Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
అదే ఇల్లు, అవే వస్తువులు.. కొంచెం కొత్త , కొంచెం వింత

ఇంట్లో మన సౌకర్యార్ధం టీవీ, ఫ్రిజ్జు, వాషింగ్ మెషిన్ - ఇలా బోల్డన్ని వస్తువులు కొంటాం. వాటిని డ్రాయింగ్ రూం లో, డైనింగ్ హాల్లో, కిచెన్లో వీలును బట్టి సర్దుకుంటాం. అప్పటికి అది బాగుంటుంది.
కానీ... కొన్నాళ్ళు గడిచాక రొటీన్ గా అనిపిస్తుంది. కూరలు, చీరలు, నగలూ నట్రా లాగానే ఇంటి విషయంలోనూ మార్పు కావాలనిపిస్తుంది. అయితే దుస్తులు మార్చినట్లుగా ఇంటిని మార్చడం సాధ్యం కాదు. పాత వస్తువులను మార్చి కొత్త వస్తువులను కొనుగోలు చేయడమూ కుదరదు. అంత అవసరం కూడా లేదు. అయితే మనసుంటే మార్గం ఉంటుంది. అదే ఇంటిని, అవే వస్తువులతో మార్పును తీసుకురావచ్చు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులు 'భలే ఉందే.. ఎం చేశారు, ఏదో కొత్తకొత్తగా వింత అందం కనిపిస్తోంది' అనేస్తారు.
అందుకోసం ఏం చేయాలంటే...సోఫాలు, టేబుళ్ళు మొదలైన వాటిని స్థల మార్పిడి చేయండి. చేయాలి కదా అని ఫ్రిజ్జును తీసికెళ్ళి ముందు గదిలో పడేయలేం. మనకు సౌకర్యంగా ఉంటూనే కొత్త శోభ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. డైనింగ్ టేబుల్ మొదలైనవాటికి కవర్లు మారిస్తే సరి, మరింత కొత్తదనం వస్తుంది.ఇది చాలా సింపుల్.
గది మధ్యలో సోఫా, దానికి ఇరువైపులా కుర్చీలు, మధ్యలో టీపారు చూడటానికి బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ అదే తరహా అంటే మాత్రం.... అసౌకర్యంగా అనిపించవచ్చు. అందుకే ...సోఫాను మధ్యలో కాకుండా గోడ పక్కన ఉంచితే గది విశాలంగా ఉంటుంది. అలాగే సోఫాల పక్కన చిన్న పూలకుండీని ఉంచితే...ఆ ప్రత్యేకతే వేరు.
ఇందుకు ఖర్చు పెట్టాల్సింది ఏమీ ఉండదు. కావలసిందల్లా కాస్తంత కళా హృదయం. కొద్దిగా శ్రమ పడితే చాలు మళ్ళీ కొన్నాళ్ళపాటు ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. పాతబడింది అనుకున్నప్పుడు మళ్ళీ మారిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కొత్త కళ రావడమే కాదు నూతనోత్సాహమూ వస్తుంది.



Click it and Unblock the Notifications
