Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
హోదా...హుందాతనం పెంచే అలంకరణ....

ఇంటి అలంకరణ హోదాని పెంచేందుకు, హుందాగా జీవించేందుకు అవి తప్పనిసరే అనిపిస్తాయి. మరి అలా అని అక్కరకు లేని వస్తువులన్ని తెచ్చేసుకుంటే పరిమితమైన స్థలంలో వాటిని సర్ధుకోవటం పెద్ద సమస్యగా మారుతుంది. పట్టణాలు, నగరాల్లో తరచూ అద్దె ఇల్లు మారే వారికి ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఒక కుటుంబ సభ్యులందరూ కలసి మెలసి ఉంటే ఇంట్లో ఎంత ప్రశాంతత ఉంటుందో వస్తువులన్నీ ఆయా స్థలం కొలువుతీరితే ఇంటికి వచ్చే ఆ అందమే వేరు. ఆనందమే వేరు.
ఇంటిని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దుకుంటే గౌరవం, మంచి హోదా లభిస్తుంది. వారివారి స్థాయిల్ని బట్టి ఇంటిని అలంకరించుకోవచ్చు. ఇంటిని చూసి, ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇంటిని ఎంత చక్కగా దిద్దుకుంటే అంతపేరు ప్రతిష్ఠలు వస్తాయి. అందుకే ఇంటిపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఇంటిని శుభ్రంగా పెట్టుకోక పోతే చాలామందికి చిరాకు. సామాన్లతో ఇంట్లోని గదులన్నిటినీ నింపేస్తే చాలా చికాకుగా కనిపిస్తుంది. గదిలో ముప్పావు భాగం లేదా సగభాగమైనా ఖాళీగా వదిలేస్తే చూడటానికి విశాలంగా కనిపిస్తుంది. గదులన్నీ సామాన్లతో నింపేస్తే ఎంత విశాలమైన ఇల్లైనా చిన్నగానే కనిపిస్తుంది.
ఒక గదికి ద్వారాలు ఎక్కువగా ఉన్నప్పుడు వస్తువుల అమరిక కష్టం. ఉదా: లివింగ్ కం డైనింగ్ రూంకు ప్రధాన ద్వారం కాకుండా మరోనాలుగు ద్వారాలు అదనంగా ఉన్నప్పుడు అంటే బెడ్ రూంలు, టాయ్ లెట్, కిచెన్ ద్వారాలుంటే సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్ అమర్చడం కష్టంగానే ఉంటుంది. ఇవి తప్పనిసరిగా అమర్చవలసినవి కాబట్టి గదుల్లో స్థలం ఉన్నప్పటికీ అది ఒక గదిలో నుండి ఇంకో గదిలోకి వెళ్లడానికి దారిగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఇలాంటి గదులు ఉన్నవారు స్థలం ఎక్కువగా ఆక్రమించే సోఫాలు గట్రా వాడకపోవడం మంచిది.
ఇంట్లో గదుల గురించే కాకుండా ఇంటి ముందు వుండే ప్రదేశంలో, ఇంటి వెనుక పెంచే మొక్కలు, ఊయలకు గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఇంటి వరండాలోనూ, ఇంటిముందువున్న ఖాళీ ప్రదేశంలోనూ పెంపుడు జంతువుల కొరకు కేజ్ లు ఏర్పాటుచేసుకోవాలి. వాటిలో రంగు రంగుల పక్షులు, చిలకలు, లవ్‌బర్డ్స్, మైనాలు వంటివి తెచ్చి పెట్టుకొంటే మరింత ఆకర్షణఅందం. కుక్కలు, కుందేలులాంటి జంతువులు కూడా ఇంటి అందాన్ని పెంచుతాయి. మీ ఇల్లు ప్రశాంత నిలయంగా ఉండేలా తీర్చిదిద్దడానికి ఇంట్లోని ప్రతి గది కొలతలు మీకు క్షుణ్ణంగా తెలిసివుండాలి. అప్పుడే ఇంటి అలంకరణ విషయంలో స్పష్టమయిన అవగాహన కలిగివుంటారు.



Click it and Unblock the Notifications
