Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
వేసవిలో ఆహ్లాదాన్ని...హాయి గొలిపే బాల్కానీ డెకరేష్....

1. ఓవెన్ బ్లిండ్స్: కేన్ తో తయారు చేసినటువంటి విండో కర్టెన్స్ అలంకరణప్రాయంగాను, గాలి, వెలుతురు ధారాళంగా వీచే సౌంకర్యవంతంగాను ఉండేటటువంటివి. బాల్కానీ కిటికీలకు, డోర్ లకు వేలాడదీస్తే అందంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. సాయంత్రం వేళ ఓపెన్ ఎయిర్ టీపార్టీ ఎంచక్కా చేసుకోవచ్చు.
2. డార్క్ గ్లాస్: వేసవిలో ఎండతీవ్రతను తట్టుకోవడానికి బాల్కానీకి డార్క్ గ్లాస్ వినియోగించినట్లైతే సూర్య కిరణాలు డైరెక్ట్ గా ఇంట్లోకి పడుకుండా అడ్డుకుంటాయి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లైతే ఎండలో బయటికి వెళ్ళకుండా అక్కడే ఆడుకొనే సౌకర్యం కల్పించవచ్చు.
3. బాల్కానీ ఫర్నీచర్: సాధారణంగా చాలా మంది బాల్కానీని బట్టలు ఆరబెట్టుకొనుటకు, ఇతర వంటింటి పదార్థాలు ఎండబెట్టుకొనుటకు ఉపయోగిస్తుంటారు. సమ్మర్ లో వీటికి కొంచెం డిఫరెంటుగా కొంచెం సేపు కూర్చుని సేదతీరే విధంగా అలంకరించుకొంటే ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసం ఉడ్ తో తయారు చేసిన కేన్ టూల్స్, సోఫా సెట్స్ అక్కడ అమర్చుకొంటే ఎండవేడమికి తట్టుకోగల శక్తి కేన్ ఫర్నీచర్ కే ఉంది. కనుక కేన్ ఫర్నీచర్ ను బాల్కానీలో సమ్మర్ డెకరేషన్ గా అలకంరిచుకోవచ్చు.
4. పచ్చదనం: వేసవిలో చాలా వరకు ఇంటి వాతారణం చల్లగా ఉండేట్లు చూసుకోవాలి. అందుకోసం బాల్కానీలో చిన్న చిన్న మొక్కలను పెంచుకొన్నట్టైతే ఇంటికి చల్లదనంతో పాటు బాల్కానీకి మరింత అందాన్నిస్తుంది. దాంతో బాల్కానీ గ్రీన్ హెవెన్ గా కనిపిస్తుంది. కాకపోతే వాటి రక్షణలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని సూర్యరశ్మి ఎక్కువ తగలకుండా కాపాడుకోవాలి.
5. ఫ్లోయింగ్ వాటర్: వీటనింటితోపాటు బాల్కానీలో ప్లోటింగ్ వాటర్(ధారలుగా చిరుజల్లు కురిపించే కృత్రిమ జలపాతం) ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ వాతరం మరింత ఆహ్లాదకరంగా మార్పు చెంది మనస్సు ఆహ్లాదాన్ని..హాయిని కలుగజేస్తాయి.



Click it and Unblock the Notifications
