మీకు తెలుసా ఈ 9 సంకేతాలు మీ జీవక్రియలను నెమ్మదిగా మందగించేలా చేస్తాయని ?

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీకు తెలుసా ఈ 9 సంకేతాలు మీ జీవక్రియలను నెమ్మదిగా మందగించేలా చేస్తాయని ?

అస్పష్టమైన లక్షణాలతో మీ ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేసే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అందులో నెమ్మదిగా జీవక్రియలు మందగించడం కూడా ఒకటి.

శరీరవిధుల్లో భాగంగా జరిగే హార్మోనుల రసాయనిక ప్రక్రియల సమూహం ద్వారా జీవక్రియ అనేది నిర్వచించబడుతుంది. మరియు జీవక్రియ తగ్గిపోతున్నప్పుడు, శరీరానికి సంబంధించిన అనేక విధులు ప్రభావితమవుతాయి, తద్వారా అవాంఛనీయ లక్షణాలను కలిగిస్తాయి.

కావున ఇక్కడ మీ జీవక్రియలను మందగించే 9 నిశ్శబ్ద సంకేతాలను పొందుపరచడం జరిగినది.

1)బరువు పెరుగుట

1)బరువు పెరుగుట

అధిక బరువు మరియు ఊబకాయం అనునవి చాలామంది వ్యక్తులు ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ సమస్యలు. వయస్సు మరియు లింగభేధం లేకుండా బరువు పెరుగుట జరుగుతుంది. సాధారణంగా అనారోగ్యకరమైన అలవాట్లు మరియు వ్యాయామం లేకపోవడం, జన్యుపరమైన సమస్యల వలన ఈ ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, బరువు పెరుగుట అనునది జీవక్రియల తగ్గుదల యొక్క నిశ్శబ్ద లక్షణం కూడా కావచ్చు. జీవక్రియ తగ్గిపోతున్నప్పుడు, శరీర కొవ్వు తగ్గించే సామర్థ్యం తగ్గి, బరువు పెరగడానికి కారణమవుతుంది.

2)దీర్ఘకాలిక అలసట

2)దీర్ఘకాలిక అలసట

ఈ రోజుల్లో మీరు ఏ రకమైన అధిక శ్రమ చేయనప్పటికీ, ఎక్కువ అలసటకు గురై బాధపడుతున్నట్లయితే, మీరు దీర్ఘకాలిక అలసటతో బాధపడుతున్నారని అర్థం. ఇది నెమ్మదిగా జీవక్రియలను ప్రభావితం చేస్తుంది. జీవక్రియ రేటు నెమ్మదిగా ఉన్నప్పుడు, ఆహారాన్ని తీసుకోవడానికి అయిష్టతలను చూపడం తద్వారా శక్తిని కోల్పోవడం జరుగుతుంది. దీని వలన మీరు అలసటతో బాధపడుతుంటారు.

3) డ్రై స్కిన్

3) డ్రై స్కిన్

పొడి చర్మం అనేది అనేక వ్యాధులకు లేదా ప్రకృతి మార్పులకు సంకేతం . సోరియాసిస్, డీ హైడ్రేషన్ , మారుతున్న వాతావరణ పరిస్థితులు వంటి సమస్యల లక్షణాలుగా కూడా ఉండవచ్చు. ఒక్కోసారి ఎటువంటి వ్యాధులు లేకపోయినా కూడా చర్మం పొడిబారడం జరుగుతుంది. దీనికి కారణం జీవక్రియలు మందగించడమే. చర్మం పొడిబారడం జీవక్రియల మందగింపునకు నిశ్శబ్ద లక్షణం కూడా కావొచ్చు. ఎందుకంటే చర్మపు pH స్థాయి కూడా నెమ్మదిగా జీవక్రియ తగ్గుదల రేటుతో ప్రభావితం అవుతుంది.

4) జుట్టు రాలడం

4) జుట్టు రాలడం

సాధారణంగా, ప్రజలు దీర్ఘకాలికంగా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలకు గురవుతున్నట్లయితే దీనికి ప్రధాన కారణం వారు ఒత్తిడికి లోనవ్వడం , పోషకాహారలోపం,లేదా వంశపారంపర్యత వంటివి కావొచ్చు. అదేవిధంగా మీ జీవక్రియలు తగ్గుముఖం పట్టినప్పుడు కూడా జుట్టు యొక్క మూలాలు సరిగ్గా పోషకాలను తీసుకోలేని స్థితికి రావడం వలన , జుట్టు నెమ్మదిగా రాలడం సంభవిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా కనిపిస్తూ ఉంటే జీవక్రియలు తగ్గుముఖం పడుతున్నాయనే అర్ధం.

5) తరచుగా జలుబుకి గురవుతూ ఉంటే

5) తరచుగా జలుబుకి గురవుతూ ఉంటే

చలికాలంలో ప్రజలు వాతావరణం చల్లగా ఉండటం వలన తరచుగా ఫ్లూ లేదా ఇతర అంటువ్యాధులకు గురవ్వడం సర్వసాధారణం. అలా కాకుండా కాలానితో సంబంధం లేకుండా జలుబులు జ్వరాలు ముట్టడిస్తుంటే, మీలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నదని అర్ధం. అనగా మీ జీవక్రియలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయని అర్ధం.

6) చక్కెర కోరిక

6) చక్కెర కోరిక

మనలో చాలామందికి తీపి పదార్ద్ఘాలంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది అనారోగ్యం అని కూడా మనకు తెలుసు. కానీ అనూహ్యంగా చక్కెర పదార్ధాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు అంటే , ఖచ్చితంగా జీవక్రియలు మందగిస్తున్నాయని అర్ధం. జీవక్రియలు మందగించినప్పుడు రక్తంలో చక్కెర శాతం తగ్గడం మూలంగా డయాబెటిస్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది . కావున జిహ్వ చక్కెరను అధికంగా కోరుకుంటున్నట్లు అనిపిస్తే జాగ్రత్త తీసుకోవడం మంచిది.

7) ఏకాగ్రత నష్టం

7) ఏకాగ్రత నష్టం

పాఠశాలలలో , ఉద్యోగాలలో మరియు జీవితంలో వేసే ప్రతి అడుగులోనూ ఏకాగ్రత చాలా అవసరం. మీ మెదడును ప్రభావితం చేసే ఏదైనా ప్రధాన ఆరోగ్య సమస్య ఉంటే అది ఖచ్చితంగా ఏకాగ్రతే. ఏకాగ్రత కోల్పోవడం అనేది కూడా నెమ్మదిగా జీవక్రియ మందగించడం యొక్క లక్షణం కావచ్చు. మందగించిన జీవక్రియ సాధారణ మెదడు పనితీరులపై ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా ఏకాగ్రత స్థాయిల తగ్గుదలపై ప్రభావం పడుతుంది.

8) తలనొప్పి

8) తలనొప్పి

తలనొప్పి అనేది అతి సాధారణమైన రోగాలలో ఒకటి. చాలామంది ప్రజలు తరచుగా తలనొప్పికి గురవుతూ ఉంటారు. ఒత్తిడి నుండి మెదడు క్యాన్సర్ వరకు తలనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. మరియు నెమ్మదిగా జీవక్రియల తగ్గుదల కూడా తలనొప్పికి కారణం కావచ్చు. ఎందుకంటే జీవక్రియలు మందగించినప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి, దీని వలన తరచుగా తలనొప్పి వస్తుంది.

9) మలబద్దకం

9) మలబద్దకం

జీర్ణ సమస్యలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మొదలైన వాటి ఫలితంగా చాలామంది వ్యక్తులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య మలబద్దకం. ఈ మలబద్దకానికి కూడా జీవక్రియలు మందగించడం కారణం కావొచ్చు. జీవక్రియలు మందగించుటవలన పెద్ద పేగు పని తీరుపై ప్రభావం పడి తద్వారా మలబద్దకానికి దారితీస్తుంది.

కావున పై సంకేతాలు కనిపించిన ఎడల తక్షణమే డాక్టరుని సంప్రదించడం ద్వారా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.

English summary

Do You Have These 9 Silent Signs Of A Slow Metabolism?

Do You Have These 9 Silent Signs Of A Slow Metabolism,You may not be aware of the fact that you have a slow metabolism. But if you put on weight easily, suffer from chronic fatigue, crave sugar, and often fail to concentrate on your work, then you probably have it. Here are 9 signs of a slow metabolism.
Story first published: Friday, March 16, 2018, 8:00 [IST]