీరులో కీలకంగా వ్యవహరిస్తుంది. మెదడు చురుకుగా ఉండటంలోనూ సాయపడుతుంది. హార్మోన్ల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేయటంతోపాటు.. అనీమియా వ్యాధి రాకుండా ప్రివెన్షన్ మెడిసిన్‌గా
పని చేస్తుంది.

మితంగా తీసుకోవాలి
జీడిపప్పు మేలు చేస్తుందని అదేపనిగా తినేయకండి. రోజులో 4 నుంచి 8 కాజులు, అదీ ఒకేసారిగా కాకుండా నాలుగైదుసార్లు తినడం వల్ల మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది. స్వీట్ల రూపంలో కూడా కాజూను తీసుకోవచ్చు. అయితే అది కూడా మితంగానే.



Click it and Unblock the Notifications