Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
అతిథులకు ఘనస్వాగతం పలికే ఫర్నీచర్....

అలంకరణ వస్తువులకు మృదువుగా ఉండే టెక్చర్లు, ఉతికేందుకు వీలుగా ఉండే బట్టలను ఎంచుకోవాలి. సాఫ్ట్ బ్రష్ తో వ్యాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించాలి. మంచి క్వాలిటీ ఉన్న ఫ్లోరింగ్ క్లీనర్ ను ఉపయోగించాలి. ఫ్లోర్ శుభ్రత కోసం ఎప్పుడూ మంచి ప్యాడ్ నే ఉపయోగించండి. చిన్నపాటి అక్వేరియం, ఫౌంటెయిన్‌లతో లివింగ్ రూంను అలంకరిస్తే ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది. ఫర్నీచర్ అంతా ఏ గదిలో ఉందో దాని పాయింటెడ్ హెడ్ కింద కాటన్ వాల్ లేదా ఫర్నీచర్ ప్యాడ్ పెట్టుకోవాలి. అలాగే తలుపులు దగ్గర డోర్ మ్యాట్ ను ఉపయోగించుకోవాలి. దీన్ని తరచుగా శుభ్రం చేస్తుండాలి.
టీపాయ్ మధ్యలో సువాసనలు వెదజల్లే కొన్ని కొవ్వొత్తులను ఉంచాలి. సాయంకాలాల్లో వాటిని వెలిగిస్తే ప్రకాశవంతంగా ఉండటమేగాక ఇల్లంతా సువాసనలతో నిండిపోతుంది. అలాగే మంచి రంగులుండే నిలువు ఉండే టేబుల్ మ్యాట్‌ను టీపాయ్ కింద వేయాలి. ఇంటికి వచ్చే అతిథులను ఆకర్షించటంలో పుస్తకాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని అభిరుచులకు అనుగుణంగా అందంగా అమర్చి పెట్టుకోవాలి.
సోఫాపై మెత్తగా, మెరిసే వర్ణాలతో ఉండే పిల్లోలను వాడాలి. పడకగదిలో పువ్వుల డిజైన్లు, ఆకర్షణీయమైన రంగులతో ఉండే విధంగా పరుపును ఎంచుకోవాలి. సూర్యకాంతిని గ్రహించి బయటికి పంపించేలా ఉండే అనువైన అద్దాల కిటికీలను పడకగదిలో వాడాలి. పసుపు, బంగారు రంగుల్లో ఉండే ల్యాంప్‌షేడ్ల వల్ల గదిలో ఉత్తేజకరమైన వాతావరణం నెలకొంటుంది. సాదాసీదాగా ఉండే గోడలపై వెరైటీగా ఉండే వాల్‌పేపర్లను అతికిస్తే, కొత్తదనంతో గది మెరిసిపోతుంది.



Click it and Unblock the Notifications