Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బ్యాచిలర్ల భవంతి బ్యూటిఫుల్ గా వుండాలంటే?

1. తక్కువ ఫర్నిచర్ - ఫర్నిచర్ తక్కువగా, అదికూడా అన్నీ మడతేసి పక్కన పడేసే టైపులో వుండేవిగా ఏర్పాటు చేయండి. టేబుల్ కూడా మడిచి గోడపక్కకు జరిపేసేదిగా వుండేటా నేడు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. వాటిని ఉపయోగించండి.
2. కర్టెన్లు కూడా వుండాల్సిందే - సిల్క్ కర్టెన్లు కాకపోయినా దట్టంగా డార్క్ రంగులలో వుండే కర్టెన్లు ఎంపిక చేసి వేయండి.
3. సీట్ల ఏర్పాట్లు - చాలా సమయం మీరు టి.వి. చూస్తూ లివింగ్ రూమ్ లో గడిపేస్తారు. కనుక అక్కడవుండే సీటింగ్ ఏర్పాట్లు సౌకర్యవంతంగా వుండాలి. లివింగ్ రూమ్ లోనే ఒక దివాన్ లేదా కాట్ వంటివి వేసేస్తే చాలా సౌకర్యంగా వుంటుంది. బీన్ బేగ్స్, పెద్ద కుషన్లు, చిన్న స్టూళ్ళు లివింగ్ రూమ్ కు మంచి సౌకర్యాన్ని లుక్ ను ఇస్తాయి.
4. మీకున్న పరికరాలు - మీ వద్ద వున్న బొమ్మలవంటివి కొన్ని అలంకరణగా ప్రదర్శించండి. మీకున్న హోం ధియేటర్ ఇల్లు అంతా వినపడేలా ఏర్పాటు చేయండి. ల్యాప్ టాప్ కు పర్మినెంట్ టేబుల్ వేయండి. మీరు ఒక కుర్చీ కూడా పెట్టుకోండి. చూసేటందుకు, వాడుకునేటందుకు కూడా బాగుంటుంది.
5. మీ హాబీలేమిటో ప్రదర్శించండి - మీరు నివసించే ఇల్ళు మీ ఆసక్తి తెలియపరచాలి. చాలా బ్యాచిలర్ ఇండ్లలో ఇది కనపడదు. మీ కుటుంబ సభ్యుల, స్నేహితుల, కాలేజ్ సహచరుల చిత్రాలు పెట్టండి. లేదా పోస్టర్లవంటివి పెట్టాలనుకుంటే, వాటిని చక్కగా ఫ్రేమ్ చేయించి ఆకర్షణీయంగా వుంచండి.
6. అన్నిటికి మించి మీ ఇంటికి వచ్చే స్నేహితులకు, రాత్రంతా వుండేవారికి కొన్ని సౌకర్యాలు చేయండి. అదనపు తలగడలు, కుషన్లు, బెడ్ షీట్లు, బ్లాంకెట్లు, మేట్రస్ లు వేసి వుంచండి. ఈ సౌకర్యాలన్నీ చేస్తే మీ బ్యాచిలర్ ప్యాడ్ బహు చక్కగా వుంటుందనటంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications