Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Weakened Immunity: ఈ అలవాట్ల వల్ల శరీరం పోరాడే శక్తిని కోల్పోతుంది
మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇమ్యూనిటీ దెబ్బతింటోంది. ఈ అలవాట్లు దీర్ఘకాలం పాటు చేస్తే రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని అనేక రోగాల బారిన పడి చివరికి ప్రాణాలు కోల్పోవచ్చు.
Weakened Immunity: శరీరానికి రోగనిరోధక శక్తి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న జబ్బుల నుండి క్యాన్సర్ లాంటి పెద్ద రోగాల వరకు శరీరం పోరాడాలంటే ఇమ్యూనిటీ ఎంతో ముఖ్యం. ప్రతి మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. ఇది బయటి నుండి శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాలపై, వైరస్‌లపై పోరాడుతుంది.

ఇమ్యూనిటీ మెరుగ్గా ఉన్న వ్యక్తుల్లో రోగాలు రావడం చాలా అరుదు. ఒక వేళ వచ్చినా వాటిని చాలా సులభంగా ఎదుర్కొని నిలబడతారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ ఏమిటో తెలిసి వచ్చింది. మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇమ్యూనిటీ దెబ్బతింటోంది. ఈ అలవాట్లు దీర్ఘకాలం పాటు చేస్తే రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని అనేక రోగాల బారిన పడి చివరికి ప్రాణాలు కోల్పోవచ్చు.
ఎలాంటి తప్పులు చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుందో ఇప్పుడు చూద్దాం.

1. కలుషిత ప్రాంతాలు
చుట్టూ ఉండే గాలి రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. కలుషితమైన గాలిని టి-కణాలను అణిచివేస్తుందని అనేక అధ్యయనాలు ఇప్పటికే నిరూపించాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతంగా ఉంచడానికి టి-కణాలు చాలా ముఖ్యం. కాబట్టి కలుషిత ప్రాంతాల్లో నివసించే వారు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించడం ఉత్తమం. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.

2. జంతు ప్రోటీన్లను కట్టడి చేయాలి
మనకు తినే ఆహారం నుండి ప్రోటీన్లు అందుతాయి. శాకాహారం, మాంసాహారం నుండి పోషకాలు వస్తాయి. ప్రోటీన్లు 1GF1 హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోజువారీ కేలరీల్లో 10 శాతం కంటే ఎక్కువ జంతు మూలాల నుండి రాకూడదని గుర్తుంచుకోండి. అంటే మాంసం, లేదా పాల ఉత్పత్తులను తక్కువగా తీసుకోవడం మంచిది.

3. ఒంటరితనంతో అనర్థాలు
ఒంటరితనాన్ని ఎదుర్కొనే వ్యక్తులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. రోజులో ఎక్కువ సమయం ఒంటరిగా గడిపే వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి స్నేహితులు, ప్రియమైనవారు, పొరుగు వారితో సమయం గడపడం అలవాటు చేసుకోవాలి. ఒంటరిగా నివసించే వ్యక్తులతో పోలిస్తే వారి సంబంధాల్లో సంతోషంగా ఉన్న వ్యక్తులు వ్యాధి బారిన పడే అవకాశం తక్కువ.

4. శ్రమలేని జీవితం
మీది 9 -5 ఉద్యోగమా.. రోజులో ఎక్కువ సమయంలో కూర్చొనే ఉంటారా.. శారీరక శ్రమ తక్కువా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఇలాంటి జీవనశైలి వల్ల జీవక్రియ మందగించడంతో పాటు వెన్ను నొప్పులు, మెడ నొప్పులు సహా ఇతర చాలా రకాల సమస్యలు వస్తాయి. ఎప్పుడూ కూర్చొని చేసే ఉద్యోగం అయితే గంట గంటకు సీటు నుండి పైకి లేచి ఓ 10 నిమిషాల పాటు అటూ ఇటూ నడవడం అలవాటు చేసుకోండి. అలాగే కూర్చీలో కూర్చుని చేసే వ్యాయామాలను అప్పుడప్పుడు చేస్తుండండి. లేకపోతే జీవక్రియ మందగించి అది ఇమ్యూనిటీ పవర్‌ను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications