Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
స్వర్గాన్ని మరపించేయండి!

క్రింద పేర్కొనే ఆసక్తికరమైన వివిధ రకాల అతి సామాన్య గోడల అలంకరణలు ఎలా చేయాలో చూడండి!
1. మొదటగా మీ కిష్టమైన అంశాన్ని ఎంచుకోండి. అంశాన్ని బట్టి మీకు కావలసిన విధంగా గోడను అలంకరించటానికి వస్తువులు సేకరించండి. ఇవి స్టికర్లు, మేగజైన్ కటింగ్ లు, చిన్న బొమ్మలు, మొదలైనవి కావచ్చు.
2. కాలేజీ ఫొటోలు, ఇతర జ్ఞాపకాలతో కూడిన ఫొటోలను బులెటిన్ బోర్డు, లేదా కార్డ్ బోర్డ్ పై ప్రదర్శించండి. ఇంకా గోడ ఖాళీ వుంటే చిన్నపాటి కామిక్ స్ట్రిప్ లు పెడితే బాగుంటుంది.
3. మీ పిల్లల ఫొటోలు సేకరించండి. కార్డ్ బోర్డ్ పై అంటించండి. మీరే ఒక చిన్న ఫ్రేమ్ తయారు చేయండి. ఇంకా మీ పిల్లవాడి టాయ్ బాక్స్ లో కొన్ని ప్రత్యేక వస్తువులు కూడా అలంకరణలకు కనపడతాయి.
4. స్ధానికంగా పురాతన వస్తువుల మార్కెట్ లో ఒక పురాతన గోడ గడియారం లేదా ఇతర గోడ అలంకరణలు సేకరించండి. ఒక పురాతన లాంతరు దీపం వంటిది కూడా గోడ అలంకరణకు బాగుంటుంది.
5. అద్దాలు అమర్చండి. మంచి కాంతిగా వుంటుంది. గది మరింత విశాలంగా కూడా కనపడుతుంది. అద్దాల డిజైన్లు సాధారణమైనవి కాకుండా, ప్రత్యేకమైనవిగా వుండాలి.
6. నేడు మార్కెట్ లో రకరకాల ఆకర్షణీయమైన వాల్ హుక్ లు వస్తున్నాయి. వీటిని గోడకు పెడితే, కోటు, బెల్ట్, బ్యాగులు మొదలైనవి వేలాడతీయవచ్చు.
7. గోడల అలంకరణ పూర్తయితే, సీలింగ్ అలంకరణ మరువకండి. ఇది కూడా గది అలంకరణలో భాగమే. బాగా కనపడే రంగులతో సీలింగ్ నింపండి. చివరకు బెడ్ పై వెల్లకిలా పడుకొని సీలింగ్ కేసి చూస్తూ వుంటే.....వేరే ప్రపంచంలోకి వెళ్ళనట్లుంటుంది.
ఇకనుండి, మీకు వచ్చే ఆహ్వానపు కార్డులు, అదనపు కేలండర్లు, లేదా పేంప్లెట్లు మొదలైనవి పారవేయకండి. గోడ అలంకరణ సింపుల్ గా చేసేటపుడు ఇవి బాగా ఉపయోగిస్తాయి.



Click it and Unblock the Notifications
