Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గృహమే కదా స్వర్గసీమ!

1. మీ అభిరుచికితగ్గ ప్రాంతాన్ని ముందుగా ఎంపిక చేయండి. అపార్టుమెంటా లేక ఇండిపెండెంట్ ఇల్లా అనేది నిర్ణయించుకోండి. నివసించే ప్రాంతం మీకు అనువైనదిగా వుండాలి.
2. మీ ఇంటి అలంకరణ మీరంటే ఏమిటో తెలియచెప్పేదిగా వుండాలి. మీ స్టైలు, క్రియేటివిటీ అందులో కనపడాలి. కేరళ ఇంటీరియర్స్ కావాలంటే కొద్దిపాటి సాంప్రదాయ, ఆకర్షణీయ వస్తువులు ఎంపిక చేయాలి.
3. కేరళ రాష్టంలోని ఇండ్లలో పురాతనంగా వాడేది చెక్క లేదా కలప. ఫ్లోరింగ్, తలుపులు చెక్తో చేసినవైతే చాలా బాగుంటాయి.
4. నేటి రోజుల్లోని ఆధునిక ఫర్నిచర్ ఇంటికి ఎంతో అందాన్నిస్తోంది. వివిధ రకాల ఆకృతులు, రంగులు మీ గదికి సరిపోయేలా ఎంపిక చేయండి. కేరళ సంస్కృతి ప్రతిబింబించాలంటే ఇంటీరియర్ అలంకరణలకు చెక్క, చేతిపని, ఐవరీ, కోకోనట్ మొదలైనవి వుండాలి. ఇవి అలంకరణకేకాదు, క్లాసికల్ గాను సౌకర్యంగాను వుంటాయి.
5. లివింగ్ రూమ్ లో ఒక కార్నర్ లోనే కాదు రెండు చోట్ల సోఫా సెట్లు వేయండి. డైనింగ్ కు ప్లేస్ లేదా? లివింగ్ రూమ్ కు ఒక పక్కన సగం ఎత్తులో చెక్కతో సెపరెట్ చేయండి. డైనింగ్ రూమ్ కు టేబుల్స్ కు గ్లాస్ ఫర్నిచర్ వాడండి. లివింగ్ రూమ్ గోడలు బ్రైట్ కలర్లు వుండాలి. డైనింగ్ రూమ్ కు మెటాలిక్ రంగు వుండాలి.
6. బెడ్ రూమ్ లో స్ధలాన్నిబట్టి బెడ్స్ సైజు నిర్ధారించండి. వార్డు రోబ్స్ ఒక మూలగా వుంచండి. మిర్రర్ ను సౌకర్యవంతంగా కూర్చోగలిగిన చోట వుంచండి. నేలపై తివాచీలు పరిచి అద్భుతంగా వుందనిపించండి.
7. కేరళలోని ఇండ్లు సాధారణంగా పర్యావరణ స్నేహ పూరితంగా వుంటాయి. సోలార్ ఎనర్జీని అధికంగా వాడండి.
ఈ ఏడు బంగారు సూత్రాలు పాటించి కేరళ రాష్ట్ర ఇంటి నమూనాను పొందండి. అయితే మీ ఇల్లు మీ అభిరుచిని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. అంకరణ చేసే ముందే బాగా ఆలోచించండి. దానిని మార్చాలంటే ఎంతో వ్యయంతో కూడుకొనిన పని అవుతుంది.



Click it and Unblock the Notifications