Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
World health day 2025 wishes: ఈ అద్భుతమైన సందేశాలతో ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలనే మెసేజ్ ఇవ్వండి
జీవితంలోని ప్రతి క్షణం ఆరోగ్యం అనే పునాదిపైనే నిలుస్తుంది. ఆయుష్షు నుండి ఆనందం వరకు ప్రతిదీ ఆరోగ్యంతోనే ముడిపడి ఉంది. ఇవాళ(ఏప్రిల్ 7)వరల్డ్ హెల్త్ డే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు..ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఒక ముఖ్యమైన అవకాశం. ఈ రోజు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తమ జీవితాలను అంకితం చేసిన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు కూడా మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాల్సిన సమయం.
ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక నిర్దిష్ట అంశాన్ని ఎంచుకుంటుంది, దాని ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతుంది. ప్రజల్లో చైతన్యం నింపడానికి ఈ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025 ధీమ్.."ఆరోగ్యకరమైన ఆరంభాలు, ఆశాజనక భవిష్యత్తులు(Healthy Beginnings, Hopeful Futures)"..తల్లులు, నవజాత శిశువుల మరణాలను నివారించడానికి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు నడుం బిగించాలి. తల్లులు, బిడ్డల ఆరోగ్యం కోసం చేసే ప్రతి ప్రయత్నం ఒక ఆశాజనకమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఈ రోజే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆవిర్భవించింది. ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం అంకితమైన ఈ ప్రత్యేక ఐక్యరాజ్యసమితి సంస్థ 1950లో స్థాపించచబడింది.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025 శుభాకాంక్షలు ఇలా చెప్పండి
-ఈ రోజు మనం మన ఆరోగ్యం కోసం ఒక బలమైన నిర్ణయం తీసుకుందాం. ఆరోగ్యకరమైన అలవాట్లతో, దృఢ సంకల్పంతో శక్తివంతమైన జీవితాన్ని గడుపుదాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు!
-ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ వేళ మీ ప్రతి చిన్న అడుగు ఒక పెద్ద ఆరోగ్యకరమైన మార్పుకు దారి తీయాలని కోరుకుంటున్నాను. మీకు మంచి ఆరోగ్యం, ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను.
-ఆరోగ్యమే నిజమైన సంపద. మీరూ మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
-ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు! మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మీ శరీరం బలంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఎల్లప్పుడూ వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
-ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. మనల్ని మనం ప్రేమగా చూసుకుందాం. ఒకరికొకరు తోడుగా ఉందాం. సంపూర్ణ ఆరోగ్యానికి మనమంతా జై కొడదాం.
-ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మీ హృదయంలో ఆనందపు కాంతిని నింపాలి. మీకు మంచి ఆరోగ్యం, అంతులేని సంతోషం కలగాలని కోరుకుంటున్నాను.
-మంచి ఆరోగ్యం లేకుండా ప్రపంచంలోని అన్ని సుఖాలు వ్యర్థమైనవి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు
-తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్లు ఎప్పుడూ కలత చెందరు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు
-ముందుగా మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మిగతా పనులన్నీ చేయండి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు
-జీవితం చాలా విలువైనది,ఇందులో ఆరోగ్యం అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు
-సంతోషమైన జీవితానికి ఆరోగ్యమే మూలం. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మీకు బలమైన ఆరోగ్యం, ఆనందంతో నిండిన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను.
-ఈ ప్రత్యేకమైన రోజున మీకు నా హృదయపూర్వక ఆరోగ్య శుభాకాంక్షలు. మీ జీవితం నిండు నవ్వులతో, స్వచ్ఛమైన గాలితో నిండి ఉండాలి. ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.
-ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మీకు చెడు అలవాట్లను వదిలించుకునే ధైర్యాన్ని ఇవ్వాలి. ఉన్నతంగా ఎదిగేలా చేసే జీవనశైలిని మీరు ఎంచుకోవాలి.
-ఈ ప్రత్యేకమైన రోజున మీ ఆరోగ్యానికి మరోసారి నమస్కరిద్దాం. జీవితాంతం అది మీకు తోడుగా ఉండాలి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications