Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కంటికి..కాలికి ఇంపైన ఉడెన్ ఫ్లోరింగ్....

1. ఫ్లోరింగ్ అంటే.. టైల్స్, మార్బుల్స్, గ్రానైట్, ఫోర్ స్లీనెసెస్, వర్టిఫై టైల్స్ అనుకుంటారు. కానీ వాటితో పోలిస్తే ఉడెన్ ఫ్లోరింగ్ చాలా బాగుంటుంది.
2. ఈ ఫ్లోరింగ్ శుభ్రంచేసుకోవడం చాలా సులభం. అంతేకాదు, ఫ్లోరింగ్ ను మార్చాలంటే కూడా టైం ఎక్కువ పట్టదు. మళ్లీ ఈ ఉడ్ ని వేరేవిధంగా కూడా ఉపయోగించుకోవచ్చు.
3. ఒక్కోసారి పొరబాటుగా చేయితగిలి నీళ్లు, కూల్ డ్రింక్స్ లాంటివేమైనా ఒలికిపోతే వెంటనే తుడిచేయాలి. లేదంటే మరకలు పడటం, ఒక్కోసారి అంతమేరకు చెక్క ఉబ్బినట్లవటం లాంటివి జరగవచ్చు. కాబట్టి, సాధ్యమైనంతవరకూ నీళ్లలాంటివి ఒలికి పోకుండా చూసుకోవాలి.
4. పాత ఉడెన్ ఫ్లోరింగ్ అయితే ఒకే షేడ్ లో ఉండేది. ఇప్పుడు అలా కాదు, చాలా డిఫంట్ షేడ్‌లు మార్కెట్‌లో అందుబాటులోకొచ్చాయి. అయితే మన ఇంటీరియర్స్‌కి నప్పేవిధంగా ఫ్లోరింగ్ ఎంపిక ఉండాలి.
5. వోక్, మాపుల్, వెంగ, చెర్రి అని ఇలా చాలా రకాల ఉడ్స్ ఉన్నాయి. ఇవి వివిధ షేడ్ లో ఇంటీరియర్స్ కి మ్యాచ్ అయ్యేవిధంగా ఉంటాయి.
6. ఈ ఫ్లోరింగ్ ఏ రూమ్‌లో అయినా వేయించుకోవచ్చు. అయితే కిచెన్ లో వేయించుకోకపోవడం మంచిది.
7. బ్రైట్ కలర్ ఉడ్ తీసుకుంటే గది విశాలంగా కనిపిస్తుంది. కాకపోతే మన ఇంటి థీమ్‌ని బట్టే వీటి కలర్ ఎంపిక చేయాలి.
8. ఏవైనా బరువైన బల్లల్లాంటి వాటిని అటూ ఇటూ జరపాల్సి వచ్చినప్పుడు నేలమీద ఈడ్చినట్లు చేయకూడదు. ఫ్లోరింగ్‌పై గీతలు, చారలు పడకుండా ఉండాలంటే ఇంటీరియర్స్‌కి బఫర్స్ ఉపయోగించాలి. దీంతో గదులు మరింత కాలం అందంగా కనిపిస్తాయి.



Click it and Unblock the Notifications