Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బడ్జెట్ ను బట్టి ఫర్నీచర్ ఎంపిక చేసుకోవాలి?

లివింగ్ రూమ్: మీరు ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అపార్ట్ మెంట్ లో నివసించాలనుకొంటున్నారు. అప్పుడు అపార్ట్ మెంట్ లో కామన్ డ్రాయింగ్ రూమ్ - డైనింగ్ రూం రెండు ఒకే ప్రదేశం కలిగి ఉంటుంది. అందుకు ముందుగా ఆ ప్రదేశంలో ఏం కావాలో ఆలోచించాలి. తర్వాత అక్కడికావాల్సిన ఫర్నీచర్ ను అతి తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఫర్నీచర్ ఎంపిక చేసుకోవాలి. లివింగ్ రూంలో ముఖ్యంగా ఉండాల్సింది, కావాల్సింది సోఫా అయితే వెంటనే కొనకపోవడమే ఉత్తమం. ఎక్కువ ఖర్చుతో కూడుకొన్న ఫర్నీచర్ కొనకున్నా మొదట సౌకర్యవంతంగా ఉన్న కుషన్స్ అరేంజ్ చేసుకోవచ్చు. లేదా తక్కువ ధరలో సింపుల్ గా ఉన్న సోఫాను తెచ్చుకోవచ్చు. సోపా దగ్గ బేసిక్ ఫర్నీచర్ టేబుల్ అవసరం ఉంటుంది. దాని ప్లేస్ లో ఒక మంచి సాలిడ్ సెంటర్ టేబుల్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పులు పెట్టుకోవడానికి షూర్యాక్స్ బయట దొరుకుతాయి. ఇది అవసరమే. అయితే మీ అవసరంమేరకు తెచ్చుకోవచ్చు.
డైనింగ్ (భోజన)ప్రదేశం: ప్రతి ఇంట్లో అందరూ కలిసే చోటు భోజనాల గదిలోనే. ఒక్కటిగా కలిసి భోంచేస్తారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఒక డైనింగ్ టేబుల్, కావాల్సిన కుర్చీలు ఆ ప్రదేశానికి అందంతో పాటు, సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఒంటరిగా మీ కొత్త జీవితానికి, కొత్త ఇంటికి ఏది అవసరమో వాటికి మాత్రమే ప్రాధాన్యతనివ్వండి. వెదురు, టేకు ఇలాంటి ఎక్కువ ఖరీదైనవి కాబట్టి టేబుల్ టాప్స్ కి తక్కువ ఖర్చుతో కూడిన గ్లాస్ టాప్స్ ఎంపిక చేసుకోవడం మంచిది. వంటగదిలో ఒక చిన్న టేబుల్ కావాలనిపిస్తే అందుకు ప్లాస్టిక్ టేబుల్ సరిపోతుంది. అప్పుడు డైనింగ్ టేబుల్ ను లివింగ్ రూంకు మార్చుకోవచ్చు.
పడకగది: ఎక్కువ సౌకర్యవంతంగా ఉండే ప్రదేశం, ఎక్కువ విశ్రాంతి తీసుకొనే ప్రదేశం పడకగదే కాబట్టి, అక్కడి ఇతరులు ఎవ్వరు ప్రవేసించరు కాబట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టేటప్పుడు బెడ్ లేకపోయినా సరిపోతుంది. అందుకు బదులుగా ఫ్లోర్ పైన పరచుకొనే మంచి మన్నికైనటువంటి మాట్రస్ ను ఎంపిక చేసుకోవాలి. ఇది ప్రత్యేకంగా క్రింద ఉడ్ తో అమర్చి, ఒక్క బెడ్ కు మాత్రమే పరమితం చేయబడి ఉంటుంది. ముఖ్యంగా పడకగదిలో మీకు ఏం కావాలనుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా తక్కువ ఖర్చులో నైనా తెచ్చి అమర్చుకోవాల్సి ఉంటుంది. వాటి ఎంపిక వుడ్ కాకపోయినా, మెటల్ లో దొరుకుతాయి. బెడ్ కు సైడ్ టేబుల్, నైట్ లాంప్ ఇటువంటి బెడ్ రూంలో తప్పనిసరిగా ఉండాల్సినవి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకొన్నట్లతే మీ కొత్త జీవితాన్ని అతి తక్కువ ఖర్చు ప్రారంభించి సుఖవంతంగా గడపొచ్చు. కాబట్టి మీకు ఎది అవరసరమో...ఏది అనవసరం బేసిక్ గా తెలుసుకొని కొత్త జీవితాన్ని ఆరంభించండి.....



Click it and Unblock the Notifications