Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
Cervical Cancer Vaccine: గర్భాశయ క్యాన్సర్ కు దేశీయ టీకా.. ఇవాళ్టి నుండి అందుబాటులోకి
Cervical Cancer Vaccine: భారతదేశం తన మొదటి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్, క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ (qHPV) ను ఈరోజు అంటే సెప్టెంబర్ 1న ఆవిష్కరించనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్‌ను IIC ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ జితేంద్ర సింగ్ ప్రారంభించనున్నారు.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) జూలై 12న సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కి గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి మార్కెట్ అధికారాన్ని మంజూరు చేసింది. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ 15 మరియు 44 సంవత్సరాల మధ్య మహిళల్లో అత్యంత తరచుగా వచ్చే క్యాన్సర్లలో రెండో స్థానంలో ఉంది. భారతీయ జనాభాలో విప్లవాత్మక అడుగు ఇప్పుడు గర్భాశయ క్యాన్సర్ కేసులను నిరోధించడంలో సహాయపడుతుంది.

గర్భాశయ క్యాన్సర్ టీకా గురించి:
గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్, క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ (qHPV), సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT)చే అభివృద్ధి చేయబడింది.
qHPV టీకా CERVAVAC అన్ని టార్గెటెడ్ HPV రకాలు మరియు అన్ని మోతాదు మరియు వయస్సు వర్గాలకు వ్యతిరేకంగా బేస్‌లైన్ కంటే దాదాపు 1,000 రెట్లు అధికంగా ఉండే బలమైన యాంటీబాడీ ప్రతిస్పందనను ప్రదర్శించింది.
ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని, గర్భాశయ క్యాన్సర్ ను నివారిస్తుందని డాక్టర్ ఎన్ కె అరోరా తెలిపారు. ఎందుకంటే, 85% నుండి 90% కేసులలో, గర్భాశయ క్యాన్సర్ ఈ నిర్దిష్ట వైరస్ వల్ల వస్తుందని వివరించారు. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ కు కారణమయ్యే వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడుతుందని అన్నారు. చిన్న పిల్లలకు, యుక్త వయస్సు వారికి ఈ టీకా ఇస్తే 30 ఏళ్ల తర్వాత వారికి గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండదని డాక్టర్ ఎన్ కే అరోరా పేర్కొన్నారు.

విదేశాల నుండే భారత్ కు టీకాలు
సీరం సంస్థ రూపొందించిన ఈ వ్యాక్సిన్ చాలా సరసమైన ధరలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం, HPV వ్యాక్సిన్ కోసం భారత్ పూర్తిగా విదేశాలపై ఆధారపడింది. మూడు విదేశీ కంపెనీలు HPV వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. వీటిలో రెండు సంస్థలు తమ వ్యాక్సిన్‌లను భారతదేశంలో విక్రయిస్తున్నాయి. మార్కెట్‌లో లభించే ప్రతి డోస్ జబ్‌కు ₹4,000 కంటే ఎక్కువ ఖర్చవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. HPV టీకా చాలా తరచుగా గర్భాశయ, యోని మరియు వల్వార్ క్యాన్సర్‌లకు కారణమయ్యే HPV రకాల నుండి రక్షిస్తుంది.

గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి?
గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ప్రారంభమైనప్పుడు, దానిని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, మహిళలందరికీ గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది 30 ఏళ్లు పైబడిన మహిళల్లో చాలా తరచుగా సంభవిస్తుంది. కొన్ని రకాల హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)తో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం. గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే, చికిత్స చేసి తగ్గించవచ్చు.

గర్భాశయ క్యాన్సర్ ఎలా వస్తుంది?
సర్వైకల్ క్యాన్సర్ రకరకాల ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. తరచుగా హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. లైంగిక సంపర్కం ద్వారా పాపిల్లోమా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి శరీరం రోగి నిరోధక వ్యవస్థ పని చేస్తుంది. అయితే, అందులో ఉండే వైరస్ చివరికి నోటి కణాలను క్యాన్సర్ కణాలుగా మారుస్తుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ పాపిలోమా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది.
ఇన్ఫెక్షన్ వచ్చిందంటే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేసినా, ఎక్కువ రోజులు అలాగే ఉంచినా.. ఇన్ఫెక్షన్ తీవ్రం అవుతుంది. అది క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాన్ని ఇస్తుంది. గర్భాశయ ముఖద్వారం వద్ద ఇన్ఫెక్షన్ ను గుర్తించినట్లైతే వెంటనే చికిత్స ప్రారంభించాలి. లేదంటే చిక్కుల్లో పడటం ఖాయం.

ధూమపానం మానుకోవాలి
స్మోకింగ్ వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వచ్చినా శరీరం దానిని ఎదురించలేదు. ఇమ్యూనిటీ సిస్టంను మెరుగుపరుచుకుంటే.. చాలా వరకు హాని కారక బ్యాక్టీరియా, వైరస్ లను అదే మట్టుబెడుతుంది. అందువల్ల, మీరు ధూమపానం అలవాటు ఉంటే దానిని తగ్గించుకోవాలి.

సురక్షిత శృంగారం
సురక్షిత శృంగారం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు రావు. ఒక్కరితోనే సెక్స్ చేయడం ఉత్తమం. వేరే వారితో చేస్తుంటే కండోమ్ తప్పనిసరిగా వాడాలి. అలా వాడకపోతే మీ నుండి వారికి, వారి నుండి మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

అన్నింటి కంటే ముందు టీకా తీసుకోవాలి
గర్భాశయ క్యాన్సర్ రాకుండా టీకాలు తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ పాపిల్లోమా వైరస్(HPV) ఇన్ ఫెక్షన్లను నివారిస్తుంది. ఇది రాబోయే విపత్తు నుండి కాపాడుతుంది. అయితే గర్భాశయ క్యాన్సర్ టీకా ఎప్పుడు తీసుకోవాలి అనేది వైద్యుల సలహా తీసుకోవాలి.



Click it and Unblock the Notifications











