Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఇంటిలోపల పుష్పాలకరణ-సరికొత్త రీతులు

ఇంట్లో పూలను రకరకాల కుండీల్లో ఉంచి అమర్చుకోవడం వల్ల ఇంటికి ఎంతో ఆకర్షణ వస్తుంది. మొక్కల కుండీలను ఇళ్లలో ఉంటి కింద, పైన వేలాడదీస్తున్న చందాన పూల కుండీలను కూడా పలురకాల డెకరేషన్ లతో ఉంచితే ఇల్లు పొందికగా ఉంటుంది. కలర్ పుల్ పవర్ డెకరే షన్‌కు కలర్‌పుల్ ప్లవర్ పాట్‌లు కూడా అవసరమని చెప్పనక్కరలేదు కదా.
పొడవాటి పూలను ఎత్తుగా అలంకరించాలంటే వెడల్పుగా, ఎత్తు తక్కువగా ఉన్న బాటిల్ లేదా కుదురు లాంటివి తీసుకోవాలి. బాటిల్ లేదా కుదురులో పావు వంతు నీరు పోసి, రంగు రాళ్లను, గోళీలను అందులో అందంగా అమర్చాలి. బాటిల్ అడుగున పేర్చే రాళ్లు, గోలీలు పరిసరాల రంగుతో మ్యాచ్ అయితే ఆకర్షణీయంగా ఉంటుంది.
ఈ ప్లవర్ పాట్ ను టీపాయ్ మీద పెట్టేటట్లయితే సోఫా సెట్ కలర్ లేదా గోడల రంగును దృష్టిలో పెట్టుకోవాలి. ఆలా సాధ్యం కానప్పుడు ఆ గదిలో ఉండే మరో వస్తువుల మీదకు చూపు సారించాలి. ఫ్రిజ్, పుస్తకాల షెల్ప్, వాల్ హేంగింగ్, పెయింటింగ్, కర్టెన్‌లు వంటి వాటిమీద కూడా పెట్టవచ్చు.
ప్లవర్ డెకరేషన్ కు ప్రత్యేకమైన పూలను సేకరించనక్కరలేదు. ఇంట్లో దొరికే అన్నిరకాల క్రోటన్ ఆకులను, పూలను, జినియా, దాలియా, మందార, ఉమ్మెత్త ఇలా అందుబాటులో ఉన్న పూలను వాడవచ్చు. అయితే పూలను అమర్చడంలోనే అందం వస్తుందని గ్రహించాలి.



Click it and Unblock the Notifications
