For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు రెండుమూడు యాలకులు తిన్నా చాలు మగతనం మళ్లీ వస్తుంది

గవారు శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలు పెంచుతాయి.

|

యాలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యము. పురాతన కాలం నుంచి సుగంధ ద్రవ్యంగా యాలకులు ప్రాచుర్యంలో వున్నాయి. యాలకులను సుగంధద్రవ్యాల రాణిగా కూడా పేరుంది. వీటిని బ్రిటీష్ వారు పెద్ద ఎత్తున వ్యవసాయ పంటగా పండించేవారట.
యాలకుల శాస్త్రీయనామం ఇలటేరియా కార్డిమమ్‌. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో యాలకులదే ప్రథమ స్థానం అనటంలో ఎటువంటి సందేహం లేదు.

ఇది సిటామినేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది సాధారణ మొక్కలకి భిన్నంగా రసాయ నాలు, మనసుకి ఉల్లాసాన్ని కలిగించే తైలంతో చాలా విల క్షణంగా ఉండే ఔషధ మొక్క ఇలద్వయం. వీటిలో చిన్న యాలకులు, పెద్ద యాలకులు, తెల్ల యాలకులుగా, పచ్చ యాలకులుగా కూడా లభిస్తుంటాయి. ఇవి ఏ రంగులో వున్నా, ఏ సైజ్ లో వున్నా ఒకే విధమైన ఔషధగుణాలు కలిగివుంటాయి.

మౌత్ ఫ్రెష్

మౌత్ ఫ్రెష్

యాలకులను ఇంట్లో మసాలా దినుసులు గాను, మౌత్ ప్రెష్ నర్ గా వాడుతుంటారు. టీ తయారీలో యాలకులను ఉపయోగిస్తుంటారు. రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. యాలకులు కఫ్ఫం, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులతో పాటు కడుపులో మంటను నివారిస్తుందట.

మానసికి ఒత్తిడి నివారణకు

మానసికి ఒత్తిడి నివారణకు

హృదయ ఆరోగ్యానికి సహకరించడంతో పాటు మానసిక ఒత్తిడిని నియంత్రిస్తాయిట. మూత్రపిండాల్లో రాళ్ళను కరిగిస్తాయి. ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలకులను తీసుకోవడం ఉత్తమం. పొట్ట పెరిగిపోయి ఇబ్బందిగా తయారైనప్పుడు యాలకుల వైద్యం దానికి చక్కని పరిష్కారమార్గం.

ఫైబర్, కాల్షియం

ఫైబర్, కాల్షియం

ఇందుకోసం పడుకునే ముందు రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళు తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి దోహపడతాయి. అలాగే యాలకులలోని ఫైబర్, కాల్షియంలు శరీర బరువును నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నాయి.

నోటి దుర్వాసన పోతుంది

నోటి దుర్వాసన పోతుంది

భోజనం చేసిన వెంటనే ఒకటి రెండు యాలకులను నములుతూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది. జీర్ణ సమస్యలు వుండవు. ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో యాలకులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజుకు మూడు, నాలుగు సార్లు కొన్ని యాలకులను తీసుకుని బాగా నమిలి చప్పరిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాలకులను రోజూ తింటుంటే గుండె సమస్యలు పోతాయి.

అజీర్ణ సమస్య పోతుంది

అజీర్ణ సమస్య పోతుంది

యాలకుల ద్వారా రక్త సరఫరా మెరుగు పడుతుంది. రెండు, మూడు యాలకులు, లవంగాలు, చిన్న అల్లం ముక్క, ధనియాలను తీసుకుని పొడి చేయాలి. దీన్ని ఒక గ్లాసు వేడి నీటిలో కలుపుకుని తాగితే అజీర్ణ సమస్య పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

జీర్ణ సంబంధ సమస్యలు దూరం

జీర్ణ సంబంధ సమస్యలు దూరం

తీపి పదార్థాలకు రుచినీ, సువాసననూ ఇచ్చే యాలకులు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలున్నప్పుడు యాలకుల్ని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూడాలి. ఇవి అల్లంలా పనిచేసి, ఆ సమస్యలన్నీ తగ్గిస్తాయి. వికారం, కడుపుబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వీటి వాడకం మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు.

వ్యర్థాలను తొలగించడంలో

వ్యర్థాలను తొలగించడంలో

శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో దీన్ని మించిన సుగంధ దినుసులు లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. నోటి దుర్వాసనను తగ్గించడమే కాదు...నోట్లో అల్సర్లూ, ఇన్‌ఫెక్షన్ల లాంటివి ఉన్నప్పుడు రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే ఆ సమస్యలు తగ్గిపోతాయి. యూలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. జలుబూ, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడూ యాలకులు ఏదో ఒక రూపంలో తీసుకుంటే అవి తగ్గుతాయి.

అమోఘమైన రుచి

అమోఘమైన రుచి

లడ్డూ, పాయసం, బర్ఫీ ఎలాంటి స్వీట్‌ కైనా మంచి సువాసనను, రుచిని అందిస్తాయి యాలకులు. ఏ తీపిపదార్థానికైనా.. కాసిన్ని యాలకులు జోడిస్తేనే అమోఘమైన రుచి వస్తుంది. తీపి వంటకాల్లో సుగంధ ద్రవ్యంగా వాడే యాలకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్‌ శరీరంలోని బీపిని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్‌ రాకుండా నివారిస్తాయి. శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో వీటిని మించిన సుగంధ దినుసులు మరొకటి లేవు.

ఒత్తిడి తగ్గడానికి

ఒత్తిడి తగ్గడానికి

ఒత్తిడిని తగ్గించడంలో యాలకులు బాగా సహకరిస్తాయి. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.అలాగే శరీరానికి అవసరమయ్యే నూనెలు యాలకుల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ బారి నుంచి కాపాడటానికి ఉపయోగపడతాయి. కాబట్టి రోజూ భోజనం చేసిన తర్వాత యాలకులు తింటే చక్కటి ప్రయోజనం ఉంటుంది.

గుండె ఆరోగ్యంగా

గుండె ఆరోగ్యంగా

యాలకులు తినడం వల్ల ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ సరిగా జరిగి ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహకరిస్తాయి.

అదుపులో రక్తపోటు

అదుపులో రక్తపోటు

కమ్మని సువాసన, రుచిని అందించే యాలకుల గింజలను తరచుగా నోట్లో వేసుకోవడం వల్ల మద్యపానం, దూమపానానికి దూరంగా ఉండవచ్చు. రోజూ తినడం అలవాటు చేసుకుంటే చెడు అలవాట్లను పక్కన పెట్టవచ్చు.యాలకుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. బీపీ ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటూ ఉండాలి.

దగ్గు, ఆస్తమాకు నివారణ

దగ్గు, ఆస్తమాకు నివారణ

రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇలా చేస్తే కఫ్ఫం, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులతో పాటు కడుపులో మంట తగ్గుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలకులను తీసుకోవడం ఉత్తమం. పొట్ట పెరిగిపోయి ఇబ్బందిగా తయారైనప్పుడు యాలకుల వైద్యం దానికి చక్కని పరిష్కారమార్గం.

అదనపు కొవ్వును కరిగించడానికి

అదనపు కొవ్వును కరిగించడానికి

పడుకునే ముందు రెండు యాలకులు తిని ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్ళు తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి దోహపడతాయి. అలాగే యాలకులలోని ఫైబర్, కాల్షియంలు శరీర బరువును నియంత్రిస్తాయి.

నపుంసకత్వాన్ని కూడా తగ్గిస్తాయి

నపుంసకత్వాన్ని కూడా తగ్గిస్తాయి

యాలకుల్లో ఉండే సినియోల్ అనే పదార్థం పురుషుల్లో ఉత్తేజాన్ని పెంచుతుంది. దీంతో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. తద్వారా ఇవి నపుంసకత్వాన్ని కూడా తగ్గిస్తాయి. రోజూ రెండు మూడు యాలకులు తిన్నా కూడా పోయిన మగతనం మళ్లీ వచ్చే అవకాశం ఉందట.

శృంగార సామర్థ్యం పెరగాలంటే

శృంగార సామర్థ్యం పెరగాలంటే

ఇక మగవారు శృంగార సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. సంతాన సాఫల్యత అవకాశాలు పెంచుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ యాలకులను తినాలి. దీంతో రక్తం పెరుగుతుంది. శరీరంలో వున్న విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి.

English summary

mind blowing facts and health benefits of cardamom or elaichi

mind blowing facts and health benefits of cardamom or elaichi
Story first published:Wednesday, May 2, 2018, 13:16 [IST]
Desktop Bottom Promotion