World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.!

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. మన రోజువారీ జీవితం సాఫీగా సాగాలంటే ఈ ఇంజిన్‌ ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా నడవాల్సిందే. ఒక్కసారి రిపేర్‌కి వచ్చిందంటే ఇక జీవితాంతం షెడ్డుకి పంపాల్సి వస్తుంది. అయితే సమస్య వచ్చినప్పుడే 'గుండె’ గురించి ఆందోళన చెందుతాం. ఈ రోజు వరల్డ్ హార్ట్‌ డే. ఈ సందర్భంగా మన శరీరంలోని ఇంజిన్‌ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా కాపాడుకోవాలి వైద్యుల సలహాలు తెలుసుకుందాం..

World heart day Follow these eight principles for heart health

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె పోటుకి గురవుతున్నారు. కొందరు హార్ట్‌ స్ట్రోక్‌ నుంచి తప్పించుకుంటే మరికొందరు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఒక్కసారి గుంండె పోటు వచ్చిందంటే ఆ సమస్య జీవితాంతం వెంటాడుతునే ఉంటుంది. అసలు గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి కారణాలు ఏంటి.. గుండె సంబంధిత సమస్యలు ఎందుకు వస్తాయంటే..

గుండె జబ్బుకి కారకాలు

గుండెకి సంబంధించిన సమస్యలకి సంకేతాలు ఎప్పుడూ ప్రారంభంలో కనిపించవు. కొందరిలో ఈ లక్షణాలు కనిపించినా.. మరికొందరిలో సమస్య తీవ్రమయ్యేవరకు తెలియదు. గుండె సంబంధిత సమస్యలు అంటే కేవలం హార్ట్‌ అటాక్‌ మాత్రమే కాదు. గుండె రక్తనాళాల్లో సమస్యలు, హోల్స్‌ ఇలా ఏదైనా కావచ్చు. ఈ సమస్యలకి చాలా కారణాలు ఉంటాయి. వయసు, కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉండటం వంటి మన నియంత్రణలో లేని అంశాలు, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరిగిపోవడం, డయాబెటిస్‌, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కావడం, ధూమపానం, అధిక బరువు, నిద్ర లేమి, ఎక్కువ కాలంగా ఒత్తిడి తీసుకోవడం వంటి కారణాల వల్ల గుండె ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో గుండెను ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ఈ అలవాట్లు తప్పనిసరిగా పాటించాలని కార్డియాలజిస్ట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా?అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా?

1. సరైన ఆహారం

గుండె ఆరోగ్యం కోసం ఒకే రకమైన ఆహారం పైన ఆధారపడకూడదు. మొత్తం ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌లో తప్పనిసరిగా పండ్లు, సలాడ్‌, తాజా కూరగాయలు, పప్పు, తృణధాన్యాలు, బీన్స్‌, నట్స్, సీడ్స్‌, తక్కువగా ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌ ఉండాలి. ఉప్పు, చక్కెర, ఫ్రెడ్‌ ఫుడ్‌, ఎక్కుగా ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌ వినియోగం తగ్గించాలి.

2. యాక్టివ్‌గా ఉండండి..

గుండె ఆరోగ్యం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్స్‌ చేయాల్సిన అవసరం లేదు. వాకింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, డాన్స్‌ వంటి కార్యకలాపాలు దోహదపడతాయి. ప్రతివారం కనీసం 150 నిమిషాల శారీరక కార్యకలాపాలు ఉండేలా చూసుకోవడం ద్వారా గుండెకి రక్త ప్రసరణ మెరుగవుతుంది.

3. పొగాకుకి దూరం

ధూమపానం, పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడకం ద్వారా రక్తనాళాలు దెబ్బతింటాయి. దీంతో గుండె జబ్బులు, పక్షపాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గుండె ఆరోగ్యం కోసం ధూమపానం తప్పనిసరిగా మానేయాల్సిందే.

4. రక్తపోటు నియంత్రణ

చాలా మందిలో అధిక రక్తపోటు ఎలాంటి లక్షణాలు చూపించదు. అందరిలాగే సాధారణ జీవితం గడుపుతారు. కానీ అధిక రక్తపోటు ఒక్కసారిగా రక్తనాళాలను దెబ్బతీస్తుంది. ఈ క్రమంలో మీ బీపీ లెవెల్స్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.

World heart day Follow these eight principles for heart health

5. కొలెస్ట్రాల్‌, డయాబెటిస్‌

LDL కొలెస్ట్రాల్‌ పెరిగితే ధమనుల్లో ఫలకం ఏర్పడుతుంది. డయాబెటిస్‌ రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. ప్రీ డయాబెటిస్‌, అధిక కొలెస్ట్రాల్‌ నియంత్రణ కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

6. హెల్తీ వెయిట్‌

అధిక బరువు కారణంగా రక్తపోటు పెరుగుతుంది. డయాబెటిస్‌ అదుపులో ఉండదు. చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువవుతుంది. ఈ బరువును నియంత్రించుకునేందుకు సరైన జీవనశైలిని పాటించాలి. కూల్‌డ్రింక్స్‌, ప్రాసెస్‌డ్‌ స్నాక్స్‌ తీసుకోవడం తగ్గించాలి. ఆహారంలో ఫైబర్‌, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. మితంగా, ఆరోగ్యకరంగా తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.

మన్ కీ బాత్‌ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే!మన్ కీ బాత్‌ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే!

7. సరైన నిద్ర

గుండె ఆరోగ్యంలో సరైన, ఆరోగ్యకరమైన నిద్ర కీలకపాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా ఒకే సమయంలో నిద్రపోవడం, మేల్కోవడం ద్వారా గురక సమస్యలు తగ్గుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. తగినంత నిద్రపోయినా, రోజంతా అలసటగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

8. ఒత్తిడికి దూరం

ఆరోగ్యకరమైన అలవాట్ల కోసం ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడి కారణంగా అతిగా తినడం, ధూమపానం, శారీరక శ్రమ తగ్గించడం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో వాకింగ్‌, ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌, కుటుంబీకులు, ఫ్రెండ్స్‌తో టైం స్పెండ్‌ చేయడం, పని నుంచి చిన్నపాటి విరామాలు తీసుకోవడం ద్వారా ఒత్తిడిని నియంత్రించవచ్చు.

ఈ లక్షణాల పట్ల నిర్లక్ష్యం వద్దు

ఛాతీ నొప్పి, ఒత్తిడి, ఆయాసం, ఎక్కువగా అలసట, తల తిరగడం, హార్ట్‌బీట్‌లో మార్పులు, కాళ్ల వాపు వంటి లక్షణాలు గుండె సంబంధిత సమస్యలకి దారితీస్తాయి. ముఖ్యంగా మహిళలు ఆయాసం, వికారం, వాంతులు, నడుము, దవడ నొప్పి వంటి లక్షణాలు చూడవచ్చు. చల్లని చెమటలు పట్టడం, భుజం, దవడ, చేతి భాగాల్లో నొప్పులు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, September 29, 2026, 11:47 [IST]
Desktop Bottom Promotion